Showing posts with label నా వాదనలు .... Show all posts
Showing posts with label నా వాదనలు .... Show all posts

Wednesday, May 26, 2010

నీడలోని నిజం..

ఇద్దరు చదివారు న్యాయం
ఒకడు నేరం చేస్తే....
ఒకరు కాపాడాలని
ఇంకొకరు శిక్షించాలని
వాదిస్తున్నారు

మరేది నిజం?
ఏది న్యాయం?
ఇద్దరూ చదివింది
న్యాయమైనపుడు
మరెందుకు ఈ అన్యాయం?

ఏది నిజం?
ఏ నీడ నిజం...?

Wednesday, September 30, 2009

ఐనా మనం బాగానే ఉన్నాము కదా.

ప్రతీ అణువు
ప్రతీ రేణువూ..
అందరి అవయవాలు,
ఆకాశం కూడా..
విశ్వంలో తేలిగ్గా,
ఒంటరిగా తిరిగే,
గోళం మీదున్న మనం ..
నమ్మకాల అమ్ములతో-
ఆక్రోషపు ఆవేదనలతో-
అందంగా ఆనందంగా ?? ఉంటున్నాము కదా !!
అర్థం కాని భాషల్లో-
లేని భావాలను అందంగా పంచుకుంటూ... ఐనా
మనం బాగానే ఉన్నాము కదా.

కావలసింది అదే మరి..

Saturday, September 26, 2009

అవిటి మనసులు !!!


కాలం మారిందంటున్నారు అందరు…

పురాణాల్లోని
అసహాయత్వం వారసత్వంగా వచ్చి
భారంగా మోస్తూ, పిరికితనంగా మారి
మంచితనమనుకుంటూ,
చేతగాని తనాన్ని ఒప్పుకోడానికి
వెనుకడుగు వేస్తూ - బింకంగా
మొరాయిస్తూ - శుశ్కిస్తూ - చస్తూ
పక్కనే జనాలు చస్తున్నా చవటలా చూస్తూ
సంబరంగా ఎగిరి గంతులేస్తున్నాయి…
మనసులు - మన అవిటి మనసులు.

వంచనను మంచితనమనుకుంటూ
నిజాయితీ ముసుగులు ఇంకెన్నాళ్ళూ…???

ఏది సత్యమేదసత్యం??


నేను-నువ్వు
మోహం-కోరిక
ఆహార్యం-చాందసం
పిచ్చి-ప్రేమా
చావూ-నువ్వు
చావూ-నేను
ప్రాణం-ప్రేమా
ప్రకృతీ-దేవుడు
అసలు-శాసనం

చివరగా…..

నేను-నేనూ