Showing posts with label నా అలోచనలు. Show all posts
Showing posts with label నా అలోచనలు. Show all posts

Thursday, July 18, 2013

ప్రశ్నల పయనం......



ఈ ప్రపంచం, మనుషులు జీవితాలు అన్నీ కూడా ఆ దేవుని ఆట.
అశాశ్వతమైన జీవితం మనది. 

మన శాశ్వత మజిలి ఐతే నరకం లేదా స్వర్గం....మనం దేని అర్హులమో తెలుసుకోడానికే 
ఈ ప్రపంచాన్ని సౄష్టించి మనల్ని మనుషుల్ని చేసాడు ఆ దేవుడు.
ఈ బంధాలు, మానసిక భావాలు అన్నీ కూడా ఆయన మాయనే...
ఇవి అర్థమైన నాడూ మనసులో అలజడి తగ్గుతుంది.
అంత వరకు ఎంత వద్దనుకున్నా ........ " అశాంతే"...!!!

ప్రశ్నల సుడిగుండాల్లోంచి ఎగిసిపడే కణాల్లోనూ
మళ్ళీ ప్రశ్నలే పుట్టుకొస్తూ నా అన్వేషణ
అంతే లేకుండా సాగిపోతూనే ఉంది.
సమాధానం వెతెక్కునే ప్రయత్నం లో ఆలోచనలు పెరిగిపోతూ
గాలి బుడగల్లా పేలిపోతునే ఉన్నాయి...


అప్పుడర్థమయింది నాకు
ప్రశ్న విశ్వం లాంటిదని..ఈశ్వరుడికే తప్ప ఎవరికీ తెలియని సమాధానమనీనూ.
అప్పుడు ఈశ్వరం నన్నావహించి ఎంతో ప్రశాంతత.

Saturday, April 16, 2011

శూన్యంలో రససిద్ధి...




అప్పుడే అడుగులేస్తు
అంతులేని నాట్యంతో
ఆహార్యాన్ని
హరిపాదాలకర్పిస్తూ
అడుగుల్లో భావాలను
అబినయించే
ఆ మయూరం
ఆకలి ధాటుకు
హావభావాలను
అనుకరించలేక
కల కనికరించక
అడుగుల్లో
వణుకు
శూన్యాన్ని
అనుకరిస్తున్నాయి.

అది నాట్యమా లేక నాటకమా?

 రససిద్ధి సాధ్యమా??

Friday, April 8, 2011

మూర్ఖత్వం...




ఇది సాధరణంగా మన సమాజంలో "తెలివి"గా చలామణి అవుతుంది.కొండొకచో డామినేటింగ్ గా ఉంటూ జనాలను నమ్మించడానికి "తెలివైన" మేధావుల వాదనలవుతాయి.

ఒక సక్సెస్ సాధించిన వ్యక్తి చెప్పే వాటిని మనం చాలా ఉత్సుకతతో వింటూ-చూస్తూ ఉంటాం
సిగ్గుపడాల్సిన విశయమేమిటంటే బలహీనమైన మనస్సు ఉన్న వాళ్ళు పనీ పాట లేకుండా ఉండే పరాన్నజీవులు వాటిని
తమ జీవితానికి ఆపాదించుకునే ప్రయత్నం చేస్తుంటారు ఇలాంటివి చేసినంత మాత్రాన మనం ఓటమి నుండి తప్పించుకోగలమా ?
సంపూర్ణ్తత్వానికి ఓటమి అవసరమైనపుడు తాన్నుండి దూరమవడం మూర్ఖత్వం కాదా..?
నిజం తెలిసే లోపు సమయం గడిచిపోయి దిక్కుతోచకుండా ఏమి సాధించకుండానే ఉంటారు బ్రతికినన్నాళ్ళు.

Monday, March 14, 2011

Freeze....Finally.

మనలో ఉండే అనుభూతులు
కాలానుగూనంగా మారుతూ
చివరికి నిస్తేజమవుతాయి
అపుడు వాటి అవసరం
లేశమాత్రంగానైనా ఉండక
వాటి పట్ల మన పూర్వ ప్రవర్తన

అసహ్యంగా కనబడుతుంది.
అందులోంచే
మన ప్రయాణం మొదలయింది
అలాగే సాగుతుంది
అలాగే ముగుస్తుంది

అలాగే ముగిసిపోవాలి 


మరి ఇది 

జీవితం కదా...


