నా మనవి..

నా మీద అభిమానంతో నా కవితలను ఆదరిస్తున్న అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.మీ అభిమానం నా పట్ల ఇలాగే ఉంచుతారని భావిస్తున్నాను.

ఐతే  నా కవితలను కొంత మంది తమ కవితలుగా ప్రచారం చేసుకుంటూన్నారని నా దృష్టికి వచ్చింది.అలా చేసే వారికి ఒక చిన్న మనవి, ఒక కవిత మంచి పదాలతో అర్దవంతంగా రావాలంటే నా లాంటి కవితా రచయితలకు ఎంతటి మానసిక అలసిపోటు ఉంటుందో ఒక్క సారి ఆలోచించండి.ఆలోచనలతో కుస్తీలు పడితే గాని ఒక పదం కలంలోచి బయటపడదు అవేశం - ఆలోచన - అంతర్మధనం - ఎంతటి క్షోభను అనుభవించాలో ఒక చిన్ని కవితను రాయాలంటే, అవి అర్థం చేసుకోండి .ఒకరి సొంతమైన వాటిని నావి అని చెప్పుకోవడాన్ని ఏమంటారో మీకు కూడా తెలుసు.దయచేసి మానసికంగా మరుగుజ్జులు కావద్దని నా మనవి ఇవి కేవలం బాధతో మాత్రమే రాస్తున్న రాతలే కాని కోపంతో కాదు...


మరొక్క విషయం ఇలాంటివి సైబర్ చట్టం క్రింద తీవ్రమైన నేరాలుగా కూడా పరిగణించబడతాయి...