మన ప్రపంచాన్ని కాపాడుకుందాం..


ఆక్రోశాలు - ఆక్రందనలేనా
నిస్సహాయత - నిట్టూర్పులేనా?

మారణహోమాల సుడిగుండాల్లో
మంచు బిందువుల సున్నితత్వం
ఆవిరైపోవాల్సిందేనా?

మనుశులమనుకుంటూ
మనసు గతులను తెలుసుకుంటూ
కళ్ళు చూపే ప్రపంచంలో
హడావిడిగా పరుగెడుతున్న మనం,

ఒక్కసారి మానవత్వాన్ని స్మరిద్దాం మనస్పూర్తిగా.
గడిచిన కాలన్నీ ఎలాగూ పొందలేము

మిత్రులారా !!
కనీస ధర్మంగా మన
ముందున్న సమాజాన్ని
కొత్తలోకంగా మారుద్దాం...


మానవ విలువలను కాపు కాస్తూ
మన ప్రపంచాన్ని కాపాడుకుందాం..

 

సాలె గూడు...

నిశ్శబ్దంగా... నన్ను నేను చీల్చుకుంటూ
స్నేహం పోగులను స్రవిస్తూ
నా చుట్టు నేను అల్లుకుంటున్నాను నమ్మకంగా.!!??

చూస్తూనే దట్టంగా పేరుకుపోయి
దారి కూడా కనబడకుండా,
శ్వాసించడానిక్కూడా అవకాశం లేకుండా అయ్యి
ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను..

అదృష్టమో - దురదృష్టమో గాని
నమ్మకం పోగులు కాలి
ఒక్కసారిగా వెలుగొచ్చి నా కళ్ళు పోయాయి...

మళ్ళీ అల్లుకుంటున్నాను
నా మనుగడ కోసం
కొత్తగా నమ్మకం పోగులను చీలుస్తూ....

ఈ ప్రశ్న నన్నింకా వొదలడం లేదెందుకో!!

సంవత్సరాలుగా నా మెదడును తొలుస్తున్న
ఈ ప్రశ్న నన్నింకా వొదలడం లేదెందుకో!!
అన్నీ నావనుకుంటూ
నేనే అన్నీ అనుకుంటూ
అమ్ములపొదిలో దాచుకున్న
ఇడియాలతో-ఆడుకుంటూ
అక్కరకురాని చుట్టాలతో
అవసరాలకుమించి
బంధాల సుడి గుండాల్లో
చిక్కుకుని, భావస్పర్ష ఘర్షణల్లో
ముసుగులేసుకుని-ఎవరికి తెలియని
మంచితనాన్ని ఆపాదించుకుని
కుంచించుకుంటూ-కంగారు పడుతూ
హడావుడిగా బ్రతుకుతున్న
మనకు.......
అసలు నిజం తెలిసేదెపుడు...

నా నుండి నేను దూరమవుతూ ...


సత్యాలను తెలుసుకోడానికి
జీవితకాలం కావాలా?
జీవితం సత్యమా???

అశృధారల ప్రవాహంలో
అంతు చిక్కని ఆలోచనలతో

మౌనంగా చీకటిగదిలో
నా పక్కనే నేనుంటూ, ఒదార్చుకుంటూ,
నీడతోడుగా...నేను -
అర్థంకాకుండా!!


ఎందుకో నా నవ్వును
తీసుకుని పరుగెడుతూ నువ్ ,

నా నుండి దూరమవుతూ
శూన్యంలో నిన్ను వెతుకుతూ నేను


వ్యర్థంగా.......................

నీ జ్ఞాపకాల శిధిలాల్లో!!!


ఆకలితో ఉన్న నాకు దొరికిన పరమాన్నం
నీతో పరిచయం....

బ్రతుక్కి అర్థం లేకుండా-తెలియకుండా
ఉంటున్న నా జీవితం?
నీ రాకతో పరిపూర్ణమైంది.....

అనుకున్నాను...


నీ నవ్వులో పువ్వులేరుకుంటూ
సంబరపడ్డాను..సంతోశించాను,
ఆఖరికి నువ్ నన్ను వొదిలిన క్షణాన కూడా
ఎదిరించలేని భాధ పడిన నీ హృదయాన్ని
తల్చుకుని ఎడ్చానేకాని - అది స్వార్థపు
ముసుగేసుకుని నన్ను చంపడానికని అనుకోలేదు.

ఐనా నువ్వంటే నాకు ఇష్టమే ఎప్పటికి..

కాని...

నీ జ్ఞాపకాల శిధిలాల్లో
చిక్కుకుని
బిక్కు బిక్కుమంటూ
కొన ఊపిరితో నేను.......

గుండె గదికి కిటికీ లేదెందుకో......


బరువుగా నా కళ్లు మత్తుగా కూడా..
ఐనా శాంతిలేదు ఎందుకో!

నిన్నటి ఆ జ్ఞాపకాల వెగటు వాసనలు
అసహ్యంగా అటూ-ఇటూ తిరుగుతూ,
అక్కడే తచ్చాడూతున్నాయి.

ఆశల పిల్లగాలుల తెమ్మెరలు లేక,
ఎండిన మొండి గోడల బీటలు చిత్రంగా అదోలా.

రాత్రి కలత కలల్లో భవిష్యత్తు మసగ్గా !!!
ఐనా నా గుండె గదికి కిటికీ లేదెందుకో......

ఆఖరి శ్వాసలో మన బంధం !!
జీవితం అద్భుతం


అంతులేని ఆనందం
ప్రకృతి నాకందించిన
వరం.................

నీ పరిచయంతో అవి రెట్టింపయ్యి
ఆకసం-సముద్రాలు నేస్తాలయ్యాయి....

నీ కల్మషపు ఇష్టాన్ని
ప్రేమ అనుకున్నాను,.. నా గుండెను చీద్రం చేసి
మంటలను రేపుతున్నాయి ఇంకా............
ఏం చేయాలో తెలియక
నీ కళ్ళను ఆశ్రయిస్తే
అపహాస్యం చేస్తూ వెక్కిరిస్తున్నాయి...


నీ పైన నా ఇష్టం నాలోని మనిషిని
ఎదగనివ్వలేదేమో కదా...??


నాలోని నీ పైన ప్రేమ నశిస్తూ................

ఐతే... !!!పుట్టుకా-బ్రతకడం-చావడమే జీవితం ఐతే...

నీ కొరకై ,
నాలో నేనూ,
నాతో ,
ఆలోచనలతో,

అస్థిత్వాన్ని అందుకోవాలనుకుంటున్నాను....!!!!

మౌనపు ముసుగేసుకుని!!


