అటకెక్కిన ఆదర్శం..

పదేళ్ళకే పద్యాలు పాడితే
అర్థం కాక నేస్తాలు
ఆశ్చర్యపోయిన అమ్మను
తిట్టిన నాన్నను చూసి
ఆ వయసులోనే నవ్వుకున్న
నన్ను చూసి మాస్టారు ముచ్చటపడి
నా బుజం తడితే పొంగిపోయి
అక్షరాలతో దోస్తీ చేసాను
నా ఆలోచనలను
నేను చూసుకోడానికి
కాగితంపైన ఒలికిస్తే అవి కవితలయ్యి
నాకు తెలియకుండానే " కవి " నయ్యాను...
తల్చుకున్న ప్రతీసారి నవ్వొస్తుంది నన్ను చూస్తే నాకు.

అర్థమయ్యీ కాని "పరిసరాలను"గమనిస్తూ
మాటలను మరిచి అక్షరాలను పేరుస్తూ
నిస్తేజపుకళ్ళ్తలో ప్రశ్నలను కూరి
నిద్రమాని ఎర్రబడ్డ కళ్ళతో సమాజంలోకెలితే
"ఇంట్రావర్ట్" వాడు ఆలోచనా పరుడు
అంటూ పొగిడేస్తుంటే నవ్వు కాదు
వాల్ల పిచ్చితనం చూస్తే చిర్రెత్తుతుంది.

వాస్తవానికి నలుగురిలో ఉంటూ "నవ్వుతూ"మాట్లాడటమంటే అసహ్యం నాకు.అలాగని నేను మానసిక రోగిని కాదు బట్ ఇక్కడ అది కాదు సమస్య,,
ఆ నవ్వు వెనకున్న ఒరిజినల్ మొహాలే నాకు కనబడతాయి..నాలో కూడా.
అందుకే ఈ మౌనం.

నా భార్య మొన్నొకసారి నన్నడిగింది.."మీరెందుకు అంత గంభీరంగా ఉంటారు " అని,
అది బయమని చెప్పలేక నా మొహం పైనున్న ముసుగు తీయలేక మూలిగే గుండెపై అక్షరాలను జల్లుతూ పూర్తయిన  నా ప్రతీ కవితలతో నన్ను నేను దహనం రోజూ చేసుకుంటున్నా అని
పాపం ఆమేకేం తెలుసు అమెకసలు పరిచయం లేని మరో నేను నా పైన చల్లుకున్న మౌనపు రంగు చిరగకుండా "గంభీరంగా" కనబడతా అని!

ఇన్ని సంవత్సరాల నాతో నేను చేసిన సహజీవనంలో మరో నేను నన్ను ఎంతలా మోసం చేస్తూ వచ్చానో కదా, రోజూ యుద్ధమే.. గెలుపు నాదా? నాలోని నాదా ?
ఇంకా తెలియదు చెప్పడానికైనా రాయడానికైన.
కాని రోజూ చెబుతున్న నా ఆదర్శాల అర్థాలు రాత్రయ్యేసరికి మత్తులో "ఆ" ఆలోచనల్లో ముక్కలయ్యి 
రకరకాలుగా అనేకమైన రంగుల్లో నాకు నేనే నాలో నేను కనబడుతూ
నాలోని బయాన్ని ఆదర్శాలపైన ఒత్తుగా కప్పి  మైకాల మజాను ఆస్వాదించే నేను
కవినా?
ఆదర్శవాదినా?
ఇంట్రావర్ట్ నా?

చి చీ అంతా మోసం ఇక్కడ "తెలివి"గా కప్పబడుతూ ఉంటూంది వెలుగులో ఎవరికి కనబడకుండా.
ఆనందమో సంతోషమో తెలియని ఒక అనుభూతికై నేనురోజూ వల్లె వేస్తున్న "నైతిక విలువలు" ఏమవుతున్నాయి?

ఇప్పటికీ ఎవరికి తెలియదు నాలోని మరో నేను.

ఇంతటి ఇంటలెక్చువాలిటీ ఎందుకొరకు, ఇలా అందరూ ఉంటారా?

(ఉంటే నన్ను నేను సమర్ధించుకోడానికి ఒక కారణం . హ హ ఎంతటీ వెసులుబాటు ఈ సమాజంలో మనుషులకు ...)

అమావాస్య చీకటిలో వెలుగుకై వెతుకుతాను
రాలే పూవును చూస్తే కన్నీళ్ళాగవు
ఎవరికైన బాధలుంటే తీర్చాలనిపిస్తుంది
సామ్యవాదాలు-ఉద్యమాల మాటలతో కాలక్షేపం? చేస్తాను
కళ్ళు దించుకుని ఎదుటి వారిని చూస్తాను
రోజూ తప్పులను చేస్తూ
సిగ్గులేకుండా
ప్రాయశ్చిత్తాల కొరకు నలుగురికి నీతులు చెబుతూ
క్షుద్రానాందాన్ని పొందుతాను.
అయ్యో .... చెప్తూ పోతే అంతే లేదు వీటీకి

కాని...కాని... కాని... కాని... కాని... కాని... కాని... కాని... కాని...

మొన్నరాత్రి

మూసుకున్న కన్నుల వెనక చీకట్లో నాకు నిజం తెలిసింది,
సిగ్గు స్వరూపం తెలిసింది.


దేవుడికి పూజ మానేసాను నాకు అర్హత లేదని అర్థమయ్యి.

నాలోని నాకు దూరం పెరిగి అహం కరిగి
అగాధంలో
చిక్కు ప్రశ్నల సంకేళ్ళేసుకుని
చీకట్లో బంధీనయ్యి చివరికి
ఋష్యత్వంలోని దైవత్వం
ఆవహిస్తూ, దహిస్తూ
ఒక్కసారిగా కళ్ళు పేలేలా
దిక్కులు పగిలేలా
శాంతి కెరటాలు
"నా"లోని "నన్ను" తాకి
ఒకరికొకరం దూరమయ్యి
"శాశ్వత దహనమయ్యాను"
సంతోశంగా ఏడుస్తూ...


ఈ రోజు ఉదయం
అద్దంలో చూసినపుడు
నా మొహంలోని
చిరునవ్వు చాలా "అందంగా" కనబడింది!

ఒక పూవు ఉత్తరం ...పరమార్థం తెలియదు కాని
పరులకుపయోగమీ జీవితమని తెలిసింది.


కొందరేమో దేవుడిని కొలవడానికి
ఇంకొందరేమో కైపెక్కడానికి
అలంకరణకు నేనే చీత్కారాలకు మేమే,

పుట్టీ పుట్టగానే నా తల్లి మొక్క నుండి నన్ను
నిర్దాక్షిణ్యంగా లాగేస్తే రెక్కలుతెగి ఏడుస్తున్నా

కుప్పలుగా నా కుటుంబాన్ని తెంపి తెంపి
మా మృదువైన శవాలతో
ఒక రోజు పుణ్యానికై దేవుడికి
ఒకసారి సుఖానికై దేహానికి అలంకరిస్తారు
వాడిపోయి ఏడుస్తుంటే ఏరి పారేస్తారు
మురికి కాలువల్లో పాడేస్తారు.

ఒక్కసారి బాధపడండి మా బ్రతుకులను చూసి.


కన్నీళ్ళతో

మీ పూవు...