Sunday, March 21, 2010

అక్కరకురాని ఆదర్శాలతో


అప్పటికీ అనుకుంటూనే ఉన్నాను

కర్మసధ్దాంతం మాత్రమే మనషికి

ప్రశాంతతనిస్తుందని…

ఐన తెలియని ఆవేశంతో

అక్కరకురాని ఆదర్శాలతో

అరతం కాని ఆలోచనలతో

ఏదో సాధిద్దామనుకునే నాకు

ఒంటరినయ్యాను పిచ్చి నమ్మకాల

సమాజ వలయంలో చిక్కుకుని.

నవ్వుతున్నారు అందరూ తమషాగా

కాని ఇదెక్కడి న్యాయమో నాకర్థం కావడం లేదు.

అస్తిత్వాలు ముక్కలవుతున్నా కూడా

కర్మనుకునే సిధ్ధాంతాలు ఎవరినుద్దరించాలనీ????

పుట్టించిన దేవుడికి కూడా అర్థం కాని

శికండి సిద్దాంతాలను

నేను కూడా జేజేలనలా???

అయ్యో ఇది నిజంగా కర్మ సిద్దాంతమేనా?????

Thursday, December 31, 2009

మన ప్రపంచాన్ని కాపాడుకుందాం..


ఆక్రోశాలు - ఆక్రందనలేనా
నిస్సహాయత - నిట్టూర్పులేనా?

మారణహోమాల సుడిగుండాల్లో
మంచు బిందువుల సున్నితత్వం
ఆవిరైపోవాల్సిందేనా?

మనుశులమనుకుంటూ
మనసు గతులను తెలుసుకుంటూ
కళ్ళు చూపే ప్రపంచంలో
హడావిడిగా పరుగెడుతున్న మనం,

ఒక్కసారి మానవత్వాన్ని స్మరిద్దాం మనస్పూర్తిగా.
గడిచిన కాలన్నీ ఎలాగూ పొందలేము

మిత్రులారా !!
కనీస ధర్మంగా మన
ముందున్న సమాజాన్ని
కొత్తలోకంగా మారుద్దాం...


మానవ విలువలను కాపు కాస్తూ
మన ప్రపంచాన్ని కాపాడుకుందాం..

 

Sunday, November 29, 2009

ఈ ప్రశ్న నన్నింకా వొదలడం లేదెందుకో!!

సంవత్సరాలుగా నా మెదడును తొలుస్తున్న
ఈ ప్రశ్న నన్నింకా వొదలడం లేదెందుకో!!
అన్నీ నావనుకుంటూ
నేనే అన్నీ అనుకుంటూ
అమ్ములపొదిలో దాచుకున్న
ఇడియాలతో-ఆడుకుంటూ
అక్కరకురాని చుట్టాలతో
అవసరాలకుమించి
బంధాల సుడి గుండాల్లో
చిక్కుకుని, భావస్పర్ష ఘర్షణల్లో
ముసుగులేసుకుని-ఎవరికి తెలియని
మంచితనాన్ని ఆపాదించుకుని
కుంచించుకుంటూ-కంగారు పడుతూ
హడావుడిగా బ్రతుకుతున్న
మనకు.......
అసలు నిజం తెలిసేదెపుడు...

Thursday, November 26, 2009

నా నుండి నేను దూరమవుతూ ...


సత్యాలను తెలుసుకోడానికి
జీవితకాలం కావాలా?
జీవితం సత్యమా???

అశృధారల ప్రవాహంలో
అంతు చిక్కని ఆలోచనలతో

మౌనంగా చీకటిగదిలో
నా పక్కనే నేనుంటూ, ఒదార్చుకుంటూ,
నీడతోడుగా...నేను -
అర్థంకాకుండా!!


ఎందుకో నా నవ్వును
తీసుకుని పరుగెడుతూ నువ్ ,

నా నుండి దూరమవుతూ
శూన్యంలో నిన్ను వెతుకుతూ నేను


వ్యర్థంగా.......................

Wednesday, September 30, 2009

మాయా ప్రపంచం..

మాయా ప్రపంచం..
ఇక్కడ మనది ఏదీ కాదు.
అసలేమీ లేదు.

అందరూ ఉంటారు,
అన్నీ చేస్తారు.కాని ఇంకేదో అవుతుందీ ,
ఆనందంగా ఉంటాము (??) .

పుట్టుక - చావు మద్య కాలాన్ని
మన జీవితంగా మలిచి ఆ దేవుడు
ఆడుతున్న ఆటలో గెలుపు మనది ఎలా అవుతుంది?