పుట్టుక దగ్గర్నించి - చచ్చే వరకు జరిగే తతంగంలో ఇరవయ్ శాతమే మనకు తెలిసి ప్రమేయంతో జరుగుతున్నాయి ఒక్క సారి ఆలోచించండి.
చిత్రమైన విషయం ఏంటంటే -
ఇక్కడ ఎవరికీ తెలియదు ఎందుకు బ్రతుకుతున్నామో? ,
కాని అందరం హాయిగా ఉండటానికి చాలా వసతులు -వెసులుబాటులూ కల్పించుకున్నాము తెలివిగా .
ఒకరిని హాయిగా చంపొచ్చు చట్టం - న్యాయం లాంటివి నీకు క్షమ, రిహాబిలిటేశన్ పేరుతో తప్పించుకునే అవకాశాన్ని దోసిట్లో పట్టి అందిస్తుంది ,
దానికై చట్టం చదివిన ఇంటలెక్చువల్ బ్రూట్స్ ఎప్పుడూ రడీగా ఉంటారు సహాయం ??? చేయడానికి.
ఇక్కడ చాలా విషయాలున్నాయి చూడటానికి కాని వాటిని మనం గుర్తించం, వాస్తవానికి మనకు అవసరం ఉండదు..ఖర్మగాలి ఏదైనా పెద్ద ప్రమాదం మనకు జరిగే వరకు..
జరిగిన చరిత్రను ఒకసారి తిరగదోడితే మనకు కనిపించేదంతా చెత్తా చెదారంలాంటి అసహ్యకరమైన వాస్తవాలే వాటికి కారణాలు వెతకడం మొదలుపెట్టావో నీ జీవితం సరిపోదు నిజాలను కనుక్కోడానికి.
డెలిబరేట్ గా బ్రతకడం మనకు చిన్నప్పట్నుండి అలవాటు, అల్లరి చేయకుండా వుంటే చాక్లేట్లు - ఏడవకుండా ఉంటే చందమామా లాంటివి మనల్ని మనం కన్వీనియెంట్ గా ఉంచుకోడానికి రెడీమెడ్ వాదనలు ఉంటూనే ఉన్నాయి. నిజాయితీ - మోరల్ వాల్యూస్ - అస్థిత్వం - ఇంకేదో అంటు కొంతమంది అరుస్తుంటారు కొందరు మద్యలో కాని ఏమి లాబం.
అసలు వాటి గురించిన ఆలోచనలు మన మెదడు పొరల్లో ఎక్కడా లేవే..నేను బాగుండాలి-నా వాల్లు సుఖంగా ఉండాలి అంటూ స్పెండ్ చేసే సమయంలో ఐదు శాతం మనం ఇలాంటి వాటికి కేటాఅయించినా మన జీవిత పరమార్థం బహుష అర్థమవుతుందేమో..కాని మనకు అంత టైమ్ ఎక్కడుంది.?..

నా గురించి ఆలోచించడానికే సగం జీవితం
మన గురించి ఆలోచించడానికే మిగతా సగం జీవితం సరిపోతే

ఇక ఇలాంటి ఆలోచనలకు సమయమెక్కడ ఉంటుంది.

టైమ్ .................................................. అసలు దేనికైనా మనకు టైమ్ ఉంటుందా? కచ్చితంగా ఉండదు... మరి ఎలా...?????????

  • అసలు మనమేంటో మనకు తెలియాలి మొదలు
  • మన తాహతు ఏమిటో తెలియాలి
  • మన వలన ఏమవుతుంది తెలియాలి
  • మన బలం - బలహీనతలు తెలియాలి
  • నిజాయితిగా ఉండటం తెలియాలి
  • ఆత్మ విమర్ష కావాలి
వీటన్నిటికి ధైర్యం కావాలి . ప్రయయత్నం కావాలి.....

మరి అందరికి ఇలాంటివి అవసరమా అనే ఆలోచన రావొచ్హు .... కాని ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి . ఇప్పటి మన సౌలబ్యాలకై-అవసరాలు తీరడానికై - ఈ స్వేచ్చ - ఈ స్వాతంత్రం ఇవన్ని ఎవరో ఒకరు ఆలోచిస్తేనే కదా వొచ్చాయి . మరి ఇన్ని అనుభవిస్తున్న మనం మన వంతుగా ఆ క్రమంలోనే ఎందుకు ఆలోచించలేకున్నాం...మౌనపు ముసుగేసుకుని!!

నా నిస్సహాయత్వం....


రాస్తున్నాను కవితలంటూ
మనసు కదిలినపుడు,

కానీ ఎందుకో
నా అక్షరాలు క్షీణిస్తున్నాయి
భావనల బలం లేక..
ఆక్రందనల ఆవేశాలు
పనిచేయట్లే...

మూర్ఖత్వపు మందు కావాలేమో
మత్తుగా సోలిపోవడానికి....???

ఉద్యోగరిత్యా ఉండేది పరాయి దేశంలో ఐనా,మనసు మాత్రం ఎప్పుడూ ఇండియాలోనే..

సాహిత్యమంటే నిజమైన అభిమానమో లేక చిన్నప్పట్నుండి అందరు నన్ను మంచొడు వీడు అనడం మూలంగానో ఏమో కాని అప్పట్నుండే కవితలూ గట్రా రాసుకుంటున్నను!!!నాకున్నా ఒక అలవాటు ఏంటంటే ఏమైనా రాసుకునేటప్పుడు నేను ఆ క్యారెక్టర్ గా ఊహించేసుకుంటు రాస్తాను. ఒక్కొసారి చాలా బయమేస్తుందీ. నేను ఊహిస్తున్న ఆ భావనల దొంతరల్లో ఇన్ని ఆటుపోట్లు ఉంటాయని తెలిసినపుడు.

నేను ఈ బ్లాగు రాయడానికి ఒకే ఒక కారణం బహుష 1999లో అనుకుంటా దాదాపూ 8నెలలు నేను పడిన నరక యాతన అంతా ఇంతా కాదు ! సమాజం నాకు అర్థమయ్యేది కాదు. అప్పుడూ ఇప్పుడూ !!!

సమాజం అనుసరిస్తున్న కొన్ని విషయాలు,నమ్మకాలు నాకు చిత్రంగా అనిపిస్తున్నాయి! తార్కికంగా ఆలోచిస్తే అని ఎంత చండాలమో అవగతమవుతున్నాయి!! .

కాని ఏమి చెయ్యలేని నిస్సహాయ స్థితి.ఆలోచనలు ఎవరితో పంచుకోవాలో తెలీని సందిగ్దం.

ఇలాగే రొజులు గడిచిపోవడం నేను ఏమి చెయలేక కొన్ని సంవత్సరాల క్రితం దుబయి రావడం వస్తూనే డబ్భు సంపాదనలో తలమునకలవ్వడం నాకు తెలియకుండానే జరిగిపోయాయి! కాని మనసుకు శాంతి లేదు. ఏదొ చెయ్యాలని ఒక పిచ్చి కోరిక(ఆదేంటో తెలియదు మళ్ళీ!!)

ఇన్ని రోజుల తర్వాత ఈ బ్లాగు ద్వార కొంతమందైన నా ఆలోచనలకు సప్పోర్టు చేస్తారేమో అన్న చిన్నా ఆశతో

ఎపుడో అకస్మత్తుగా ఒక ఉద్వేగం నాలో ఎగసి ఎగసి,
నన్ను నిర్వీర్యుడిని చేసినపుడు కలిగిన,

భావ పరంపరలో కొట్టుకుంటూ రాసుకున్న కొన్ని నా

కవితలను అందరితో పంచుకోవాలనుకుంటున్నాను!!

శ్రీనురాగి…

ఇది అవసరమా???


నాకు నీ మీద ఉన్న భావనను
నేను ఇష్టం అనుకుంటున్నాను,

కాని....
చదివిన పుస్తకాల్లో
దీనిని ప్రేమా అంటున్నారు,
మమేకమంటున్నారు,
దీని గురించే రాజ్యాలు పోయాయి అంటున్నారూ,
ప్రాణాలు పోయాయి అంటున్నారు,
చంపడాలు - చచ్చిపోవడాలు
అంటున్నారు...

అసలు నాకర్థం కానిదేంటంటే..?

ఇది అవసరమా నాకు అని....

అవిటి మనసులు !!!
కాలం మారిందంటున్నారు అందరు...