సిద్ధార్థ్ ఋషి - with his fans - 2010 November

బయట బోరున వర్షం పడుతున్నా

బయట బోరున వర్షం పడుతున్నా
గొంతులో తీరని దాహం,

బయటెంత వెలుతురున్నా
గుండెలో చిక్కని చీకటి,

చుట్టూ నవ్వుల పువ్వులున్నా
ఏరుకోలేణి అవిటీతనం,

ఇదేనా జీవితం అనుకుంటే
కాదంటూ నువ్వొచ్చావు

ఒక్కసారిగా ప్రపంచమే మారింది కదా

నిన్నటి వరకున్న కోపం
సమాజమంటే అసహ్యం
ఇప్పుడు నాలో లేవు

ఉన్నదల్లా నీ నవ్వులు వాటి మాటున
నాకు చేరుతున్న సంతోశం

అంతా హాప్పీ హాప్పీ

వెలుగు

సంతోశాన్ని చూద్దామని
వెలుగు కొరకు వెతుకుతుంటే
నాకు నువ్వు దొరికావు., ఆ తర్వత నేను కూడా.
ఇప్పుడు వెలుగు నా వెనకాలే,.. నాతో పాటు చివరివరకు!

బయమంటే బయపడ్తారెందుకో జనం
బయంలో బాధ ఉంటుందని
అదే నిజమని తెలియదా!!

దేవుడేడ్చాడు నా కలలో,

ఆ పక్కన హత్యలు, ఇంకో పక్కన మోసం
తను ఆశించే పనులు జరగక ఆ దేవుడు
నన్ను సృష్టించాడు ఆలోచించి

ఇక్కడికొచ్చిన నాకు బయమేస్తుంది
ఆయన చెప్పనవాటిలో ఏ ఒక్కటీ కనబడక
వాటికోసం వెతుకుతూ సతమతమవుతూ
ఇటు చూడలేక అటు ఆయనకు ఏమీ చెప్పలేక
నా రాతల ద్వార ఆకలెక్కువై
నాకు నేనే అర్థం కాకుండా ఉన్నాను
అప్పుడే చాలా సమయమైంది,
చేయాల్సింది అలాగే ఉంది.

అలిసి నిద్రపోయాను
కలలో ఆ దేవుడు కనిపించాడు
ఏడుస్తున్నాడు పాపం
కంగారుగా ఇప్పుడే లేచాను
నా కలత నిద్రలోంచి
ఆలోచిస్తున్నాను
ఏమి చేయాలా అని !!

తాత్కాలికానందం.

అబద్ధాలను నిజాలనుకోడంలో
తాత్కాలికానందం తీవ్రంగా ఉన్నా,
నిజం తెలిస్తే కాలిగే బాధ దానికి రెట్టింపు తీవ్రంగా ఉండి
జీవితాన్ని అతలాకుతలం చేసి
మెదడు కార్యకలాపాలను
చిన్నాభిన్నం చేస్తుంది.

అది మనసుకు సంబందించింది ఐతే ఇంక అంతే సంగతులు...

ఇంకా అర్థం కావడం లేదు నాకు.

ఇంకా అర్థం కావడం లేదు నాకు.
ఈ జీవితం చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. మనిషిలో ఉండే అన్ని భావాలు నాలోనూ ఉన్నాయి,
కాని అవి అర్థమయ్యే లోపే అర్థం కాకుండా ఉన్నాయి.ఆలోచిస్తుంటే సమయం గడిచిపోతుంది.
సంతోషానికి నేను ఒక నిర్వచనం ఇవ్వాలని అనుకుంటున్నాను ఎప్పటినుండో కాని కొన్ని క్షణాల్లోనే దాని స్వరూపం మారి అంతవరకు చూసిన దానికి పోలికే లేకుండా ప్రతీసారి వెక్కిరిస్తు అపహస్యం చేస్తు నన్ను ఇంకా ఇంకా ఇంట్రావర్ట్ ను చేస్తున్నాయి.
ఆ మౌనం నన్ను నన్ను ఉండనీయక అందరి గురించి ఆలోచించమని ఫొర్స్ చేస్తే మెదడులో పేరు తెలియని తీవ్ర సంఘర్షణ. "దేనికోసమో తెలియని వెతుకులాట."

ఐతే ఇందులో కూడా మళ్ళీ తెలియని విషయాలు కలగా పులగంగా కంగారు పెడుతున్నయి.

మొన్నొక రోజు నేను ఆలోచిస్తుంటే చిన్నప్పుడు నేను తరచుగా అనుకునే,నాన్న గారు చెప్పిన ఒక మాట నాకు గుర్తుకొచ్చింది
మనం బాగుంటే అంతా బాగుంటుంది... చాలా కాలం వరకు నిజానికి నిన్నటి వరకు కూడా అర్థమయ్యేది కాదు ఆ "అంతా" అనే పదానికర్థం..
దానికి నిర్వచనం లేదు కేవలం అనుభవించలంతే! నిజాయితి ఒక స్థాయికొచ్చేసరికి మనసు పూర్తి స్థాయిలో సీరియస్ గా తీసుకుంటుంది.
అప్పుడే సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఐడియాలజీ,సిచ్యువేషన్స్ పొసగక ఇదిగో ఇలా కొట్టుమిట్టాడుతుండాలి.ఇదెంత కాలమో నాకు తెలియదు కాని నిజాయితినే గెలుస్తుందనేది నేను నమ్ముతున్నాను ఇంకా కూడా.

అప్పటి వరకు ఓటమి దరిచేయనివ్వకుండా - ధైర్యాన్నివ్వమని ఆ దేవుడిని కోరుకుంటూన్నాను.

మనసు చూరులోని మౌనన్ని చీకటి భరించలేకపోతున్నట్లుంది, ముసురుగప్పిన ఈగలు రొద పెడ్తున్నాయి!

దేవుడికి సమాధానం చెప్పడానికి నా దగ్గరిపుడు నీవు లేవు!!

నిన్ను మరవడానికి
నిశ్శబ్దపు మాత్రలేసుకున్నను
మౌనపు మత్తులో
నీ ఆలోచనలు
స్థంబించాయి.

వైతరిణి నా కళ్ళముందు
అందంగా కనబడుతుంది!

దేవుడికి సమాధానం
చెప్పడానికి
నా దగ్గరిపుడు నీవు లేవు!!

తియ్యని విషం నీ పై నా నమ్మకం!

తియ్యని విషం
నీ పై నా నమ్మకం

నా అస్థిత్వం
అలోచనలు
ఘనీభవిస్తూ
ఎడారిలో
నన్ను నేను దాచుకున్నాను
నీ అలోచనలతో,

సమయమయిపోయింది
అస్థిత్వం రెక్కలు వుప్పుకుంది మెల్లిగా
తూర్పున ఆకాశంలో
వెలుగు కిరణాలు
సూటిగా గుండెలోకి
వెనక్కి తిరిగి చూస్తే
నేణు నడిచిన దారి
అంతా చీకటే!

అంతా తెల్సిసింది నాకు
ఏమి చేయాలో కూడా
సంతోశం పరిచయమయ్యింది.

చీకటి చివరన !|

అస్పష్టావరోధాలు,
అసంధర్భాలోచనలు,
క్షేత్రించని కలలు,
దేనికోసమో ఎదిరిచూపులు,
ఇవే కదా జరుగుతున్నవి,
ఇవే కదా జరగాల్సినవి.

ఖర్మగాలి మంచి అంటే
ఆటు పోట్లే - అనుమానం లేదు.

అందుకే ...
వద్దు ఈ భయాలు
అసలేమి కాదు ఇక్కడ,
ఒక్కసారి చూడు

చీకటి చివరన ఏముందో
నీకు అర్థమవుతుంది
నిజమేంటో.......

మౌన సంగీతం

నీ చూపులోని
మౌన సంగీతం
నా గుండెను తడితే
వచ్చిన మార్పుతో
కల
కరిగి
కన్నుల్లోంచి
కన్నీరు
కాలువయింది !

ఎందుకంటే
సృష్టిలో అర్థం కాని
సంబంధాలు ఎన్నో ఉన్నాయి
ఎవరికి తెలియక
మరుగున పడతాయి
మన లాగే !!!

అందుకే నువ్వంటే నాకు అసహ్యం

రంగులు మారే
ఆకాశంలో
కొత్త అందాలు
ఎలా శాశ్వతం  చెలి?

