చతుర్నీతి - || ఊహ తెలిసే వరకు ||

చిన్నప్పుడు తెలియనితనంలో అన్నీ స్వచ్చంగానే ఉండేవి. నేను అందరికీ నచ్చేవాడిని నాకు ఊహ తెలిసే వరకు.


అన్నీ నాకు  చిత్రంగానే కనబడుతున్నాయి. 
గుండెలో భావాలు భాస్వరంలా భగ్గుమంటుంటే వచ్చే ఆలోచనలకు ఎదుట జరుగుతున్న సంఘటనలకు అసలెందుకు పొంతన ఉండట్లేదు?

నిన్న  ఒక మిత్రుడంటున్నాడు ...

అసలు ఈ సమాజంలో మార్పు రావాలి,దాని కోసం యువత  నడుం బిగించాలి .
వారికి మనలాంటీ వాళ్ళు దిశా నిర్దేశం చేయాలి అంటు అల్టిమేట్ గా మార్పు తప్పని సరి అనే  తన ఆలోచనను వేలిబుచ్చాడు.
ఐతే ఇక్కడ జరిగేవన్నీ కూడా కేవలం పరిస్థితుల ప్రభావం - నైతికత లేమి - విద్య లేమి - ఇలాంటి కారణాలు ఎన్నో ఉన్నాయి కదా.
(  ఈ మిత్రుడికి ఒక పెళ్ళైన ఒకావిడతో ఎక్స్ట్రా మారిటల్ ఎఫైర్ గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తుంది, ఐతే దానికి వాడు ఆ సంబంధానికి దైవాత్వాన్ని ఆపాదించుకుని
   చలం భావాలు నిజమే అంటూ తప్పుడు కుదించుకు పోయిన భావాలతో బ్రతుకుతూ తను-ఆమె ఇద్దరూ మనసులను మోసం చేసుకుంటూ తమ నీచపు అనైతికపు చర్యలను
    పాజిటివ్ గా మల్చుకుని సంతోశంగా ??? ఉంటున్నారు "" చాటుగా " ! ) 
ఇక్కడ నేను చలం గురించి రాయడం కాదు కాని ఆయన అసలు ఉద్దేశాలు ఇలా దారి తప్పిన వాల్లకు  ఎలా అలాంబన అవుతున్నయో చెప్తున్నాను.

మార్పునాశించే ఆలోచనను మార్చుకోవాలసలు " ఇక్కడ జరిగేవన్ని ఎలా జరగాలో అలాగే జరుగుతు ఎప్పటికప్పుడు కొత్త నీతులను కప్పుకుంటూనే ఉన్నాయి "
వాటిని సమర్ధించే వాళ్ళు కోకొళ్లలు. మంచి చేడులను గూర్చి మాట్లాడ్డం కరెక్ట్ కాదేమో అనిపిస్తోంది. అసలు అవి ఉన్నాయా అని. ఒకవేలా అదే నిజమైతే ఇన్ని రబసలెందుకు రోజు??
మన ఒకప్పటి చర్యలను మనమే ఇప్పుడు సమర్ధించుకోలేనపుడు ఇలా మంచీ చెడు అంటూ మాట్లాడ్డం హాస్యాస్పదం కాదా?? 
ఈ ద్వంద ప్రవృత్తి మన మనసుల్లో పుట్టుకతోనే నాటుకు పోయింది.
ఇక మనకు వేటి గురించి కూడా మాట్లాడే అర్హత లేదు  (ఇది నా అభిప్రాయం మాత్రమే అందరికి అప్లయ్ కాకపోవచ్చు ) !
ఇప్పటి ఈ తరం టెక్నాలజీ వెంట రెండొందల మైళ్ళ వేగంతో పరుగులు పెడుతుంది, ఒరిజినల్ భావాలు తెలియడానికి వేదాలను చదివే అవకాశం మనకు లేదు.
ఉన్నదల్లా పోటీ మాత్రమే అందులో నెగ్గడానికి మనమేసే ఎత్తులు-చేసే పనులు అన్నీ కూడా మానసిక వ్యభిచారమే కదా.
|| ఏదో ఒకరాత్రి మనసు గోలపెట్టినపుడు దాని గొంతు నొక్కేయక స్వేచ్చగా ఆలోచిస్తే అదే చెబుతుంది మనకు ఎంతలా మరుగుజ్జులమయ్యమో  - అక్కరకు రాని మోహపు గాలానికి ఎలా చిక్కుకున్నమో అని.
కాని అలాంటి ధైర్యం మనకు ఉందా అంటే దానికి ఒక్కోక్కరి దగ్గరా ఒక్కొక్క వాదన మళ్ళీ. ఇక్కడేదీ నిజం లేదు అలాగని అన్నీ అబద్ధాలు కావు. ఇక్కడ  జరిగేవి కేవలం యుద్ధాలే
అందరికీ గెలుపు మత్రమే కావాలి దాని కోసం ఏదైనా చేస్తారు అన్నీ నీతికి కట్టుబడే ఉంటాయి  కాని
తీరం లేని గమ్యం కై  విరిగే నౌకలో నిశ్శబ్దంతో యుద్ధం చేస్తూ ప్రయాణం చేయాలి-తీరం దూరమవుతూ వెక్కిరిస్తూ ఉంటుంది అలుపు రాకుండా జగ్రత్త పడాలి, 
ఎప్పటికప్పుడు కష్టాల కెరటాలు నీ నౌకను పల్ట్టీ కొట్టించడానికి అడుగడుగునా ప్రయత్నిస్తూనే ఉంటాయి. నీ ఒంట్లోని రక్తం ఎప్పుడు వేడిగానే ఉండాలి ఏ కొంచెం చల్లబడిందా ఇక అంతే.