అమ్మా అంటాం , అంతలోనే అమ్మో అంటాం .
కాని ......

ఏమో ? ...
అసలేముంది చేయడానికి
హాడవిడీ తప్ప ఇక్కడ ?

ఏదో కనుగొన్నాము - కనిపెట్టాము
కాని నిజాన్ని...?? అసలు......

ఆలోచనలను వెతుక్కుంటూ

ఆమే నేనేంటో
నాకు చెప్పి నాలోని
నన్ను నాకు పరిచయం చేసింది...

ఆమె సాంగత్యం నన్ను
సౄష్టిలో మమేకం చేసింది
గర్వంగా తనవైపు చూస్తుంటే
చల్లగా కరుగుతూ
నా గుండెను చీల్చి నా
హౄదయాన్ని తీసుకెల్లింది.


నిశ్శబ్దంలో
ఆలోచనలను వెతుక్కుంటూ
ఆశగా నేను...

Saturday, September 26, 2009

ఆమె !


జీవితం చిన్నదైనవేళ
నాలో నేను పరిబ్రమిస్తూ
ఏమీ సాదించలేదనే నిరాశలో
కొట్టుమిట్టాడుతూ ఇక చాలూ అని
ఏమీ చెయలేననే నిజాన్ని ఒప్పుకుంటూ
చావు వైపు వేసిన అడుగు చివరన ఉన్న వేళ
ఆమె…పలకరించింది !!

ఆశ్చర్యం .. నాలాంటి కరడుగట్టిన నాస్తికున్ని పైగ ప్రపంచంపైన అంతులేని కోపాన్ని పెంచుకున్న ఒక ఉన్మాదిని ?

ఒక్క చూపుతో ఎలా కట్టేసిందో నాకు ఇప్పటికీ అర్థం కాని విషయమే…


ఎవడు వీడు ?


వాడు
శున్యాన్ని శోదిస్తు
అకస్మాత్తుగా అడుగుతాడు

“ధర్మమెక్కడా” అని

ఆకలవుతుంది…..

ఏదుస్తు నావ్వుతాడు,మళ్ళీ అడుగుతాడు
“నిజాయితీ” ఎక్కడా? అని

అతని ఈ ప్రస్థానం అంతం లేనిది..

అందుకే వాడిని “పిచ్చొడు” అందాము.
ఆనందంగా ఉంటుంది.

ఐతే,

మనల్ని వాడు ఏమనుకుంటున్నాడో?
వొద్దులే
ఆ విషయాన్ని వొదిలేద్దాం.

నిజాన్ని భరించే శక్తి మనకు లేదు..

తొలి మంచు ఘనీభవించింది..

తొలి మంచు ఘనీభవించింది
వేకువ సూర్యుని
వెచ్చని కిరణానికై
చలిగాలుల అక్కున జేరి!!

ఇంధ్ర ధనుస్సు ఎక్కుపెట్టాలా ??

ఆ రాత్రికి
ఆయుష్షెక్కువ
అప్పుడే పోనంటోంది

వేచి వేచి ఆ
మంచు కరిగి
నీరయ్యింది !!

అక్షరాలతో మార్పునాశించడం…


అక్షరాలతో మార్పునాశించడం నా పిచ్చితనమనుకునే మీకు నా సమాధానం చిరునవ్వే,
మార్పు శాశ్వతమైనది.. అంత త్వరగారాదు…
మన ప్రయత్నాలు చేస్తూ అవకాశం కొరకు వేచి ఉండాలి.ఒకరిని చంపడమో లెదా ,
మనం చావడమో చాలా సులభం, కాని మన సిద్ధాంతాల ప్రభావాలతో వేల రకాల
మనస్థత్వాలతో నిండి ఉన్న సమాజంలో మార్పు అంటే చాలా కష్టమైనా,
అసాద్యమేమీ కాదు దానికి నిదర్శనం మన ఇప్పటి స్వేచ్చ.

కాదంటారా .. కాదనగలరా ????

ఒక్కసారి మళ్ళీ ఆలోచించండి !!

అసలే కొద్దికాలం ..!!

నిజాలు ఎప్పుడు నిజాలే కదా
పుట్టినపుడు ఎవరొ సంతోషిస్తారు
పెరుగుతుంటే ఎవరో అనందిస్తారు
మాటలొచ్చాక-అందరూ అంటారు.