పురాణాల్లోని
అసహాయత్వం వారసత్వంగా వచ్చి
భారంగా మోస్తూ, పిరికితనంగా మారి
మంచితనమనుకుంటూ,
చేతగాని తనాన్ని ఒప్పుకోడానికి
వెనుకడుగు వేస్తూ - బింకంగా
మొరాయిస్తూ - శుశ్కిస్తూ - చస్తూ
పక్కనే జనాలు చస్తున్నా చవటలా చూస్తూ
సంబరంగా ఎగిరి గంతులేస్తున్నాయి...
మనసులు - మన అవిటి మనసులు.


వంచనను మంచితనమనుకుంటూ
నిజాయితీ ముసుగులు ఇంకెన్నాళ్ళూ...???

మనసు తేలికైనవేళ.


నిన్ను.......

ప్రేమ అనుకున్నాను
జీవితమనుకున్నాను
లెకుండా ఉండలేననుకున్నాను
అసలు ఊహించలేదు కూడా
కళ్ళు మూసుకున్నాయనుకుంటాను
మోహంలో ఉన్నానుకదా ...!!

కాని నాలోని భావాలను
అపహాస్యం చేస్తూ
నువ్ చేసిన అత్యాచారంతో,గుండె పగిలి-
నాలోని నేను చచ్చి, చేసిన-
చివరి ఆలోచనల్లో కనబడిన [Image: 282n9c5.jpg]
నీ నిజం నన్ను
భావ మిముక్తున్ని చేసి,
నా మనసు తేలికయింది ..

ఇది పరివర్తన అనుకోనా లేకా....

అమ్మకానికి నిజాలు

నిజాలు నిజాలు
నిప్పు కణికలు
చురుక్కుమనే
నిజాలు - చవకైన-చావలేని నిజాలు !

అందరూ బయపడే
అందమైన నిజాలు
అక్కరకు రాని
అవసరం లేని నిజాలు

ఒప్పుకోడానికి
సిగ్గులేని నిజాలు

అక్కడ ఆ తల్లి
ఏడుస్తూ చచ్చిపోతుంది
అమ్మతనాన్ని అమ్ముకుంటూ,
పసి వాల్ల ఏడుపులతో
వాతావరణం వేడెక్కి
పాడవుతూ.....
నిజాలను కుండల్లో
ఉంచి సమాధి చేస్తున్నారు
ఎవరైనా ఉన్నారా !

రండి బాబూ రండి
ఎక్కడపడితే అక్కడా
ఊరిస్తూ ఉంటాయి
కాని కారంగా వెగటుగా
కచ్చాగా ఉంటాయి .

రండి బాబు రండి

అదిగో ఇంకో తాజా నిజం
ఆ పిల్లోడిని
కుండీ కాపాడుతుంది
ఆర్తిగా ..

ఓ యువతా ఇది నా వేడుకోలు ...

బంగారు బాల్యం నుండి బయటకొచ్చి
సమాజపు రెపరెపల అనుభవాల గుంపులోకి
చొరబడే ఓ యువతా.... ఈ సమాజం నీది
ఇక నువ్ మాత్రమే దీనికి మార్గదర్శకుడవు
అలాంటిది ప్రేమ పిచ్చిలో, ఆకర్షణ ముసుగులొ
కొందరి జీవితాలను యాసిడ్ మయం చేస్తూ
నువ్ సాధిస్తున్నది ఏమిటి??
స్వేచ్చను అనుభవిస్తూ విర్రవీగుతున్న నీవు
దానికొరకు ఎన్నివేల ప్రాణాలు బలి అయి ఉంటాయో
ఒక్కసారి ఆలోచించు...
ఈ సమాజం మనం నిర్మించుకున్నది
ఈ సమాజంలో ఉన్న నియమాలు మనం కల్పించుకున్నవి
ఈ సమాజం లో ఉన్న కట్టు బాట్లు - బయాలు అన్నీ కూడా మనవే సుమా..
మరి అవన్ని ఎందుకోసం...?

నువ్వు-నిన్ను కన్న తల్లి - నీ కుటుంబం అలాగే నీ లాంటి ఈ సమాజం
అందరు హాయిగా ఉండాలనే కదా..
దానికొరకు ఎందరో నిరంతరం నిన్ను నన్ను ఈ సమాజాన్ని
రక్షించడానికి పలు విధాలుగ రేయింబగళ్ళు తమ ప్రాణాలను సైతం లెక్కచేయక
ఎక్కడెక్కడో పహారా కాస్తున్నారు.
ఒక్క సారి బిచ్చగాడిని గమనించు అలాంటి జీవితం నీకు లేదు
ఒక్కసారి రోగ గ్రస్థులను గమనించు భయంకరమైన జబ్బులతో ఎలా బ్రతుకుతున్నారో
అలాంటి స్థితి నీకు లేదు..ఎందుకంటే ఈ సమాజం నీకు కల్పించిన వసతులు నిన్ను అలాంటి
స్థితిలోకి రాకుండా కాపాడుతున్నాయి.
ఇంతటి ఉన్నతమైన సమాజంలో ఉంటు దానినే కలుశితం చేస్తావా.....

ఓ యువతా ఒక్కసారి మళ్ళీ ఆలోచించు...

ఈ సమాజాన్ని పునర్నిర్మించవలసింది నువ్వే
ఈ సమాజాన్ని రక్షించాల్సింది నువ్వే
ఈ సమాజం నీదీ నాదీ మనందరిదీ

సమాజం బాగుండాలంటే
అది కేవలం నీ వలన్నే సాద్యం..

ఓ యువతా ఇది నా వేడుకోలు ...

ఐనా మనం బాగానే ఉన్నాము కదా.

ప్రతీ అణువు
ప్రతీ రేణువూ..
అందరి అవయవాలు,
ఆకాశం కూడా..
విశ్వంలో తేలిగ్గా,
ఒంటరిగా తిరిగే,
గోళం మీదున్న మనం ..
నమ్మకాల అమ్ములతో-
ఆక్రోషపు ఆవేదనలతో-
అందంగా ఆనందంగా ?? ఉంటున్నాము కదా !!
అర్థం కాని భాషల్లో-
లేని భావాలను అందంగా పంచుకుంటూ... ఐనా
మనం బాగానే ఉన్నాము కదా.

కావలసింది అదే మరి..

నిను వర్ణించ నా తరమా.... !!

నిను వర్ణించ నా తరమా.... !!

అలల నురుగు వెన్నెల్లో [Image: ftnhvm.jpg]
మెరుస్తూ కురిసే సౌందర్యం
నీ నవ్వులో కనబడుతూ,
నా గుండే
తడబడుతూ..
కోనేట్లో తామరపువ్వును సయితం
ముడుచుకునేలా చేస్తూ...
నన్ను నీ
లోకం లో కి తీసుకెలితే,
అక్కడి నిన్ను వర్ణించ
నా తరమా ....

ఆకలి మౌనం !!


ఉశోదయాలూ లేవు ,
సంద్యా దీపికలు అసలే లేవు,
ఆకలి ఆకలి అంతా చీకటి...
కాని మౌనం అర్థం కాదు ?
ఆకసం అబ్బో అధ్భుతం,
ఇంధ్ర ధనుస్సులతో చిత్రమైన ,
మేఘాలతో హాయి గొలుపుతున్నది కొందరికి

[Image: 2h3qtzp.jpg]
అక్కడే ఎరుపు రంగు - కారు మబ్బులతో
ఎందుకో ఈ హాయి ,..
వాన చినుకులకు అంత నిక్కెందుకో?,
అసలు కంబడటానికి సిగ్గు పడుతోంది .
అంతా నిర్జీవం.......
పైగా మొహంపైన మొహమాటపు
నవ్వులు ......