అర్హతల ఆలంబన చూడకు నీ మనసు చెప్పే మాట విను అంతే అదే నీ విజయానికి మొదటి మెట్టు ఇక నీకు ఎదురుండదు.
మనసెపుడు నిజాయితిగానే ఉంటుంది కాని మన మెదడు ఆడే ఆటలో
మనం ప్రతి క్షణం ఓడుతూ దానిని పట్టించుకోలేకపోతున్నాం  అందుకే ఈ ద్వంద నీతుల కృత్రిమ కోటలను కట్టుకుంటున్నాం ఎప్పటికపుడు మనసు చుట్టూ బలంగా.
చాలా వరకు జనాలకు వారి మనసుతో పరిచయల్లేవు ఒప్పుకున్నా-ఒప్పుకోకాపోయినా!!!

స్థాయి ఎప్పుడు ఒకే స్థాయిలోనే ఉంటుంది  హెచ్చుతగ్గులుండవు. నీ కంటూ ఈ ప్రపంచంలో ఉందంటే అది నీ మనసే,
ఏదైన నిజముందా అంటే అది నీ పుట్టుక-చావు మాత్రమే అది మరువకు.

కారణాలు వెతకక ఒక్కసారి అర్దరాత్రి చల్లని వెన్నెల్లో నీ మనసుతో  మాట్లాడు నీలో అలజడి తగ్గుతుంది ( కచ్చితంగా ),
గమ్యమెపుడూ దూరమే కవలసింది కేవలం ఓపికతో కూడిన వేగపు పరుగే !

ఒకటే వాస్తవం ఈ జీవితంలో ...
మనం వస్తాం పోతాం మద్యలో జరిగేవన్ని అలా జరగాలి కాబట్టి జరుగుతున్నాయి-ఏవి ఎలా జరగాలో అలానే జరుగుతున్నాయ్
ఈ ప్రపంచంలో వాటికి ఏ మార్పులు చేర్పులు అవసరముండదు.

పుట్టిన తర్వాత చచ్చే వరకు జరిగే వాటిని నిశ్శబ్దంగా గమనిస్తూ ఉండటమే కావల్సింది, గుండెలో భావాలను అదిమి పట్టి గమనిస్తూనే ఉండు అప్పుడే ఈ సమాజంలో నువ్వొకడివి.
లేదంటే నిన్ను నువ్ వెలివేసుకోవాలి నాలాగా.
మనసుతో సంగమిస్తూ సంఘర్షిస్తూ ఇక్కడీ వెక్కిరింతలను నిస్సహాయంగా ఒప్పుకుంటు నిట్టూర్పుల క్షణాలను నీ రక్తంలోని కణాలతో కలుపుకుని నీ కళ్ళపైన  చేతగాని తనపు పరదా ను కప్పుకో.
మనసులోని నిజాయితిని  మాటల్లో - ప్రవర్తనలో  బయటపెట్టే  ధైర్యం లేనపుడు ఇంకా ఎందుకు ఇక్కడ, ఐనా ఈ నిజాన్ని ఎవరూ ఎందుకు ఒప్పుకోవట్లేదు.

అసలు మనిషి జన్మకు ఇక్కడ ఎవరికైనా అర్థం తెల్సా నాతో కలిపి. ఈ ప్రశ్నకు జవాబు ఇక్కడ ఉండదు.

విశ్వంలోనికెల్లి చూడు ఈ భూమి ఒక రేణువు అందులో మనం అసలే కనబడం,

ఈ మాటలంటుంటే జనాలు విచ్చిత్రంగా చూస్తున్నారు నన్ను, కాస్త కోపంగా కూడా...

నిజం నన్ను నమ్ము!!......... చిన్నప్పుడు తెలియనితనంలో అన్నీ స్వచ్చంగానే ఉండేవి. నేను అందరికీ నచ్చేవాడిని నాకు ఊహ తెలిసే వరకు.

కాని..... ఇప్పుడు కాదు....

================================
బుదవారం 25-June-2010 - రాత్రి సమయం : 8.40 నుండి 11:10  వరకు

తీవ్రంగా నా మనసుతో యుద్ధం చేస్తూ  ఇది రాస్తుంటే మొదటి సారిగా నా చేతులు వణికాయెందుకో...