ఆకాశంతో పోల్చకు-
గొప్పతనాన్ని ఆపాదించకు-
అక్కర్లేదు.

నీ చిన్ని నవ్వుకోసం
పడే పాట్లలో
స్వార్థం కాక
నీకు గొప్పతనమెలా
కనబడింది??

నీ మూర్ఖత్వానికి
ప్రేమా అనే పేరు పెట్టుకుని
నిజం తెలుసుకోలేకున్నావు
నిన్ను కూడా తప్పు పట్టలేను
ఎందుకంటే - నిజమే.. ప్రేమంటే
నమ్మకం కదా !

అందుకే నువ్వంటే నాకు అసహ్యం
ఇక్కడ ఏది కూడా నిజం కాదు
నాతో కలిపి..

నువ్వు తప్ప,
బహుష !!...

నిజం తెలిసింది

నల్లని ఆకాశంలో
ఎర్రని మబ్బుల
విన్యాసాలు
అర్థం లేకుండా
తిరుగుతూనే ఉన్నాయి,
అక్షరాలు సిగ్గుపడేలా
ప్రపంచానికి తెలియని
సంఘటనలు
చూస్తూ..

కాలం కరుగుతూ
సమయం గడిచిపోయింది,


వెనక్కి తిరిగి చూస్తే
ఏమీ కనబడలేదు
నడిచిన దారి తప్పా,

జ్ఞానోదయమైంది ...ఎందుకంటేమనకన్న ముందూ ఉంది


మన తర్వాతా కూడా ఉంటుంది
ఈ " ప్రపంచం " !

ఈ మాయా మనసు...

మనసెపుడూ
మాట వినదు కదా !

నీతో గడిచిన నిన్నొక అధ్బుతం
ఇప్పటి ఈ క్షణంనేనెలా చెప్పను?
నాలోని మాటలకు జబ్బు చేసింది మరి.

కళ్ళు చెప్పిన బాసలు
గాలిలో కలిసి నీ ముంగురులను
నిస్తేజంగా తడుతుంటే
ఒళ్ళో ఉన్న  నీ వదనంలో
అదే నవ్వు నాలోని అణువణువునూ
 మైమరిపిస్తూ
నీ అభిజ్ఞాతంగా - ఏకాంతంగా..

నీ చేతనారహిత
హిమాంచు
నిశీదర్శనీత నయనాలు
చిందించే వెలుగుల
పగుల్లలోంచి ఎర్రని మంటలు
నా రోదనలో-
మెరిసే నక్షత్రాలు
నీవులేవని వెక్కిరిస్తున్నా
ఒప్పుకోలేకపోతోంది
ఈ మాయా మనసు...

ఔను ఈ మనసెపుడు
మాట వినదు కదా!!

చెల్లి నిస్సహాయత్వం!

పాపపు విజయాల కేరింతల్లో
పులకరింతల పరవశాన
మొహంలో  మోహం వికృతంగా
నడీ రోడ్డుపై గర్వంగా నర్తిస్తోంది.

అమాయక నా చెల్లి మొహంపై
వాడు విషాన్ని పోసాడు అందరి ముందు
అర్థమయ్యేలోపు
ఆ చెల్లి అయోమయపు రోదన
గుండెల్ని పిండేస్తుంటే
ఏమీ చేయలేని నిస్సహాయత్వం
చుట్టూ చేరి తమాషా చూస్తోంది.

ధరణేమి పాపంచేసుకుంటుందో కదా రోజూ
బయం బయంగా - తెలియకుండా,
ఇలాంటివాల్లు మన మద్యలో నిర్భయంగా
అందరినీ బయపెడుతూ
మస్తిష్కపు మూలాలు మాయమయి.

పాపమెరుగ ని ఆ చెల్లి  ఆవేదనకు
సమాధానమెవరు చెప్పాలో??

ఈశ్వరం!!

"ఆ" దారిలో వెల్తుంటే
ఏమైందో గాని
ఒక్క క్షణం మెదడులో
ఏదో మెరుపు,
అర్థం కాలేదపుడు!

        రాత్రి కలలో
        దేవుడు నాతో మాట్లాడుతూ
        చెప్పాడు.
        గాయమైన గేయంలా
        నాకు తెలియకుండానే
        ఏడ్చానేమో
        అప్పుడర్థమైంది!!

                ఎదైనా కావాలంటే
                మరేదో వదిలేయాలిగా...
                అవును-
                నాలో ధైర్యం కోసం
                నేను స్వార్థాన్ని వదిలేసాను,
                కప్పుకున్న పొరలు వీడి
                హరి కరముల స్పర్షలా
                ఈశ్వరం నన్నావహించి
                చాలా  ప్రశాంతత!!!

కాలుతున్న కలల తడి!

జ్వలించే కాలం
నెమ్మదయి
నిశ్శబ్ధ నిశీలోన
మెల్లిగా  ఎగసి ఎగసి
కాలుతున్న  కలల తడి  లోన
మెరుస్తూ
మంచు తెరల్లో
క్షణాలతో యుద్ధం
నిర్విరామంగా
జరుగుతూనే ఉంది!

ఉశోదయాలు
సంధ్యా దీపికలు
            కరువయ్యి
చల్లని గాలి
            సవ్వడి కూడా
సమర సమీరంలా !!

పొసగని
అడుగుల అమరికలో
ఏదో తేడా
మన జీవన కుహూ రాగాలు
అడవి గీతాలయ్యాయి

స్వప్నాల సాలెగూడులో
జరిగే అస్థిత్వపు పోరాటంలో
ఎంత చీల్చుకొన్నా
బరువు క్షణాల
వెక్కిరింపుల సవ్వడిలో
రోదన మౌనమయి
శుశ్క దేహపు
ఆహార్యం మిగిలి
గమ్యమే లేని
చివరి ప్రయణం మొదలయ్యింది!!!

అదిగో సముద్రం కూడా
తెల్లని ఉవ్వెత్తున లెగిసే
అలలతో స్వాగతం నాకోసం!!!!

మార్పు నా ఆశ..

మార్పు నా ఆశ..


సైద్ధంతికపరమైన
ఆలోచనలు
పుట్టించేవి తీవ్రవాదం కాదు-కారాదు
ఉత్తేజిత చైతన్యం మాత్రమే కావాలి.
ఒక మంచి ఆలోచన
సామజిక రూపం
సంతరించుకోవాలంటే
బాధ్యతాయుతమైన
నిబద్దత ఉండాలి-కల్మషంలేని
ఉద్రేకం కావాలి
ప్రతీ క్షణం ప్రతీ మాటలో
అర్థం ఉండాలి
అప్పుడే కదా మార్పుకు అవకాశం.

కావల్సిందల్లా బాధ్యతాయుతమైన ప్రయత్నాలు కావాలి
మార్పు అదే వస్తుంది ఒకరోజు తప్పకుండా.
అదీ నా ఆశ.

ఆగిన పరుగు

ఆలోచనల మబ్బులు మనసును కమ్ముకున్నపుడు క్షణాలు బరువవుతూ కాలం ఆగేలా ఉంది కదా..
నిజమే నిజం రాక్షసిలా నీ ఎదురుగా ఉన్నపుడు నువ్వు మాత్రం ఏం చేస్తావు.
పక్షి రెక్కలు తెగి దార్లో కనబడినపుడు నీ కళ్ళల్లో నీటిని ఎవరైనా ఆపగలిగారా?ప్రాణం విలువ తెలిస్తే మనిషితనానికి దైవత్వం కూడా ఆబ్బుతుంది కదా.
కురు ఆలోచనలను కాల్చేసి అస్తికలను ఆకాశంలోకి విసిరి కొట్టు గాలిలో కలిసిపోతాయి నామరూపాల్లేకుండా.
ఇక్కడ అసలే చీకటి కదా, ఇంకా ఈ ముసుగుల్లో రంగులాటలెందుకు?వెలుగు కావాలి అర్థమ్ కావట్లేదా నీకు?