ఆమె ఏడుస్తూ ..


నా కళ్ళలోకి చూస్తూనే ఉంది!http://i31.tinypic.com/jrwhmh.jpgనాకు ఆశ్చర్యం ..
నలిగిన చీర చెదిరిన జుత్తుతో
అమాయకంగా ఏదోలా..

మనసు అనేది ఉందని
దానికి అవసరాలుంటయని
అస్థిత్వానికదే కారణమని
అర్థమయ్యి , ఆలస్యంగా... ఆలోచిస్తూ ,

అందమంతా అక్కడే !
అదిరే పెదాలతో లొకం గురించి
విరుపుల మెరుపులు
కురిపిస్తూ , వాటితో
నవ్వే వాళ్ళను కాల్చేయాలన్నంత కసి
ఆ కళ్ళలో...

నిర్లజ్జగా చూస్తున్న
నన్ను చూస్తూ
టక్కున మొహం పై ఊసి
కళ్ళు తెలేసింది... పాపం!!

రేపటి న్యూస్ కొసం ఎదురుచూస్తూ..నిస్తేజంగా నేను !!!!

ఏమని అందాము ?

అసలు మనుషుల మద్య
కేవలం తాత్కాలికమైన సంబంధాలు ,
కాకతాళీయంగా
మాత్రమే ఉండి
వాటి ద్వారా ఈ ప్రపంచం
ఇలా ఉందా ?? !!

లేకపోతే ఏ సంబంధం కూడా , మనిషి
చనిపోయే వరకు ఎందుకుండట్లేదు మరి ??


దీనిని దేవుడి మాయా అందామా ? లేక
మన ఖర్మ అనుకుందామా ?

లోక సన్యాసం ..

ఎంతో ఉత్కృష్టమైనది మానవ జన్మ అంటారు
తెలియకుండా వొచ్చిన మనకు
పెంచుకున్న బందాలు
తాత్కాళికంగా మనసుకు
ఆనందాన్నిచ్చినా

జీవితం గడవటానికి
మనం చేసే యుద్ధంలో
విజయం మనది
కాకపోవచ్చు
కాని పాఠం కచ్చితంగా
అవుతుంది , మరొ ప్రయత్నానికై
విజయం వైపు .

కాని మనం మనుషులమైనందుకేమో
గుండెలో నిబ్బరం స్థాయి
ఒక బలహీన క్షణంలో తగ్గి
అన్ని మరిచి లోక సన్యాసం చేస్తాం .

కుళ్ళును మోసాల్ని
భరించాలంటే
కచ్చితంగా మనం
మురిగ్గుంటలో ఉండాలి సుమ ,

కాని కొందరికి అది నచ్చదు
అలాగని , భరించలేరు

అందుకే అలా మనల్ని విడిచి , అర్ధాంతరంగ
వెళ్ళిపోతారు .

అల్లికలో ఒక పొరపాటు..


అక్షరాల అల్లికలో ఒక పొరపాటు
నాలోని గుండె చప్పుడును నియంత్రిస్తూ
నిద్రలేకుండా చేస్తోంది.

నాలోని అంధత్వాన్ని
అందమనుకున్నాను
అందుకే నీవు అందంగా
కనబడ్డావు

అందమైనవి ?? కూడా
అందవికారంగా ఉన్నాయిపుడు!!!

అమాయకత్వం...!!!


అమాయకత్వం ఇచ్చే ఆనందం
అంతులేని సుఖాన్నిస్తుందేమో..

అమ్మ ఒడిలో సేద తీరడం
నాన్న చేయి పట్టుకు నడవడం
అన్న మాటలు
చెల్లి చాడీలు
తమ్ముడి ఆగడాలు
వీటిని అనుభవించేది
అమాయకత్వమే కదా ?!!!

మెదడు పొరళ్ళో
దాగున్న
భయం
అమాయకత్వమేనా??

ఆ స్నేహం...

అవయవాలు కృంగి
అచేతనంగ ఉన్నాను

అవసరాలు స్వైర విహారం
చేస్తూ అసహాయత్వాన్ని చూస్తూ
వికటట్టహాసం చేస్తూ
కర్కశంగా నా నిస్సహాయ స్థితిని
ముక్కలు ముక్కలుగా చేస్తూ....
ప్రపంచం నన్ను దూరం చేస్తే
నాలోని మనిషిని చంపి, వికృతంగా
ఆ రక్తం తో పండగ చేసుకుంటుంటే

ఇంకిపోయిన కళ్ళు
ముసకబారి-దారి కనబడక
చావు వైపు అడుగులేసిన నన్ను

ఆర్తిగా ఒక హస్తం అక్కున జేర్చుకుంది

ద్వేష రహిత వాక్బాణాలు
నన్ను మామూలు మనిషిని చేశాయి!!

ఎదురుగా నవ్వుతూ చల్లని
కల్మషం లేని ఆ చూపు..

అది చాలు నా జీవితానికి..

మిత్రమా ఏమిచ్చి నీ రుణం తీర్చుకోనూ..??

మాయా ప్రపంచం..

మాయా ప్రపంచం..
ఇక్కడ మనది ఏదీ కాదు.
అసలేమీ లేదు.

అందరూ ఉంటారు,
అన్నీ చేస్తారు.కాని ఇంకేదో అవుతుందీ ,
ఆనందంగా ఉంటాము (??) .

పుట్టుక - చావు మద్య కాలాన్ని
మన జీవితంగా మలిచి ఆ దేవుడు
ఆడుతున్న ఆటలో గెలుపు మనది ఎలా అవుతుంది?

అమ్మా అంటాం , అంతలోనే అమ్మో అంటాం .
కాని ......

ఏమో ? ...
అసలేముంది చేయడానికి
హాడవిడీ తప్ప ఇక్కడ ?

ఏదో కనుగొన్నాము - కనిపెట్టాము
కాని నిజాన్ని...?? అసలు......

కవి ...


అక్షరాలు పోగేసుకుని
ఊహల ఊయలలూగుతూ
అక్కరకు రాని చుట్టం లా
అందరిని కలుగజేసుకుంటూ .
అమాయకంగా,
ఉన్నవి లేనివి రాసుకుంటాడు!!


తనను తాను తృప్తి పర్చుకోడానికి ..

తొలి మంచు ఘనీభవించింది ..

తొలి మంచు ఘనీభవించింది
వేకువ సూర్యుని
వెచ్చని కిరణానికై
చలిగాలుల అక్కున జేరి!!
ఇంధ్ర ధనుస్సు ఎక్కుపెట్టాలా ??

ఆ రాత్రికి
ఆయుష్షెక్కువ
అప్పుడే పోనంటోంది,
వేచి ఆ
మంచు కరిగి
నీరయ్యింది !!

అపుడే తెలవారిందా..??


హఠాత్తుగా
మెలుకువయి చూస్తే మొత్తం నక్షత్రాలే
రాలి పోతూ-వెలిగిపోతూ... లీలగా నువ్వు కూడా !!
వేసుకున్న మందు బిళ్ళలెందుకో
పని చేయట్లే, మత్తుగా ఉంది !!

నువ్ పాడిన " సడిసేయకో గాలి " పాట
గుర్తొస్తూ
గుళ్ళోని గంటల శబ్దంతో ,
అపుడె తెల్లరిపోయింది మళ్ళీ..
[Image: vzivxw.jpg]

మెరిసే నక్షత్రాలు లేవు... నువ్వు కూడా!!!!

ఒక విచిత్రం..

