నీ కోసం నేను శ్వాసిస్తున్నాను

నీ కోసం నేను శ్వాసిస్తున్నాను, అంటే నీకు
అతిశయమైనా...కొడిగడుతున్న
మన సంబందానికి అవసరమవుతున్నా..,
భాధాకరమైన విశయమేమిటో నీకు తెల్సా?

మనిద్దరి మద్య ఉన్న ఇష్టం
అవసరంగా మారిపోయినపుడు
చాలా సంతోశించాను.,

కాని ఇపుడది
స్వారూపాన్ని మార్చుకుంటూ
కేవలం అవసరాలకొరకు మాత్రమే
అనువైనదైనందుకు గుండె
నిజాల మంటల్లో
కాలిపోతుంది ప్రతీ క్షణం.

ఐనా ఆశ చావట్లేదు నాలో
సంతోశపు ఎండమావికై ఎదిరిచూస్తూ
నా జీవితం..

ఏం చేయాలో అర్థం కావడం లేదు.


నా నువ్వు..
చల్లని గాలి వీస్తున్నా
చిరు చెమటలతో ఆలోచిస్తున్నాను నిన్నటి సాయంత్రం నుండి.
ఆ వాదనలు నా ఆలోచనలను ఒక్కసారిగా
మార్చేసాయి.

ఉద్వేగపు స్థాయి ఉదృతమై
కళ్ళలో నీళ్ళు....
చిరునవ్వుతో బాధగా ఈ ప్రపంచాన్ని
రెండుగా చీల్చిన ఆ ధైర్యాన్ని
నేను తట్టుకోలేకున్నాను.

మనుషుల్లో ఉండాల్సిన
మనిషి తత్వాన్ని, మనసు తత్వాన్ని
ఒక్క స్పర్షతో నాకు తెలియజెప్పిన
ఆ నవ్వు నా కళ్ళముందు
పరదాలా ఆలానే ఉంది.

జీవితం గురించి బేలగా అడిగిన ఒక్కో ప్రశ్న
నా వొంట్లోని రక్తాన్ని ఒక్కో చుక్కలా మింగేస్తుంటే
పాలిపోవడం మినహా ఏం చేయలేకపోయాను.
సిగ్గుతో నిన్న నిజంగానే నిస్తేజమయ్యాను
నా ఇన్నాళ్ళ జీవన విధానం గుర్తొస్తూ
చెప్పేదొకటి-చేసేదొకటి...
చర్యలను సమర్ధించుకోడంలో నేను
ఇంతవరకు గొప్పగానే ఉన్నా
ఇప్పుడు అసహ్యాంగా ఉంది.

ఏమ్ చేయాలో తెలియక
ఆ పక్కనే కాలిపోతుంది
నాలోని పాడు ఆలోచనలు
చితిలో పేర్చుకుంటూ.

ఆ వేడిని తట్టుకోలేకున్నాను
ప్రాక్టికాలిటీ పేరుతో
సున్నితమైన ఆ మనసునుతో
నాకు తెలియకుండానే ఆడుకున్నానేమో
అర్థమవుతూ - ఆ అమయకమైన నవ్వు
నాళ్ళముందే కాలిపోతుంది.

నా ఆ నవ్వు ఇక లేదు.
ఏం చేయాలో అర్థం కావడం లేదు.