నా మంచు ఎడారి.చల్లనిదనుకున్నా
కాని

ఆకాశంలోంచి నల్లని కిరణాలు
ఏటవాలుగా వస్తూ,
ఎక్కడి నుండో తెల్లని పొగ
చుట్టూ కమ్ముకొంటూ,
పగుల్లొస్తున్నాయని
కప్పుకుంటూ వెలుతుంటే
నా వెనకాలే కాలిన చప్పుడు విని
తిరిగి చూస్తే
ఒకటి కాదు రెండు కాదు
వందల వేల కలేబరాలు కాలుతూ
నా మంచు ఎడారిని
కరిగించేస్తున్నాయి.
మద్యలో నేను.