కాని అన్నీ మనవనే
పిచ్చి భావన
మనలో ఎంతకాలం ?

మనతో ఉన్న దేహమే
రెండు రోజులు వొదిలేస్తే
మురికవుతూ
చిరాకుగా ఉంటుందే

మరి ఇక్కడ ఇవన్ని
మనవి ఎలా అవుతాయి ?
అనుకున్నా కూడా,

ఇదంతా ఒక
రంగుల మిశ్రమమే
అందరూ ఉంటారు
అన్నీ చేస్తారు
మనమూ ఉంటాము , కాని
ఏమీ కాదు

కొందరికైతే
తొందరెక్కువ
మద్యలోనే
వెళ్ళిపోతారు

ఆ రాత్రి ..



సమయం ఉదయం ఏడు గంటలు
రోజూలాగానే నడుస్తున్నను ఆ రోడ్డుపై
గమ్యం తెలియకుండ!

అనుమానమొచ్చి
వెనక్కి తిరిగి చూసా
ఎవరూ లేరు..

హటాత్తుగా నువ్వు గుర్తుకొచ్చి
బాదపడ్తూ నవ్వుకోంటున్నాను
మొక్షమార్గం గురించి ఆలోచిస్తూ,
దారికై వెతుకుతున్నాను
అటూ ఇటూ…

అనుమానమొచ్చి
వెనక్కి తిరిగి చూసా
ఎవరూ లేరు..

చిన్నపుడు
నాతో పాటు ఆడుకున్న
మిత్రులు గుర్తుకొచ్చారూ
ఎక్కడున్నారో వారంతా ??

అనుమానమొచ్చి
వెనక్కి తిరిగి చూసా
ఎవరూ లేరు..

చీకట్లో వెలుగొచ్చినట్లు
ఆలోచనల్లోంచి తెరలు తెరలుగా
ఒక పూవు రెక్కలువిప్పి విచ్చుకొంటునట్లుగా
నాలోంచి నేను వీడిపోతూ …

నడుస్తున్నాను నడుస్తున్నాను నడుస్తున్నాను నడుస్తున్నాను
నడుస్తున్నాను నడుస్తున్నాను నడుస్తున్నాను నడుస్తున్నాను
నడుస్తున్నాను నడుస్తున్నాను నడుస్తున్నాను

నడుస్తునే ఉన్నాను.. కళ్ళు మూసుకుని.
నడక పరుగై

హటాత్తుగా నా పాదాలు గాలిలో
ఎక్కడికో జారిపోతున్నాను

లాలి పాటలు అమ్మ గుర్తుకొస్తు
నా కళ్ళలోంచి నీళ్ళూ.

ఉలిక్కిపడి లేచి చూస్తే
కుక్కి మంచంలో నేను
పక్కనే ఆరిపోతూ బిక్కు బిక్కుమంటున్న కొవ్వొత్తి.

ఆ రాత్రి మళ్ళీ నిద్దర్రాలేదు…

Monday, September 21, 2009

మాయా ప్రపంచం..


మాయా ప్రపంచం..
ఇక్కడ మనది ఏదీ కాదు.
అసలేమీ లేదు.

అందరూ ఉంటారు అన్నీ చేస్తారు.
కాని ఇంకేదో అవుతుందీ , ఆనందంగా ఉంటాము (??) . పుట్టుక - చావు మద్య కాలాన్ని
మన జీవితంగా మలిచి ఆ దేవుడు
ఆడుతున్న ఆటలో గెలుపు మనది ఎలా అవుతుంది?
అమ్మా అంటాం , అంతలోనే అమ్మో అంటాం . కాని ...... ఏమో ? ...
అసలేముంది చేయడానికి
హాడవిడీ తప్ప ఇక్కడ ?
ఏదో కనుగొన్నాము - కనిపెట్టాము కాని నిజాన్ని...??
అసలు......

Wednesday, September 16, 2009

శూన్యంలో నేను !

హఠాత్తుగా జగమంతా చీకటి,

గ్రహాల గమనం అస్తవ్యస్తం,
మహార్ణవం,?
కేకలు,
ఏడుపులు-మెరుపులు,
లీలగా గాలి శబ్దం,..
రెండుగా చీలిన విచిత్ర సవ్వడి,
చీకటి సూర్యుడి బేలతనం,
కణాల గలగలలు,
గుండెపొరల్లో అగ్ని కీలలు.................................,

విశ్వంలోకి నడుస్తూ..,

శూన్యంలో నేను !!!!!!