అమ్మ ఆలోచనలు


బోరున కురుస్తున్న వానలో
కత్తులతో నా పొట్టలో కోస్తున్న కోతలో
నీ జన్మకై నేను పడుతున్న ఈ ఆరాటంలో,
నిన్ను బతికించుకుందామనుకున్న ఆశనే కదా..!!
నా ఒంట్లో పేగులను చీలుస్తూ
పుట్టించిన ఆ భగవంతుడిని తిడుతూ
గుండెలవిసేలా ఉన్న నా అరుపులు
ప్రాణాలను కదిలిస్తున్న నొప్పులు
ఇవన్ని ఎందుకోసమని నేనెప్పుడు
అనుకోలేదు కన్నా !!
 
నీ క్షేమం కోసమని
నా శరీరాన్ని సూదులతో గుచ్చి,
డాక్టర్లు నా పొట్టను కోసి
నా రక్తం కారేలా చీలుస్తూ,
నిన్ను ఈ ప్రపంచంలోనికి తెచ్చిన క్షణాన
నా మదిలో కలిగిన ఆనందానికి(??)
నా చావును అడ్దు పెట్టాను, కాని నాన్న,


చిన్నపాటి జొరానికి సైతం
తట్టుకోలేని స్థితిలో
నిస్సహాయంగా ఉన్నాను ఇపుడు.
మాటలు తడబడుతూ
అసహ్యంగా ఉన్న నా మొహంలోని
మడతలను చూస్తూ నీ కల్లల్లో
కనబడుతున్న ఏవగింపును (?) చూడడానికి
ఆ దేవుడు నాకు కళ్ళుంచినందుకు నిందిస్తున్నాను.


ఆకలిగా ఉంది నాన్న, అడగడానికి నోరు సహకరించడం లేదు కన్నా
కోంచెం అన్నం పెట్టరా సోశొచ్చి కళ్ళు తిరుగుతున్నాయి.
నీ కోడుకు తిన్నపడు కింద పడే మెతుకులైనా పెట్టరా మా బాబు కదూ.


ఎందుకు కన్నా నన్ను ఇంతలా అసహ్యించుకుంటున్నావు
నా ఒంటిపైనా నీ మలముత్రాలు పడ్డపుడూ నేను అసహ్యించుకోలేదు
నీకు అనారోగ్యమైనపుడు నా పైన వాంతులు చేసుకున్నా

అసహ్యించుకోలేదు
అమ్మతనాన్ని నమ్ముకున్నాను కన్నా!
ఇంకా కొద్దిరోజులే కదా నేను ఉండేది

కాస్త అన్నం పెట్టు నాన్న.
 
( ఇంతకు మించి నేను రాయలేక పోతున్నాను అమ్మ మనసును వివరించడానికి నాకు ఉన్న అనుభవం సరిపోదు - క్షమించగలరు)

1 comments:

  కెక్యూబ్

January 30, 2010 at 5:21 PM

కళ్ళు చెమర్చాయి సారూ