అక్కడ చూడు... నాకు నవ్వొస్తుంది ఆ చోద్యపు ఆటలు.
ఇక్కడ పగటివెలుగులెక్కువ,
నీ ఆలోచన  జ్వాల వెలుగులు ఇక్కడ కనబడవు,
నిజానికి అక్కర్లేదు కూడా..

నీ అరుపులు కేకలు,ఏడ్పుల కన్నా ఊరవతల చీకటి వేడి నిట్టూర్పులకు ఉండే విలువ ఎక్కువ... అది నిజమే కదా .

ఈ వేగపు వేడి పరుగుల్లో ఎక్కడికక్కడ మానసికంగా మాడిపోతున్నారు రోజు అదే జీవితమనుకుంటూ,
చుట్టూ చూస్తే అన్నీ మృత కళేబరాలే కనబడుతూ అసహ్యంగా ఉంది.
కుండీ పక్కనే పిల్లోడు ఆడుకుంటూన్నాడు బోసి నవ్వుల్తో, నన్ను చూస్తూ చేతులు చాచి మళ్ళీ నవ్వాడు ఆ నవ్వులో నాకు దేవుడు కనబడ్డాడు.
మనసులో కల్లోలం తగ్గినట్లైంది ఇప్పుడు ఏం చేయాలో కూడా తెల్సింది నాకు ఇక్కడ. కాని....
హటాత్తుగా నాకు ఏమీ వినపడక-ఏమీ కనపడకుండా ఉందేంటీ????

అర్థం కాకుండా ఉంది

నీ మాటలను
నిజమనుకుని
నీ నవ్వులో నేను
తడిసి ముద్దయ్యాను...


నీ పైన అభిమానం నన్ను
నిస్తేజుడను చేస్తే
నువ్ నాకు
ఆశల రెక్కలు తొడిగావు .
మబ్బుల్లో కూరుకుపోయాను ..


చూస్తే నువ్వెక్కడా లేవు
నీ ఆశలూ లేవు నాకు..

అంతా సంతోశమే నిన్నటి వరకు

అంతా సంతోశమే నిన్నటి వరకు
ఇవాల నువ్ లేవు-నీ నవ్వు కూడా
అమరమైన అభిమానం
ఆకాశంలో
నక్షత్రమై మెరుస్తోంది.
విశాల కక్ష్యలో
ఎక్కడని వెతకను
కన్నుల్లో కమ్ముకున్న కన్నీళ్ళతో.

ఖాలీ అయిన గుండెలో
మంటలు నన్ను
దహిస్తున్నాయి
దేవదాసును కాలేను
మత్తులో జోగడానికి
నిన్ను మర్చిపోవడానికి

కొండ చివర
కాలు జారుతుందేమో
ప్రళయం పక్కన.

నీ అర చూపు

సిగ్గుపడ్డ నీ మోములొ
ఎరుపెక్కిన చెక్కిలిపై
ముంగురులు నాట్యమాడగా
నీ పెదవులపైన
కొంటె నవ్వు.

కనులెత్తి చూసిన
నీ అర చూపులో
ఆశ్చర్యం

నువ్ చూస్తున్న
అద్దంలో
నీకు బదులు

నేను...

ఎలా చెప్పను?

ఇష్టాన్ని
ప్రేమనుకోలేదు మనం,
అంగీకార బందం
మన ఇష్టాన్ని పెంచింది
అందుకే.

కాని

అవసరాలు
నీ ఆలోచనలను
మార్చాయేమో
దూరమయ్యావు.

ఏడుపు రాలేదు
నీ మీద ఇంకా
ఇష్టం పెరిగింది
స్వతంత్రురాలివయ్యావని.

ఐనా,..
వర్షాకాలపు
చిగురుటాకు చివరన
చినుకుతడిలా
నీ జ్ఞాపకాలు
నా గుండెలో
అలాగే ఉన్నాయి ఇప్పటికీ.

ఆకాశం కొత్తగా ఉంది !

వేకువ జామున
తూర్పు ఆకాశం కిటికీలోంచి
కొత్తగా ఉంది,

చూస్తూనే ఉన్నాను!

పక్షులెగురుతుండగా
మసక చీకటి చివరన
సూర్యోదయం..
రెండు కళ్ళు చాలవేమో
ఆస్వాదించడానికి.

అలికిడయితే పక్కకు చూసా
అక్కడ నవ్వుతూ నువ్వు
నీ చిరునవ్వుల్లో పువ్వులు,
ఇంకెన్ని కళ్ళు కావాలో
నీ అందాన్ని
ఆస్వాదించడానికి..
ఒక్కసారిగా అయోమయం
అటు తూర్పును చూడాలా
ఇటు నిన్ను చూడాలా??

తన్మయత్వంతో కళ్ళు మూసుకున్నాను
ఆ ఆకాశంలో
ఉదయిస్తున్న సూర్యుడి పక్కన
నవ్వుతూ.. నన్నే చూస్తూ ...
నువ్వే!!!

నాన్న గుర్తొస్తున్నాడు.

నాకు ఇంకా గుర్తుంది.
ఆ రోజు నువ్ నా చేయి పట్టుకుని
స్కూల్ లో జాయిన్ చేసావు,మాస్టారుతో
అన్నావు మావోడు గొప్పోడు కావాలనుందని!

కాలం గిర్రునా తిరిగిపోయింది
ఎన్నో తప్పులు - ఒప్పులు
పంతాల పట్టింపులతో...!

ఒకసారి డబ్బడిగాను ఎక్సర్షను కు వెళ్ళాలని
లేవన్నావు - నాకు తెలుసు నీదగ్గర డబ్బులేదని
 కాని కావాల్సిందే అంటే
ఏదో అమ్మి నాకు ఇచ్చ్చావు
నేను నవ్వితే సంతోశించావు.

ఆ రోజు నా తలకు దెబ్బతగిలితే
నువ్ పడ్డ భాధ నాకు ఇంకా గుర్తుంది
అది నాకు ఇపుడు అర్థమవుతుంది.

నీతో కూర్చోబెట్టుకుని బ్రతకడం నేర్పాలనుకున్నావ్
కాని ఆ దేవుడికి నీతో ఏ పని బడిందో
అకాల పక్షవాతం తో నిన్ను మంచానా పడెసి
డబ్బులేని స్థితిలో
హీనమైన చావునిచ్చాడు. చివరిసారిగా అన్నవు
మంచిగా ఉండు - అని.

నువ్ పోయాక
ఇక్కడి హడావుడి రేస్ లో పడి
అన్నీ మర్చిపోయాను నాన్న, చివరికి నిన్ను కూడా.
నేను బయపడీనప్పుడల్లా నా వెన్ను తడుతూ
ఏమి కాదూ అంతా ఉత్తిదే అంటూ నాకు నువ్విచ్చే ధైర్యం
నాకు లేదిపుడు.

పెద్దన్నయ్య వదినా వాళ్ళ పిల్లలు బాగానే ఉన్నారు నాన్న
అలాగే చిన్నన్నయ్య కూడా. ఇక తమ్ముడు
చెప్తే నమ్మవు కాని వాడినందరూ " జెమ్ " అంటున్నారు
ఇక అమ్మ నన్ను నువ్ స్కూల్ కు తీస్కెల్లేరోజు
ఇంటి పనులతోఎంత బిజీగా ఉందో-ఇప్పటికి అలాగే ఉంది
నేను కూడా పెళ్ళి చేసుకుని బాగానే ఉన్నాను.
ఇప్పుడు నువ్ ఉంటే ఎంత బాగుండెదో నాన్న

నీకు ఏమీ చేయలేక
ఋణగ్రస్తుడనయి
కళ్ళు తడవకుండా ఏడవడం నేర్చుకున్నాను
నువ్ గుర్తొచ్చినపుడల్లా...