అవసరాలు
మనిషి అస్థిత్వాన్ని
అయోమయంలో పడేసి
అతలాకుతలం చేస్తున్నాయి అనుకుంటే..


చిత్రంగా,

మనిషి ఆనందాలు-సుఖాలు
అవసరంతోనే ముడిపడి ఉన్నాయి.

జీవితం

తెలుసుకోవాలనే "జిజ్ఞాస"
తెలుస్కోవాలనుకునే "ప్రయత్నం"
తెలుసుకుంటున్నామనే "ఆనందం"
తెలుసుకున్నామనే "గర్వం"
ఇంకేదో ఉందనే "అసంతృప్తి"


అసలేమీ లేదనే "నిఝం"
అంతే.....

ఔనూ...


"తృప్తి"
మనిషికి దొరకనిదైతే,

"దుఖం"
గతి తప్పిన అస్థిత్వం !!

కూలి..ఎందరి పాపాలనో
మూటళ్ళో-పెట్టెళ్ళొ తన
తలపై రోజూ మోస్తూ,
తన
ఆకలిని మాత్రం
సగమే మోసే ఆ
బడుగు జీవి..

సమాజంలో కుళ్ళును
బీడీలుగా మార్చి
రోజూ కాల్చి బూడిదగా
మారుస్తాడు కసిగా!


వాడొక కూలీ మరి..

మేదరి..తన ఆశలను కర్ర
తీగలుగా మలిచి
భవిశ్యత్తును ఎంత
అందంగా అల్లుకుందమన్నా
ఆకృతి దాల్చని అతని
కళా ప్రస్థానంలో

అన్నీ చిల్లులే..

రిక్షావోడు..
ఎన్నో
దుశ్కృత్యాలను చేస్తూ
భూమాతకు భారమైన
ఎందరినో
తన రిక్షాలో మోస్తూ...
కాసేపైన,
వారి పాపపు పాదాలను
పవిత్రమైన ధరిత్రిపై
పడనీకుండా
తల్లి ౠణం
తీర్చుకునే
ముద్దు బిడ్డడు
మన


రిక్షావాడు..

గుర్తింపు..
రణ గొణ ధ్వనులు
వీడని మైకం
విసుగు మొహంతో
బద్దకంగా లెగుస్తాను..

రోజు వారి అవసరాలు
నాలోని నిస్సహాయుడిని
చిత్రంగా వెక్కిరిస్తాయి
నాలోని నేను చస్తాను
సమాజపు పరుగు పందెంలో నేనూ
ఒకడినవుతాను - ఈ రోజు గడపడానికి!!

చీకటి కమ్ముతుందీ...

బయం గుప్పిట్లో
బాదల నీడలో
రాని నిద్రను
డబ్బుతో కొని
వెలతాను రేపటిలోకి !!


ఇంకెక్కడిదీ..???

అలోచన.


నీకెప్పుడూ కనపడని
నిజాన్నీ,
నీవెప్పటికీ స్పర్షించలేని
అగ్ని జ్వాలను,
నీవెప్పటికీ ఊహించని
కెరటాన్ని, నేను!

నీ కళ్ళు భరించలేని
వెలుగుతో-ఒంట్లో విశ్వమంత
సత్తువతో
నీకై వస్తున్నా!!!

కార్మికుడు..


ఉషోదయాలు,
వేకువపొద్దులెరుగని వాడు
సైరన్ మోతకై ఎదిరిచూస్తాడు.

కరేంటు తీగలను నరాలుగా
ఇనుప రాడ్లను తన కరాలుగా
పెళ్ళాం పిల్లల ఆకలిని మోస్తూ
యంత్రాలతో స్నేహం చేస్తాడు.

రేయీ పగలు శ్రమిస్తూ
బ్రహ్మరాతకు తన
జీవితాన్ని అంకితమిస్తాడు.

పిచ్చోడి? ఆలోచనలు..!!

మహా భారతంలో అంతా
బానిసత్వం అవినీతి...!
లేకపోతే
నిండు సభలో
ద్రౌపతి వస్త్రాపహరణాన్ని
కౄష్ణుడొచ్చేవరకు చూసేవారా?

కౄష్ణుడు భోదించే వరకూ
తెలియదు యుద్ధమెలా చేయాలో

అర్జునుడు తెలివైన
అవకాశవాది..

సమాజమెరుగని మరుగుజ్జులు..


వాడి పేరు శ్రీను
ఆలోచిస్తున్నాడు తీవ్రంగా తన
ప్రేయసికి ఏమి కొనాలా అని,

డబ్బివ్వని నాన్నను తిడుతూ..

అతనేదురుగా
మండే ఎండలో
గొడుగు కింద
జోళ్ళు కుడుతున్నాడు

వాడి వయసు
పదేళ్ళు

మనోడు..చిక్కని శీతాకాలం
మంచి హుషారులో
రాత్రి పూట,

మిత్రుల్తో కలిసి
డింగ్ డాంగ్ బార్ లో
చీల్డ్ బీర్ తాగుతున్నాడు మనోడు
బాడీని వెచ్చబెట్టుకోడానికి..

అక్కడ..
చిరిగిన చీరలో
చలికి వణుకుతూ
వేడి అన్నంతో
మనోడి రాకకై తన ఆకలిని
మరిచి ఎదిరిచూస్తోంది అమ్మ !!


అపుడు సమయం
రాత్రి ఒంటి గంట....

ఆలోచనలను వెతుక్కుంటూ

ఆమే నేనేంటో
నాకు చెప్పి నాలోని
నన్ను నాకు పరిచయం చేసింది...

ఆమె సాంగత్యం నన్ను
సౄష్టిలో మమేకం చేసింది
గర్వంగా తనవైపు చూస్తుంటే
చల్లగా కరుగుతూ
నా గుండెను చీల్చి నా
హౄదయాన్ని తీసుకెల్లింది.


నిశ్శబ్దంలో
ఆలోచనలను వెతుక్కుంటూ
ఆశగా నేను...

నువ్వూ-నేనూ

సమాజం
స్పర్షించలేని
పార్శ్వాన్ని నేను...

ప్రపంచం
హర్షించని
ఆలోచనవు నువ్వు..

నువ్వంటే ఇష్టపడని

అద్దానికి తెలుసు


నేను నిన్ను ఇష్టపడుతున్నానని...

ఒక రోజు...

నా స్నేహితులు
మా ఇంటికి వొచ్చారు.
అమ్మ పిండి వంటలు
వండి వడ్డించింది

అందరం తిన్నాం..

మిత్రులు సంతోశించారు
వాల్లను చూసి నేనూ సంతొశించాను


ఆ రొజు అమ్మకు
జ్వరం....

నువు నాతోనే


నువు లేవని
మళ్ళీ రావనే నిజం తెలిసినా...

ఒక చిరుగాలి నన్ను
చల్లగా స్పర్షించి,
ఉదయభానుడి లేత కిరణం
మంచు బిందువుల్లో
ఇంద్ర ధనుస్సును
మెరిపించి,
తొలి వర్షపు చినుకు నా
అరచేతిని తాకి,

నువు నాతోనే ఉన్నావనీ
ఊరడిస్తున్నాయి.

జాబిలి

పున్నమి నాటి
జాబిలి
నా రాతలకు కథాంశమైనా ..

కాడుపులోని
నా
ఆకలి మాటేమిటి???

ఏడవడానికి నా అహం
ఒప్పుకోదు..


నేను నిన్ను ఇష్టపడుతున్నానని...

కృతజ్ణతలు..

