వెక్కిరించిన కెరటాలు..



బ్రతుకు మీద నమ్మకాన్ని
అమ్మలేక,
ధైర్యాన్ని అప్పుతెచ్చుకున్నను.
ఎంతో ఎత్తుగా నిర్మించుకున్నాను
నమ్మకాన్ని కడలి తరంగాల్లా.
మీగడతరకల్లాంటి మోసపు మాటల
వెనక చీకటి కనబడలేదు.
కమ్మనైన ఆశల పొదల్లో
పిల్లోడిలా ఆడుకున్నా,
హిపోక్రసి ముల్లు
గుచ్చి గుచ్చి బాధపెడుతున్నా,
ప్రపంచం మీద నమ్మకం పోవట్లేదు!
అర్థం కావట్లేదు అసలు.
కెరటాల మనసులోని సుడి,
 
ముసుగు తొలగింది
ఏమీ లేదక్కడ. చీకటి తప్పా..
వెక్కిరించిన కెరటాలు
చప్పున దిగి నీళ్లలో కలిసాయి
నిశ్శబ్దంగా....
అర్థం కాక నేను ఆ ఒడ్డున నిర్వికారంగా....

1 comments:

  కెక్యూబ్

January 30, 2010 at 5:23 PM

ఎన్ని యుగాలైనా అల ఒడ్డుకు చేరేందుకు చేసే నిర్విరామ ప్రయత్నమే మనలను ముందుకు నడిపిస్తుంది మిత్రమా..