ఇక్కడంతా అదోలా ఉంది
నువ్ చెప్పిన మోరల్ కధల్లోలా
ఎవరూ లేరు,
నువ్ నా పక్కనున్నపుడు ఉండె ధైర్యం లేదిపుడు నాకు.

ఎవరైనా నన్ను దేనికోసమైనా అడిగితే
"మా నాన్ననడిగి చెప్తానని" చెప్పలనుంది నాన్న.

నువ్ గుర్తొస్తూ నీకు ఏమీ చేయలేకపోయిన
నా మీద నాకే కోపంగా ఉంది.
నన్ను సైకిలెక్కించుకుని బళ్ళో దిగబెట్టేటపుడు
నువ్ నాకు హీరోవి అపుడు

నిన్ను కార్లో తిప్పాలనుంది నాన్న

కాని నువ్ లేవు ఇపుడు !!

ప్రేమ !?!...

మొదలు  " కొత్త"
తరువాత ఉత్సాహం
తరువాత మురిపం
తరువాత బులపాటం
తరువాత గడసరితనం
తరువాత కోపాలు తాపాలు
తరువాత బేలతనం
తరువాత పంతం
తరువాత గర్వం
తరువాత పొగరు
తరువాత అహం
తరువాత జగడం
తరువాత బాధ
తరువాత మౌనం
తరువాత నిర్వేదం
చివరగా జీవితంతో సర్దుబాటు.

చతుర్నీతి - || ఊహ తెలిసే వరకు ||

చిన్నప్పుడు తెలియనితనంలో అన్నీ స్వచ్చంగానే ఉండేవి. నేను అందరికీ నచ్చేవాడిని నాకు ఊహ తెలిసే వరకు.


అన్నీ నాకు  చిత్రంగానే కనబడుతున్నాయి. 
గుండెలో భావాలు భాస్వరంలా భగ్గుమంటుంటే వచ్చే ఆలోచనలకు ఎదుట జరుగుతున్న సంఘటనలకు అసలెందుకు పొంతన ఉండట్లేదు?

నిన్న  ఒక మిత్రుడంటున్నాడు ...

అసలు ఈ సమాజంలో మార్పు రావాలి,దాని కోసం యువత  నడుం బిగించాలి .
వారికి మనలాంటీ వాళ్ళు దిశా నిర్దేశం చేయాలి అంటు అల్టిమేట్ గా మార్పు తప్పని సరి అనే  తన ఆలోచనను వేలిబుచ్చాడు.
ఐతే ఇక్కడ జరిగేవన్నీ కూడా కేవలం పరిస్థితుల ప్రభావం - నైతికత లేమి - విద్య లేమి - ఇలాంటి కారణాలు ఎన్నో ఉన్నాయి కదా.
(  ఈ మిత్రుడికి ఒక పెళ్ళైన ఒకావిడతో ఎక్స్ట్రా మారిటల్ ఎఫైర్ గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తుంది, ఐతే దానికి వాడు ఆ సంబంధానికి దైవాత్వాన్ని ఆపాదించుకుని
   చలం భావాలు నిజమే అంటూ తప్పుడు కుదించుకు పోయిన భావాలతో బ్రతుకుతూ తను-ఆమె ఇద్దరూ మనసులను మోసం చేసుకుంటూ తమ నీచపు అనైతికపు చర్యలను
    పాజిటివ్ గా మల్చుకుని సంతోశంగా ??? ఉంటున్నారు "" చాటుగా " ! ) 
ఇక్కడ నేను చలం గురించి రాయడం కాదు కాని ఆయన అసలు ఉద్దేశాలు ఇలా దారి తప్పిన వాల్లకు  ఎలా అలాంబన అవుతున్నయో చెప్తున్నాను.

మార్పునాశించే ఆలోచనను మార్చుకోవాలసలు " ఇక్కడ జరిగేవన్ని ఎలా జరగాలో అలాగే జరుగుతు ఎప్పటికప్పుడు కొత్త నీతులను కప్పుకుంటూనే ఉన్నాయి "
వాటిని సమర్ధించే వాళ్ళు కోకొళ్లలు. మంచి చేడులను గూర్చి మాట్లాడ్డం కరెక్ట్ కాదేమో అనిపిస్తోంది. అసలు అవి ఉన్నాయా అని. ఒకవేలా అదే నిజమైతే ఇన్ని రబసలెందుకు రోజు??
మన ఒకప్పటి చర్యలను మనమే ఇప్పుడు సమర్ధించుకోలేనపుడు ఇలా మంచీ చెడు అంటూ మాట్లాడ్డం హాస్యాస్పదం కాదా?? 
ఈ ద్వంద ప్రవృత్తి మన మనసుల్లో పుట్టుకతోనే నాటుకు పోయింది.
ఇక మనకు వేటి గురించి కూడా మాట్లాడే అర్హత లేదు  (ఇది నా అభిప్రాయం మాత్రమే అందరికి అప్లయ్ కాకపోవచ్చు ) !
ఇప్పటి ఈ తరం టెక్నాలజీ వెంట రెండొందల మైళ్ళ వేగంతో పరుగులు పెడుతుంది, ఒరిజినల్ భావాలు తెలియడానికి వేదాలను చదివే అవకాశం మనకు లేదు.
ఉన్నదల్లా పోటీ మాత్రమే అందులో నెగ్గడానికి మనమేసే ఎత్తులు-చేసే పనులు అన్నీ కూడా మానసిక వ్యభిచారమే కదా.
|| ఏదో ఒకరాత్రి మనసు గోలపెట్టినపుడు దాని గొంతు నొక్కేయక స్వేచ్చగా ఆలోచిస్తే అదే చెబుతుంది మనకు ఎంతలా మరుగుజ్జులమయ్యమో  - అక్కరకు రాని మోహపు గాలానికి ఎలా చిక్కుకున్నమో అని.
కాని అలాంటి ధైర్యం మనకు ఉందా అంటే దానికి ఒక్కోక్కరి దగ్గరా ఒక్కొక్క వాదన మళ్ళీ. ఇక్కడేదీ నిజం లేదు అలాగని అన్నీ అబద్ధాలు కావు. ఇక్కడ  జరిగేవి కేవలం యుద్ధాలే
అందరికీ గెలుపు మత్రమే కావాలి దాని కోసం ఏదైనా చేస్తారు అన్నీ నీతికి కట్టుబడే ఉంటాయి  కాని
తీరం లేని గమ్యం కై  విరిగే నౌకలో నిశ్శబ్దంతో యుద్ధం చేస్తూ ప్రయాణం చేయాలి-తీరం దూరమవుతూ వెక్కిరిస్తూ ఉంటుంది అలుపు రాకుండా జగ్రత్త పడాలి, 
ఎప్పటికప్పుడు కష్టాల కెరటాలు నీ నౌకను పల్ట్టీ కొట్టించడానికి అడుగడుగునా ప్రయత్నిస్తూనే ఉంటాయి. నీ ఒంట్లోని రక్తం ఎప్పుడు వేడిగానే ఉండాలి ఏ కొంచెం చల్లబడిందా ఇక అంతే.

అర్హతల ఆలంబన చూడకు నీ మనసు చెప్పే మాట విను అంతే అదే నీ విజయానికి మొదటి మెట్టు ఇక నీకు ఎదురుండదు.
మనసెపుడు నిజాయితిగానే ఉంటుంది కాని మన మెదడు ఆడే ఆటలో
మనం ప్రతి క్షణం ఓడుతూ దానిని పట్టించుకోలేకపోతున్నాం  అందుకే ఈ ద్వంద నీతుల కృత్రిమ కోటలను కట్టుకుంటున్నాం ఎప్పటికపుడు మనసు చుట్టూ బలంగా.
చాలా వరకు జనాలకు వారి మనసుతో పరిచయల్లేవు ఒప్పుకున్నా-ఒప్పుకోకాపోయినా!!!