"బయం"
నాలోని ఆలోచనలను చంపేస్తూ

"దిగులు"
నాలోని విచక్షణను తరిమేస్తూ
నాలోని అణువణువూ బయం
గుప్పెట్లో నలుగుతూ

నాలోని నన్ను నానుండే
దూరం చేస్తుంటే

"నా కలం" నేనున్నానని
నన్ను మా
అమ్మోలే
ఊరడిస్తోంది

నువ్వు !
పగిలిన నా హృదయాన్ని
మరమ్మత్తు చేయాలని
చూస్తున్నవేందుకూ?

స్తంభించిపోయిన
నా
గుండె సవ్వడులు
నీకెలా
వినిపిస్తాయి??
ఎండిన నా కన్నుళ్ళో
నా కలలెలా కనబడతాయి??

విశ్వంలో నీకై వెతుకుతూ ….

నిన్ను చూస్తూనే ఉన్నాను
మైమరచిపోతూనే ఉన్నాను

కల్పిత కల్పనల మోహంలో
కలల నాచుపై జారుతూనే ఉన్నానూ..

అదిరే గుండె చప్పుడు వింటూ
అరక్షణమైనా కుదురుగా ఉండాలని
కురుక్షేత్ర సంగ్రామంలో
కాల్లు విరిగిన అసమర్థుడనయ్యాను

నిజం కావని తెలిసినా
తట్టుకోలేక-మనసు ఒప్పుకోలేక
మనసు పెట్టే బాధ భరించలేక

విశ్వంలో నీకై వెతుకుతూ
రోజూ ఓడుతున్నా


ఎంతకాలం తిరుమలేశా???

మ్యారేజీ ఫంక్షన్ హాల్లో
ఘనంగా విందు భొజనం...

వెనకాలే...

ఎంగిలి విస్తల్ల కోసం
ఎండిన డొక్కల ఆకలి పోరాటం!
వీధి కుక్కల కన్నా అధ్వాన్నం
ఇలా ఎంతకాలం తిరుమలేశా???

ఆ రోజు !!


చేసిన తప్పులను నెమరు వేసుకుంటూ
అప్పుగా తీసుకున్న చిరునవ్వును పెదాలకు అతికించుకుని
ప్రేమ ఒలకబోస్తున్నాను ఆమెతో, ఎప్పట్లాగానే !!

పాపం పిచ్చిది నే చెప్పేవి నిజాలని
నా జీవితంలో ఆమె మాత్రమే ఉందని
నేను చెబుతున్న అబద్దాలను వింటుంది
నే చెప్పిన నా జీవితపు నిజమైన అబద్దాలను
గుడ్డిగా నమ్ముతూ వెక్కి వెక్కి ఏడుస్తోంది.

చివరగా తను నా దగ్గరగ ఉన్నపుడు నేను
చాలా సంతొషంగ ఉంటానని నేను అన్నపుడు
ఆమె కళ్ళల్లో నాకు ఏదో తెలియని బయం కనిపించింది.

నాకు తెలీకుండ నేను ఆమె వ్యక్తిత్వాన్ని
సర్వనాశనం చెస్తున్నాననే నిజం నాకు తెలీదు సుమ!!

ఆమె నన్ను ఇంతలా అసహ్యించుకుంటున్న ఈ వేళ
పశ్చాత్తాపం పేరుతో నన్ను నేను మంచి వాడిగా
నమ్ముతూ ఇంకా ఏం సాధించాలో ????

అదేంటీ ??

అకస్మాత్తుగా నాలోంచి నేను వీడిపోతున్న భావనా.. ఏం జరుగుతోంది???

నా కళ్ళేంటీ నీళ్ళు ..
ఈ రాగం నాకెంతో ఇష్టం..

" ఓయి నీవెప్పుడూ మా బానిసవే "

ఇక్కడ
దొరకనిదేదో
కనిపించని
చక్కదనానికొరకు

ఎక్కడికో
వెల్లిపోదామని
దారి వెతుక్కునే నా
వ్యర్త ప్రయత్నాలకు

ఎందుకో.....

అడుగడుగున అవరోధాలే !!!

అనవసరమైన బంధాలు

" ఓయి నీవెప్పుడూ
మా బానిసవే "

అంటూ వెక్కిరిస్తున్నాయి.
ఆమె !


జీవితం చిన్నదైనవేళ
నాలో నేను పరిబ్రమిస్తూ
ఏమీ సాదించలేదనే నిరాశలో
కొట్టుమిట్టాడుతూ ఇక చాలూ అని
ఏమీ చెయలేననే నిజాన్ని ఒప్పుకుంటూ
చావు వైపు వేసిన అడుగు చివరన ఉన్న వేళ
ఆమె…పలకరించింది !!

ఆశ్చర్యం .. నాలాంటి కరడుగట్టిన నాస్తికున్ని పైగ ప్రపంచంపైన అంతులేని కోపాన్ని పెంచుకున్న ఒక ఉన్మాదిని ?

ఒక్క చూపుతో ఎలా కట్టేసిందో నాకు ఇప్పటికీ అర్థం కాని విషయమే…


నా తపనా …


పొద్దున్నే మొదలుపెడతాను నా జీవితాన్ని,

అందరిలా మట్లాడుతున్నాను,

హాయిగా నవ్వుతున్నను(?),
గడుస్తున్న కాలం వెంబడే వెల్తున్నాను,
అందరితోనీ సహజీవనం చేస్తున్నాను,

ఐనా….. నువ్వు

అవసరమయ్యే ప్రతీదాని గురించి అర్రులు చాస్తున్నానూ,

వాటిని సాధించడానికి శయశక్తులా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నానూ,

చాలా వరకు సాధించుకుకుంటున్నాను కూడా ,

కాని , నువ్వు


ఎవడు వీడు ?


వాడు
శున్యాన్ని శోదిస్తు
అకస్మాత్తుగా అడుగుతాడు

“ధర్మమెక్కడా” అని

ఆకలవుతుంది…..

ఏదుస్తు నావ్వుతాడు,మళ్ళీ అడుగుతాడు
“నిజాయితీ” ఎక్కడా? అని

అతని ఈ ప్రస్థానం అంతం లేనిది..

అందుకే వాడిని “పిచ్చొడు” అందాము.
ఆనందంగా ఉంటుంది.

ఐతే,

మనల్ని వాడు ఏమనుకుంటున్నాడో?
వొద్దులే
ఆ విషయాన్ని వొదిలేద్దాం.

నిజాన్ని భరించే శక్తి మనకు లేదు..

నిశ్శబ్దం!!నిశ్శబ్దంలో నిన్ను చేరి
నీతో ఊసులాడుతూ,
గతించిన కాలం మనల్నెలా విడదీసిందో
చెప్పడానికి ప్రయత్నిస్తాను!

సమాజం రివాజుల ముందు
నా ఆదర్శం (అనుకున్నాను) మరుగుజ్జయింది
మనసులోని ఇష్టాలను భవిష్యత్తు కష్టాలు బయపెట్టాయి .
కాల ప్రవాహంలో నేనూ ఒక బొట్టయ్యాను నాకు తెలియకుండనే
అర్థమయ్యి తిరిగి చూస్తే….. మసగ్గానైనా నువ్ కనబడలేదు.

నాలోని బయం స్వార్థంగా మారిందేమో అపుడు
ఇంకేమి ఆలోచించలేకపోయను (నా అసమర్ధత అని నాకు అర్థమవుతుందిపుడు)
నువ్వన్న ప్రేమ బహుష నాలో లేదేమో అప్పుడూ-ఇప్పుడు కూడా!!