నీ కలువ కన్నుల...

చీకటి కమ్మి
దారి తెలియని ఆ
క్షణాన-
నీ కలువ కన్నుల
మెరుపు చూసి
హృదయాంతరాల్లో
ఘనీభవించిన భావాలు
మౌనంగా
మందాకినై నిన్ను చేరాలని
వెచ్చగా వస్తున్నాయి.
మనసు నిండి పోయిందేమో
పెదవులపైన కూడా
చిరునవ్వు...స్వచ్చంగా
అచ్చంగా . శ్రీ రాగపు పాటలా...


================================
బుదవారం 23-June-2010 - రాత్రి సమయం : 8.40

అహో ఆ అందం

మృదుమోహన మందారపు
కాంతి  దరహాస నయనాల
అహో ఆ అందం,

హొయల నడక విన్యాసపు
పోకడలు
మస్తిష్కపు నాలికల
ఆలోచనల పరుగునాపుతూ
కాలాన్ని స్తంభింపజేస్తే

ఆకాసపు మబ్బులు
తెల్లబోయి తేలిపోయాయి
ఇక మాకు పనిలేదు ఇక్కడా అంటూ....

అలా చూడకు
ఆ చంద్రుడు కూడా
వెల్లిపోతాడేమో
నిన్ను చూసి
వెన్నెల వెలుగును నీకిచ్చి.

మనసు మనసు సంగమ ఫలితం..

మనసు మనసు
సంగమ ఫలితం ప్రేమంటే
నమ్మడం అనేది
మూర్ఖత్వమేమో
అనిపిస్తోంది నాకు నిన్ను చూస్తే.

నీ నవ్వు వెనకాల
ఇంత విషమా?
కొద్ది పాటి సంతోశం కోసం
ఇలా మోసం చేసావా నన్ను-నా నమ్మకాన్ని
దారుణంగా.

నిన్ను నమ్మినందుకు
ఈ  సృష్టినే అసహ్యించుకునే
స్థాయికి నన్ను దిగజార్చావు తెల్సా నీకు?
ఈ ఐడియాలజి అంతా బూటకమేనా?

రామయ్య గారి స్వగతం...

మనిషంటే మానవీయతా అంటూ
తొక్కలో గొప్పతనాన్ని ఆపాదించుకుంటూ
బ్రతికేస్తున్నాం మనం.

బ్రహ్మంగారి కాలజ్ణానం,
కృష్ణుడి గీత గాని
రామాయణంగాని
కేవలం నైతిక బోధనలే!

మనిషి అడుగున దాగున్న
వికృత పోకడలు
ఎలాంటివో
ఒక్కసారి మన
IPC Sections చూడండి.

గతానికి భవిష్యత్తుగా, వర్తమానంలో!

గతానికి
భవిష్యత్తుగా,
వర్తమానంలో!
అయోమయంగా
విలువల్లేని జీవితాలు
నమ్మకాల అపోహల
నడుమ
అభ్యుదయ భావాలంటూ
అంటరానివాడిగా
ఒంటరియై ఉన్నాడు
దారెటో
తెలియకుండా
దిక్కులు చూస్తున్నాడు.

మనోడి ఆవేదన..

ఇది ఇంతేనా మార్పు రాదా?

ఇది ఇంతేనా
మార్పు రాదా?
వందోసారి గొణుక్కున్నాడు "రాఘవ."

గత పదేళ్ళుగా సమాజపు పోకడలను అర్థం చేసుకోడాని ప్రయత్నిస్తూనే ఉన్నాడు రోజూ ఓడిపోతూనే ఉన్నాడు.
ఎందుకు పుట్టాను - నా వళ్ళ నాకు గాని సమాజానికి గాని ఏ రకమైన ఉపయోగమున్నదనే ఆలోచనలతో,
హడావుడి జీవితాలను గమనిస్తూ , తన జీవితంలోని స్తభ్దును బేరీజు వేసుకుంటూ రొజులను గడుపుతున్నాడు.

అత్తెసరు మార్కులతొ ప్యాసయిన  చదువుతో ఇక్కడ ఏంచేయాలో కూడా అర్థం కాక,
కాగితాలపైన పిచ్చి గీతలను గీస్తూ వాటిని కవితలనుకుంటూ అందరికి చెప్పుకుంటున్నాడు.

ఐతే రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన అతని గుండెలో ఇంకా మండుతూనే ఉంది.

ఆ రోజు ఆదివారం... తనతో పాటూ చదివిన కవిత తన బిడ్డనెత్తుకుని నిస్సహాయ స్థితిలో ఆ హాస్పిటాలో కనబడి నన్ను చూసి కంట తడిపెట్టుకోడంతో కలత చెందిన మనసులో
కాలేజీ రోజుల్లో తనలోని స్వతంత్ర భావాలు ఆమేను ఎంతలా ప్రభావితం చేసిందో మెల్లిగా గుర్తుకు రాసాగాయి...