స్థాయి ఎప్పుడు ఒకే స్థాయిలోనే ఉంటుంది  హెచ్చుతగ్గులుండవు. నీ కంటూ ఈ ప్రపంచంలో ఉందంటే అది నీ మనసే,
ఏదైన నిజముందా అంటే అది నీ పుట్టుక-చావు మాత్రమే అది మరువకు.

కారణాలు వెతకక ఒక్కసారి అర్దరాత్రి చల్లని వెన్నెల్లో నీ మనసుతో  మాట్లాడు నీలో అలజడి తగ్గుతుంది ( కచ్చితంగా ),
గమ్యమెపుడూ దూరమే కవలసింది కేవలం ఓపికతో కూడిన వేగపు పరుగే !

ఒకటే వాస్తవం ఈ జీవితంలో ...
మనం వస్తాం పోతాం మద్యలో జరిగేవన్ని అలా జరగాలి కాబట్టి జరుగుతున్నాయి-ఏవి ఎలా జరగాలో అలానే జరుగుతున్నాయ్
ఈ ప్రపంచంలో వాటికి ఏ మార్పులు చేర్పులు అవసరముండదు.

పుట్టిన తర్వాత చచ్చే వరకు జరిగే వాటిని నిశ్శబ్దంగా గమనిస్తూ ఉండటమే కావల్సింది, గుండెలో భావాలను అదిమి పట్టి గమనిస్తూనే ఉండు అప్పుడే ఈ సమాజంలో నువ్వొకడివి.
లేదంటే నిన్ను నువ్ వెలివేసుకోవాలి నాలాగా.
మనసుతో సంగమిస్తూ సంఘర్షిస్తూ ఇక్కడీ వెక్కిరింతలను నిస్సహాయంగా ఒప్పుకుంటు నిట్టూర్పుల క్షణాలను నీ రక్తంలోని కణాలతో కలుపుకుని నీ కళ్ళపైన  చేతగాని తనపు పరదా ను కప్పుకో.
మనసులోని నిజాయితిని  మాటల్లో - ప్రవర్తనలో  బయటపెట్టే  ధైర్యం లేనపుడు ఇంకా ఎందుకు ఇక్కడ, ఐనా ఈ నిజాన్ని ఎవరూ ఎందుకు ఒప్పుకోవట్లేదు.

అసలు మనిషి జన్మకు ఇక్కడ ఎవరికైనా అర్థం తెల్సా నాతో కలిపి. ఈ ప్రశ్నకు జవాబు ఇక్కడ ఉండదు.

విశ్వంలోనికెల్లి చూడు ఈ భూమి ఒక రేణువు అందులో మనం అసలే కనబడం,

ఈ మాటలంటుంటే జనాలు విచ్చిత్రంగా చూస్తున్నారు నన్ను, కాస్త కోపంగా కూడా...

నిజం నన్ను నమ్ము!!......... చిన్నప్పుడు తెలియనితనంలో అన్నీ స్వచ్చంగానే ఉండేవి. నేను అందరికీ నచ్చేవాడిని నాకు ఊహ తెలిసే వరకు.

కాని..... ఇప్పుడు కాదు....

================================
బుదవారం 25-June-2010 - రాత్రి సమయం : 8.40 నుండి 11:10  వరకు

తీవ్రంగా నా మనసుతో యుద్ధం చేస్తూ  ఇది రాస్తుంటే మొదటి సారిగా నా చేతులు వణికాయెందుకో...

నీ కలువ కన్నుల...

చీకటి కమ్మి
దారి తెలియని ఆ
క్షణాన-
నీ కలువ కన్నుల
మెరుపు చూసి
హృదయాంతరాల్లో
ఘనీభవించిన భావాలు
మౌనంగా
మందాకినై నిన్ను చేరాలని
వెచ్చగా వస్తున్నాయి.
మనసు నిండి పోయిందేమో
పెదవులపైన కూడా
చిరునవ్వు...స్వచ్చంగా
అచ్చంగా . శ్రీ రాగపు పాటలా...


================================
బుదవారం 23-June-2010 - రాత్రి సమయం : 8.40

అహో ఆ అందం

మృదుమోహన మందారపు
కాంతి  దరహాస నయనాల
అహో ఆ అందం,

హొయల నడక విన్యాసపు
పోకడలు
మస్తిష్కపు నాలికల
ఆలోచనల పరుగునాపుతూ
కాలాన్ని స్తంభింపజేస్తే

ఆకాసపు మబ్బులు
తెల్లబోయి తేలిపోయాయి
ఇక మాకు పనిలేదు ఇక్కడా అంటూ....

అలా చూడకు
ఆ చంద్రుడు కూడా
వెల్లిపోతాడేమో
నిన్ను చూసి
వెన్నెల వెలుగును నీకిచ్చి.

మనసు మనసు సంగమ ఫలితం..

మనసు మనసు
సంగమ ఫలితం ప్రేమంటే
నమ్మడం అనేది
మూర్ఖత్వమేమో
అనిపిస్తోంది నాకు నిన్ను చూస్తే.

నీ నవ్వు వెనకాల
ఇంత విషమా?
కొద్ది పాటి సంతోశం కోసం
ఇలా మోసం చేసావా నన్ను-నా నమ్మకాన్ని
దారుణంగా.

నిన్ను నమ్మినందుకు
ఈ  సృష్టినే అసహ్యించుకునే
స్థాయికి నన్ను దిగజార్చావు తెల్సా నీకు?
ఈ ఐడియాలజి అంతా బూటకమేనా?

రామయ్య గారి స్వగతం...

మనిషంటే మానవీయతా అంటూ
తొక్కలో గొప్పతనాన్ని ఆపాదించుకుంటూ
బ్రతికేస్తున్నాం మనం.

బ్రహ్మంగారి కాలజ్ణానం,
కృష్ణుడి గీత గాని
రామాయణంగాని
కేవలం నైతిక బోధనలే!

మనిషి అడుగున దాగున్న
వికృత పోకడలు
ఎలాంటివో
ఒక్కసారి మన
IPC Sections చూడండి.

గతానికి భవిష్యత్తుగా, వర్తమానంలో!

గతానికి
భవిష్యత్తుగా,
వర్తమానంలో!
అయోమయంగా
విలువల్లేని జీవితాలు
నమ్మకాల అపోహల
నడుమ
అభ్యుదయ భావాలంటూ
అంటరానివాడిగా
ఒంటరియై ఉన్నాడు
దారెటో
తెలియకుండా
దిక్కులు చూస్తున్నాడు.

మనోడి ఆవేదన..

ఇది ఇంతేనా మార్పు రాదా?

ఇది ఇంతేనా
మార్పు రాదా?
వందోసారి గొణుక్కున్నాడు "రాఘవ."

గత పదేళ్ళుగా సమాజపు పోకడలను అర్థం చేసుకోడాని ప్రయత్నిస్తూనే ఉన్నాడు రోజూ ఓడిపోతూనే ఉన్నాడు.
ఎందుకు పుట్టాను - నా వళ్ళ నాకు గాని సమాజానికి గాని ఏ రకమైన ఉపయోగమున్నదనే ఆలోచనలతో,
హడావుడి జీవితాలను గమనిస్తూ , తన జీవితంలోని స్తభ్దును బేరీజు వేసుకుంటూ రొజులను గడుపుతున్నాడు.

అత్తెసరు మార్కులతొ ప్యాసయిన  చదువుతో ఇక్కడ ఏంచేయాలో కూడా అర్థం కాక,
కాగితాలపైన పిచ్చి గీతలను గీస్తూ వాటిని కవితలనుకుంటూ అందరికి చెప్పుకుంటున్నాడు.

ఐతే రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన అతని గుండెలో ఇంకా మండుతూనే ఉంది.