మరణానికి చేరువలో ఉన్న నేను

అందరూ వద్దనుకున్న నేను
అప్పటి నా అసమర్ధతను సమర్ధించుకోడనికి
ఇప్పుడు పడుతున్న తాపత్రయాన్ని చూస్తుంటే నా మీద నాకే
అసహ్యంగా అనిపిస్తోంది.
అన్నీ తలుచుకుంటుంటే కాల్తున్న చితిపైన పడుకున్న అనుభూతి

మరి ఇవన్ని నీకు ఇపుడె ఎందుకు చెబుతున్నాను ?
పశ్చాతాపం పేరుతో ఏం చేయలనుకుంటున్నాను….??

ఏమో ????

బహుషా కనీసం నీ దౄష్టిలోనైనా నా అసమర్ధతను , చేతకానితనాన్ని
మంచితనంగా అనిపించుకోవాలనేమోఏమో
రేపో మాపో నాకూ ఈ లోకానికి సంబంధం తీరిపోతుంది!
మరి నేను నీకు చేసిన ద్రోహం మాటేమిటి??

క్షమించమని అడిగే అర్హత నాకు లేదని తెలుసు
అందుకే
మౌనంగా నిశ్శబ్దాన్ని వింటూ,

చీకటి గదిలో

ఎదిరిచూస్తున్నా ఆ క్షణానికై !!

ఆవహ్యామీ!!


మండుటెండలు,మంత్ర తంత్రాలు,
కుసంస్కారాలు

//ఆవహ్యామీ//

ప్రేరణలు,ఆవేశాలు,
సిద్ధంతాలు,చాతగానితనం

//ఆవహ్యామీ//

ఆకర్షణ,ఉన్మాదం,ఉద్రేకం,
కర్కశత్వం-చావులు

//ఆవహ్యామీ//

ఏడుపులు , పెడబొబ్బలు
జీవిత సంగ్రమాలు, చిత్ర విచిత్రాలు,
మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ చావడాలు …

//ఆవహ్యామీ//….

ఓం శాంతి శాంతి శాంతిహీ !!!!

సెలవు..


జాలిపడాలంటారు జనాలను చూసి!

ఎవరిని చూసి??

పక్కోడు చస్తున్నాడంటే పక్కచూపులు చూసే వీరినా?
మానవత్వం అంటే అదేదో బూతు మాటైనట్లుండే వీరినా?
ఎదుటి వారి నిస్సహాయత్వంలో ఆనందాన్ని వెతుక్కునే వీరినా?

నమ్మకాలను అమ్ముకొంటూ అస్తిత్వాన్ని గాలికి అరువిచ్చి,
బతకడానికి సారం లేక తెల్ల మొఖాలేసుకుని,
బరువు నవ్వునును పెదాలకు అతికించుకొని,
ఆనందంగా బ్రతుకుతున్నామని చంకలు గుద్దుకుంటు,
రోజూ చీకట్లో పందగ చేసుకునే మూర్ఖపు జనాలను చూసి
నేను జాలి పడాలా??

నా వల్ల కాదు అందుకే…

…. నేను వెల్లి పోతున్నాను

అక్కడ నేనూ ఈ ప్రకౄతి తప్పా ఎవరూ ఉండరూ.

సెలవు..

అస్థిత్వం ..నువ్వంటు ఏమీ లెకుండానే
అంతరించిన ఆలోచనలతో

అస్తవ్యస్తమైన ఆలోచనలతో
కృత్రిమమైన నవ్వును పెదాలకు అతికించుకొని
ఆనందిస్తున్నామని బతికేస్తున్నారు మీరు
అదే అస్థిత్వమనుకొంటూ
పిచ్చిగా….

దేవుడు నవ్వాడు


అమ్మా ఆకలి..
పోరా పొద్దున్నే నీ గోల!

అయ్యా ఆకలి
పోరా నీ నసా!!

ఆకలీ…………….ఆకలి
రణగొణ ద్వనులు - హడావిడీ జీవితాలు

దేవుడా నా ఆకలి
హ హ హ (దేవుడు నవ్వాడు)

బయం బయంగా నేను..


బయం
బయం
అనుక్షణం,

భరించలేని భారం
మరోక్షణం,

ఆలోచనలు భారమై
గుండె మూగబోయి
భావాలు కన్నీళ్ళౌతూ
బయం గుప్పిట్లో,
బిక్కు బిక్కుమంటూ
బ్రతుకుతున్నాను
బయం బయంగా నేను..

Share SocialTwist Tell-a-Friend

నా చేతగానితనం !!!!


ఘనీభవించిన మంచును ఖండిస్తే
జాలువారే నీటి బిందువును నేను,
జీవితం అర్థం కాక వ్యర్థంగా
బ్రతుకుతున్నాను.

మనసుకు కలలు అనే రంగుల వలను వేసి
మబ్యపేడుతూ
నా

చేతగానితనాన్ని కప్పి పుచ్చుకొని
గుండెలో………

భవిష్యత్తుపై ఆశల
మత్తును జల్లి జోకొడుతున్నాను.

యతి వాదం…


అందరికోసం అతిగా ఆర్తిగా ఆలోచించే

నా నడవడిక నా నుండి నన్ను

దూరం చేస్తూ
అందరిలో మమేకం కాలేకా,

అపార్ధాలు వెల్లువెత్తుతూ నన్ను శాసిస్తున్నయి
నా గమ్మ్యన్ని చేరనివ్వకుండా..

దేవుడా..

ఈ సమజం పట్లా నీవు
నాకందించిన అభిప్రాయాలు
వాటి అంచున కదలాడె నా ఆలోచనలు

వాటి లోతుల్లోంచి పుట్టుకొచ్చే
కిరణాలు సూటిగా నా గుండెను తాకితే
కురిసే అలజడి వానలో
తడిసి ముద్దయి నేను
రాసుకునే కవితలు
చెడుదారి పట్టకుండా
కాపాడు తండ్రీ…

తొలి మంచు ఘనీభవించింది..

తొలి మంచు ఘనీభవించింది
వేకువ సూర్యుని
వెచ్చని కిరణానికై
చలిగాలుల అక్కున జేరి!!

ఇంధ్ర ధనుస్సు ఎక్కుపెట్టాలా ??

ఆ రాత్రికి
ఆయుష్షెక్కువ
అప్పుడే పోనంటోంది

వేచి వేచి ఆ
మంచు కరిగి
నీరయ్యింది !!

జీవితం..

తెలుసుకోవాలనే “జిజ్ఞాస”
తెలుస్కోవాలనుకునే “ప్రయత్నం”
తెలుసుకుంటున్నామనే “ఆనందం”
తెలుసుకున్నామనే “గర్వం”
ఇంకేదో ఉందనే “అసంతృప్తి”

అసలేమీ లేదనే “నిఝం”
అంతే…..

అక్షరాలతో మార్పునాశించడం…


అక్షరాలతో మార్పునాశించడం నా పిచ్చితనమనుకునే మీకు నా సమాధానం చిరునవ్వే,
మార్పు శాశ్వతమైనది.. అంత త్వరగారాదు…
మన ప్రయత్నాలు చేస్తూ అవకాశం కొరకు వేచి ఉండాలి.ఒకరిని చంపడమో లెదా ,
మనం చావడమో చాలా సులభం, కాని మన సిద్ధాంతాల ప్రభావాలతో వేల రకాల
మనస్థత్వాలతో నిండి ఉన్న సమాజంలో మార్పు అంటే చాలా కష్టమైనా,
అసాద్యమేమీ కాదు దానికి నిదర్శనం మన ఇప్పటి స్వేచ్చ.