ఆ రోజు ఆదివారం... తనతో పాటూ చదివిన కవిత తన బిడ్డనెత్తుకుని నిస్సహాయ స్థితిలో ఆ హాస్పిటాలో కనబడి నన్ను చూసి కంట తడిపెట్టుకోడంతో కలత చెందిన మనసులో
కాలేజీ రోజుల్లో తనలోని స్వతంత్ర భావాలు ఆమేను ఎంతలా ప్రభావితం చేసిందో మెల్లిగా గుర్తుకు రాసాగాయి...

చీలిన మేఘపు తునక..

ఎవరెరుగని
భావాహార్యపు తాకిడితో
చీలిన మేఘపు
తునకల్లో-నెత్తుటి మరకలు
మన మెదడుల్లోని
చీకటి కోణాల
నల్లని నీడలు.

ఎక్కడ చూసినా
అవే, వివిద రకాల
ముసుగులేసుకుని
మనచుట్టూనే.... తప్పులను
పొరపాట్లుగా మార్చుకుంటూ
ఊసరవెల్లి లా..

ఏమందాం...??

అవసరలా సుడిగుండాలు
విసిరికొడితే వెళ్ళిన వాళ్ళు,

సైద్ధాంతిక పరంగా
సమాజోద్ధారణకై
సామ్యవాదాన్ని
గుండెల్లో నింపుకున్న వాళ్ళు,

అక్షరాలతో
ప్రజల కష్టాలను సమాజానికి
తెలియజేసేవాళ్ళు,

అంతా కలిసి తయారు చేసుకున్న
శాంతి సమాజాన్ని
ఏమో అంటున్నారు.

అసలు ఏ ఇజాలు
లేకుండా
సామాన్యమైన జీవితాన్ని
సమానంగా పంచాలని
చెట్టూ చేమల్తో
విషసర్పాలతో
సహజీవనం చేస్తు
ఏం సాధిస్తున్నారో కదా!

ఐన మనకు కేబుల్ టీవీ ఉంది కదా
అది చాలు !!

ఏమందాం...??

అవసరలా సుడిగుండాలు
విసిరికొడితే వెళ్ళిన వాళ్ళు,

సైద్ధాంతిక పరంగా
సమాజోద్ధారణకై
సామ్యవాదాన్ని
గుండెల్లో నింపుకున్న వాళ్ళు,

అక్షరాలతో
ప్రజల కష్టాలను సమాజానికి
తెలియజేసేవాళ్ళు,

అంతా కలిసి తయారు చేసుకున్న
శాంతి సమాజాన్ని
నక్సలిజం అంటున్నారు.

అసలు ఏ ఇజాలు
లేకుండా
సామాన్యమైన జీవితాన్ని
సమానంగా పంచాలని
చెట్టూ చేమల్తో
విషసర్పాలతో
సహజీవనం చేస్తు
ఏం సాధిస్తున్నారో కదా!

ఐన మనకు కేబుల్ టీవీ ఉంది కదా
అది చాలు !!

తొలి మోహపు మైకం తేలిపోతున్నది.

తొలి మోహపు మైకం
తేలిపోతున్నది.

పుట్టుక రహస్యం తెలిసి
అసహ్యం వేస్తుంది.
అసహజమైన రివాజుల
తరాజుల్లో తేలికైన ఉక్రోశం
తెలియని కన్నీళ్ళతో
బరువయ్యింది!

చరిత్రలు కేవలం
చదువుకోడానికయ్యి
నవ్వుతుంటే
సంధ్యావందనాల
సందడిలో
అవని అవతల
విసిరేయబడి
నేను
దిక్కుతోచకుండా ఉన్నాను.

పరిచయం

పరిచయం

ragees entertainment :

ఆలోచనలకు దృశ్యరూపం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో నెలకొల్పడం జరిగింది.

ఎటువంటి ఇదివరకు అనుభవం లేదు
ఎలాంటి అయోమయం లేదు
కేవలం విభిన్న ఆలోచనల చుట్టూ తిరుగాడే భావాలను తెరపైన ప్రెజెంట్ చేయాలనే తలంపుతో ఆ ఆలోచనలను ఇక్కడ పెట్టడం జరుగుతుంది.
బహుష 2011 లో ఏదో ఒక సమయంలో సరైనా రీసోర్స్ లను పోగు చేసుకుని మొదటి ప్రయత్నానికి దృశ్యాలంకరణ చేయడం జరుగుతుంది.

నీ పెదవుల దరహాసం...

నా
కలల
అలల అగ్ని
కీలల్లో, నీ
కళ్ళలో కులుకు
కేలి హొయల్లో, హాయి
మేఘాల్లో - రెక్కలు విప్పి
విశ్వాన్ని చుడుతూ
నీ పెదవుల దరహాసం
అమృతాన్ని కురిపిస్తోంది!!

నీడలోని నిజం..

ఇద్దరు చదివారు న్యాయం
ఒకడు నేరం చేస్తే....
ఒకరు కాపాడాలని
ఇంకొకరు శిక్షించాలని
వాదిస్తున్నారు

మరేది నిజం?
ఏది న్యాయం?
ఇద్దరూ చదివింది
న్యాయమైనపుడు
మరెందుకు ఈ అన్యాయం?

ఏది నిజం?
ఏ నీడ నిజం...?

పొద్దు గడవకముందే సద్దుమణిగింది!!

 పొద్దు గడవకముందే
సద్దుమణిగింది

అక్కడేదో ఉంది
అక్కరకు రాకుంది
ఆహార్యపు అంచుల
అభినయం
ఆ అతివ
ఆభరణం-అనుకుంటే,

ఇప్పటికీ అర్థమవ్వని
ఈ సమాజపు నైతికత
ఊహకందని
ఓ అబద్దం!
కాని , బంధాలు లేని
కీకారణ్యంలో
కుక్కిన వెలుతురుర్ల్లో నెత్తురు
కక్కుకుంటున్న అభిమానం..మాటేమిటి?
గర్వపడదామా మిత్రమా?

చక్కని మానవీయత
చిక్కబడితే
చ్హా అంటూ చా చా అనుకుంటూ
చీదరించుకుంటూ , సిగ్గులేని స్వార్థాల
చువ్వల్లో ఉంటూ
చావురాని
చేవలేని
జవసతవాలుడిగి
జాణతనాన్ని
నా గొప్ప అనుకుంటూ
పబ్బం గడిపేసుకుంటూన్న మనకా ఈ సంఘ
భాధలు . .హవ్వా !! సిగ్గు చేటు కాదా ఇది.

మాయల సుడిగుండాల్లో
యాయావారాలక్కూడా
రమణీయతనా?

లంకలో  రావణుడు ఏదో
వంకతో పవిత్రతను పాడు చేయడం
అర్థం లేని జీవితంతో
ఇంకా ఎన్నాళ్ళు
ఈ నాటకాలు...

ఓ చాక్లెట్ బాయ్ లైఫ్ స్టయిల్..

 హే భాను ఎక్కడున్నావ్...
వస్సాప్ లవ్.. ??

వాటే నాటీ గర్ల్  యూ ఆర్!!
క్యాడ్బరీస్ నవ్వులతో
నోరూరేల ఓరగా చూస్తూ
గాడ్జెస్ లా నడుస్తూ వస్తోంటే
ఐ విల్ల్ డై ఫర్ యూ మిలియన్ టైమ్స్ ! ఐ స్వేర్..
(బ్యాక్ గ్రవుండ్ లో జాజ్ మ్యూజిక్...)

రేపు నా పల్సర్ ఇంకాస్త
మోడిఫయ్ చేస్తున్నా.
ప్రసాద్ లో అవతార్ కు వెల్దాం మై గర్ల్..
ఐ జస్ట్  బుక్ డ్ ఆన్ లైన్ బేబి.

లెవిస్ జీన్స్ లో
ఫంక్ హేయిర్ స్టయిల్
పాయిసన్ సెంటూ
పింక్ టాప్ తో... వాహ్ వా.
వాటే బ్యూటి మై గర్ల్.

దేర్ ఈజ్ నో లైఫ్ వితవుట్ యూ.
జస్ట్ హోల్డ్ ఎ మూమెంట్ లవ్.....

హే అమ్ కాలింగ్ ఫ్రమ్ పార్క్ ఎవెన్యూ
కెన్ ఐ ఆర్డర్ ఎ చికెన్ బర్గర్ విత్ బ్లాక్ సాఫ్ట్ డ్రింక్ & ఫ్రయ్స్ ప్లీజ్.

ఓకే డాల్ విల్ మీట్ యూ ఎట్
ప్రసాద్ గ్రవుండ్ ఫ్లోర్.. షార్ప్ ఫైవ్ పీఎం ఓకే..
లవ్  యూ. గూడ్ డ్రీమ్స్..

నిన్నటి కల.

నిన్న నీ ఆలోచనలు
అందమైన మన కలయికలు
ఆక్షేపణలకందని ఊసులు
ఎడతేగని బాసలు
హృదయాంత:పురాన
రేరాణిలా నీ నవ్వులు.

తూర్పున వెలుగురేకల
సవ్వడితో మెలుకవయి చూస్తే
ఆకాశంలో ప్రతిబింబం
కొత్తకాంతితో వెలిగిపోతోంది
.

చితిలోనే సీమంతం..

కోటి కలలు కాకున్న
భవిష్యత్తు పైనున్న ఆశతో
ఎవరో తెలియని అతనితో
సహజీవనానికి సిద్ధపడింది

అమ్మా నాన్నల నమ్మకాన్ని
డబ్భుతో ముడిపెట్టినా
అక్కర్లేని సాంప్రదాయాలను
గుడ్డిగా ఆచరిస్తూ
కొత్తనాటకంలో
బరువు పాత్రను మొదలెట్టి
కొద్దికాలమైనా గడవకనే
సారం అర్థం కాక
చరమగీతం పాడి
పాడెనెక్కితే-సమాజపు ప్రేక్షక దేవుళ్ళ చప్పట్లతో
హుషారు హోరెత్తి రంజుగా గా ఉంది .

కాని ఆమే సీమంతం చితిలోనే
జరిగి ఆ సాంప్రదాయాలే
సిగ్గుపడ్డాయి...

నేను రాసిన కథలు.

Coming soon....

అమ్మ నీకు దండాలమ్మ మౌనంగా ఉండకమ్మ.........

రత్న గర్భ అని నీకు పేరు
ఐన రైతన్నల గుండె ఘోష లో
నిరాశలు నీకు పట్టవా?

నిన్ను నమ్మి
హలాల కోరలతో
నిత్య పోరాటాలు చేస్తూ
నిన్ను తడుపుతూ
కడుపు నింపుకోవాలనుకునే
బడుగు జీవాల ఆర్తనాదాలు
నీకు వినబడటం లేవా తల్లీ?

అన్నెమెరుగని పిల్లవాని
అమాయకమైన చూపుల్లోని
వారి భవిశ్యత్తు కాస్తైన కనబడవా నీకు?

నిన్ను పచ్చ చీరతో చూడాలనే ఆశతో
రాత్రి పగలు నిన్ను ముస్తాబు చేయడానికై
స్వేదకాయాలతో పరితపించే నా అన్నల
కన్నుల్లో ఆశలు నీకెందుకు పట్టవు అమ్మా?

ప్రకృతి జత కట్టి
తమ జీవితాలను పణంగా పెట్టి
ఆడుకుంటున్న రైతన్నలకు
నీ చల్లని చూపులు
ప్రసరించు తల్లీ....

అమ్మ నీకు దండాలమ్మ
మౌనంగా ఉండకమ్మ.........

కన్నీళ్ళు పెడుతోంది ఈ చితి..

గరిక పొదళ్ళో మాటు వేసిన
అందమైన భ్రమల్లో
రాని చినుకులకై
ఎండమావుల్లో
ఎదురుచూపు.!

స్వాభిమానపు కబందహస్తాల్లో
చిక్కి,కేకలు పెడుతున్న
ఆవేశం,
కట్టడుల ధుర్భర కోటకెదురుగ
ముందడుగులేని దారి.!!

బంగారు కలల్లో
పడి-నలిగి, మెరుపు ఎగిరి
పాడైపోతున్న బాల్యపు
అసహాయతల
సమాజపు వైతరిణిలో
ఈదుతున్నపుడే తెలిసింది
చచ్చి అపుడే చాలా కాలమైందని.!!

అన్నీ తెలిసి
కన్నీళ్ళు పెడుతోంది
నన్ను కాలుస్తున్న ఈ చితి..

ఐనా నీ మనసు అద్దమోలే మెరుస్తూ......

అక్షరహీనమైన భావాల ప్రవాహం
నిర్లజ్జమైన ముసుగు నవ్వుల కోళాహాలం
హాహాకారాల వికృత ధ్వనుల అభ్యుదయం
ఎర్రని మంటల్లో కాగితపు నమ్మకాలు
ఆవిరవుతున్న కన్నీళ్ళ ఏడుపులు
నవసమాజపు నిర్మాతల చేతులకు సంకేళ్ళు
అయ్యో గంగమ్మా..!! ఎందుకు నీ ఉరుకుల ప్రవాహం???

మనసు పోరాటంలో ఓడి నేను
గంగమ్మ ఒడిలో శాశ్వతంగా...

ఒడ్డున నువ్వు ఎందుకో నవ్వుతూ
ఐనా నీ మనసు అద్దమోలే మెరుస్తూ......

అక్కరకురాని ఆదర్శాలతో


అప్పటికీ అనుకుంటూనే ఉన్నాను

కర్మసధ్దాంతం మాత్రమే మనషికి

ప్రశాంతతనిస్తుందని…

ఐన తెలియని ఆవేశంతో

అక్కరకురాని ఆదర్శాలతో

అరతం కాని ఆలోచనలతో

ఏదో సాధిద్దామనుకునే నాకు

ఒంటరినయ్యాను పిచ్చి నమ్మకాల

సమాజ వలయంలో చిక్కుకుని.

నవ్వుతున్నారు అందరూ తమషాగా

కాని ఇదెక్కడి న్యాయమో నాకర్థం కావడం లేదు.

అస్తిత్వాలు ముక్కలవుతున్నా కూడా

కర్మనుకునే సిధ్ధాంతాలు ఎవరినుద్దరించాలనీ????

పుట్టించిన దేవుడికి కూడా అర్థం కాని

శికండి సిద్దాంతాలను

నేను కూడా జేజేలనలా???

అయ్యో ఇది నిజంగా కర్మ సిద్దాంతమేనా?????

నిన్ను చూసినపుడు....అమాయకమైన నీ కళ్ళు

నాకు పచ్చని అడవిలోని నెమలిని గుర్తు చేస్తుంటాయి.

నీ కల్మషమెరుగని మాటలు

నాకు మాటలు రాకుండా చేస్తాయి.గుండె గొంతుతో ఎలుగెత్తాలని ఉంది నువ్ నా అని.కాని ఏదో తెలియని మీమాంస నా గోంతును నులిమేస్తూ

నీ పట్ల నాకున్న భావాలను నొక్కిపడుతుందెందుకో.సమాజపు పోకడల సంఘర్షణలొ ప్రతీ క్షణం ఓడుతూ

నయనాలెండి భావాల తడి కనబడక-నేను

వికృతంగా కనబడుతూ, భ్రమిస్తూ

నీ ఆలోచనల చుట్టూ పరిభ్రమిస్తూ, ఆశతో

అద్భుతాలకై మౌనంగా,ఎదిరిచూస్తున్నాను, నా గుండె-జీవితపు ఖాలీని పూరించడానికైఆదర్శాల అలలు నా మెదడు పొరలను చీల్చుకుని

ఆఖరి ఆలోచనకై గగ్గోలు పెడుతుంటే,

నా గుండెలో కనబడని మంట సన్నగా మొదలయింది.......