కాదంటారా .. కాదనగలరా ????

ఒక్కసారి మళ్ళీ ఆలోచించండి !!

అసలే కొద్దికాలం ..!!

నిజాలు ఎప్పుడు నిజాలే కదా
పుట్టినపుడు ఎవరొ సంతోషిస్తారు
పెరుగుతుంటే ఎవరో అనందిస్తారు
మాటలొచ్చాక-అందరూ అంటారు.

కాని అన్నీ మనవనే
పిచ్చి భావన
మనలో ఎంతకాలం ?

మనతో ఉన్న దేహమే
రెండు రోజులు వొదిలేస్తే
మురికవుతూ
చిరాకుగా ఉంటుందే

మరి ఇక్కడ ఇవన్ని
మనవి ఎలా అవుతాయి ?
అనుకున్నా కూడా,

ఇదంతా ఒక
రంగుల మిశ్రమమే
అందరూ ఉంటారు
అన్నీ చేస్తారు
మనమూ ఉంటాము , కాని
ఏమీ కాదు

కొందరికైతే
తొందరెక్కువ
మద్యలోనే
వెళ్ళిపోతారు

అవిటి మనసులు !!!


కాలం మారిందంటున్నారు అందరు…

పురాణాల్లోని
అసహాయత్వం వారసత్వంగా వచ్చి
భారంగా మోస్తూ, పిరికితనంగా మారి
మంచితనమనుకుంటూ,
చేతగాని తనాన్ని ఒప్పుకోడానికి
వెనుకడుగు వేస్తూ - బింకంగా
మొరాయిస్తూ - శుశ్కిస్తూ - చస్తూ
పక్కనే జనాలు చస్తున్నా చవటలా చూస్తూ
సంబరంగా ఎగిరి గంతులేస్తున్నాయి…
మనసులు - మన అవిటి మనసులు.

వంచనను మంచితనమనుకుంటూ
నిజాయితీ ముసుగులు ఇంకెన్నాళ్ళూ…???

ఆ రాత్రి ..సమయం ఉదయం ఏడు గంటలు
రోజూలాగానే నడుస్తున్నను ఆ రోడ్డుపై
గమ్యం తెలియకుండ!

అనుమానమొచ్చి
వెనక్కి తిరిగి చూసా
ఎవరూ లేరు..

హటాత్తుగా నువ్వు గుర్తుకొచ్చి
బాదపడ్తూ నవ్వుకోంటున్నాను
మొక్షమార్గం గురించి ఆలోచిస్తూ,
దారికై వెతుకుతున్నాను
అటూ ఇటూ…

అనుమానమొచ్చి
వెనక్కి తిరిగి చూసా
ఎవరూ లేరు..

చిన్నపుడు
నాతో పాటు ఆడుకున్న
మిత్రులు గుర్తుకొచ్చారూ
ఎక్కడున్నారో వారంతా ??

అనుమానమొచ్చి
వెనక్కి తిరిగి చూసా
ఎవరూ లేరు..

చీకట్లో వెలుగొచ్చినట్లు
ఆలోచనల్లోంచి తెరలు తెరలుగా
ఒక పూవు రెక్కలువిప్పి విచ్చుకొంటునట్లుగా
నాలోంచి నేను వీడిపోతూ …

నడుస్తున్నాను నడుస్తున్నాను నడుస్తున్నాను నడుస్తున్నాను
నడుస్తున్నాను నడుస్తున్నాను నడుస్తున్నాను నడుస్తున్నాను
నడుస్తున్నాను నడుస్తున్నాను నడుస్తున్నాను

నడుస్తునే ఉన్నాను.. కళ్ళు మూసుకుని.
నడక పరుగై

హటాత్తుగా నా పాదాలు గాలిలో
ఎక్కడికో జారిపోతున్నాను

లాలి పాటలు అమ్మ గుర్తుకొస్తు
నా కళ్ళలోంచి నీళ్ళూ.

ఉలిక్కిపడి లేచి చూస్తే
కుక్కి మంచంలో నేను
పక్కనే ఆరిపోతూ బిక్కు బిక్కుమంటున్న కొవ్వొత్తి.

ఆ రాత్రి మళ్ళీ నిద్దర్రాలేదు…

ఎన్ని మేఘాలున్నాయో???
నీ
ఆలోచనల ప్రవాహంలో
పరుగులు తీస్తున్న
నా
కళ్ళలో ఎన్ని మేఘాలున్నాయో,

ఏ చల్లని నీ జ్ఞాపకం
తగిలినా
అవి
వర్షిస్తున్నాయి.

విశ్వంలో నీకై వెతుకుతూ ….

నిన్ను చూస్తూనే ఉన్నాను
మైమరచిపోతూనే ఉన్నాను

కల్పిత కల్పనల మోహంలో
కలల నాచుపై జారుతూనే ఉన్నానూ..

అదిరే గుండె చప్పుడు వింటూ
అరక్షణమైనా కుదురుగా ఉండాలని
కురుక్షేత్ర సంగ్రామంలో
కాల్లు విరిగిన అసమర్థుడనయ్యాను

నిజం కావని తెలిసినా
తట్టుకోలేక-మనసు ఒప్పుకోలేక
మనసు పెట్టే బాధ భరించలేక

విశ్వంలో నీకై వెతుకుతూ
రోజూ ఓడుతున్నా

ఏది సత్యమేదసత్యం??


నేను-నువ్వు
మోహం-కోరిక
ఆహార్యం-చాందసం
పిచ్చి-ప్రేమా
చావూ-నువ్వు
చావూ-నేను
ప్రాణం-ప్రేమా
ప్రకృతీ-దేవుడు
అసలు-శాసనం

చివరగా…..

నేను-నేనూ

నీ చిరునవ్వు..

నా..

గుండెలోని భావాలు
పదాలై
పదనిసలుగా గొంతులోంచి
జాలువారే ఈ వేళ,

మూసిన నీ కనురెప్పల నడుమ
ఏ కల ఉన్నదో కదా!!

అరవిరిసిన నీ మోము
చిరునవ్వుతో
మనోహరమైనది..

మాయా ప్రపంచం..


మాయా ప్రపంచం..
ఇక్కడ మనది ఏదీ కాదు.
అసలేమీ లేదు.

అందరూ ఉంటారు అన్నీ చేస్తారు.
కాని ఇంకేదో అవుతుందీ , ఆనందంగా ఉంటాము (??) . పుట్టుక - చావు మద్య కాలాన్ని
మన జీవితంగా మలిచి ఆ దేవుడు
ఆడుతున్న ఆటలో గెలుపు మనది ఎలా అవుతుంది?
అమ్మా అంటాం , అంతలోనే అమ్మో అంటాం . కాని ...... ఏమో ? ...
అసలేముంది చేయడానికి
హాడవిడీ తప్ప ఇక్కడ ?
ఏదో కనుగొన్నాము - కనిపెట్టాము కాని నిజాన్ని...??
అసలు......

శూన్యంలో నేను !

హఠాత్తుగా జగమంతా చీకటి,

గ్రహాల గమనం అస్తవ్యస్తం,
మహార్ణవం,?
కేకలు,
ఏడుపులు-మెరుపులు,
లీలగా గాలి శబ్దం,..
రెండుగా చీలిన విచిత్ర సవ్వడి,
చీకటి సూర్యుడి బేలతనం,
కణాల గలగలలు,
గుండెపొరల్లో అగ్ని కీలలు.................................,

విశ్వంలోకి నడుస్తూ..,

శూన్యంలో నేను !!!!!!