"పూలు పసిపిల్లల ప్రతిరూపాలే"పూల దండలంటే నాకు జాలి
ఎంత విశాదమో కదా....

జీవిగా ఉంటున్న మనకు
పూల జీవత్వం కనబడదా?
అందుకేనా అలా
నిర్ధాక్షిణ్యంగా  
వాటి ప్రాణాలను తెంచుతున్నాం?

పూలు పసిపిల్లల
ప్రతిరూపాలే నాకు, 

దారంతో గుచ్చిన పూలను చూస్తే నాకు
వేలాడే శవాలే గుర్తొస్తుంటాయి.

ఏదేవుడైనా ఎందుకు చెప్తాడు?
ఏ దేవతైనా ఎలా చెబుతుంది?
అకారణంగా జీవాలను చంపి
దారంతో వేలాడదీసి
మెళ్ళో వెయ్యమని ....... ???


వాటినలా వదిలేస్తే మనకేమైనా
హాని కలుగుతుందా?

==========================================

Note : ఇదెవరినీ నొప్పించడానికి రాయలేదు.
           లాజిక్కులు అవి అని కాదు, నాకు బాధనిపించి ఇలారాసాను అంతే .

           సమానత్వం, మనవ హక్కులు మనుషులకేనా ?
           వసుదైక కుటుంబంలో పూలు కూడా సబ్యులే అని చెప్పే ఉద్దేశ్యం నాది.
          ఇందులో వాదోపవాదలకు తావు లేదని మనవి.

మరో ప్రపంచమట !!


నీ కోసం

నీ కోసం నేను నిరంతరం చేసే 
క్షతగాత్రమైన ఆలోచనలు 
చివరికి దారి తెన్నులు తెలియకుండ
ప్రశ్నార్థకంగా మిగిలిపోతున్నవి
ప్రతీ క్షణం ....

మా ఊరి పిల్ల కాలువ...

మా ఊరి పిల్ల కాలువ పక్కనే
నడుస్తుంటే, చల్లటి గాలితో
సన్నటి వాన మొదలైంది..

కాస్త ముందుకెళ్లి కాలికింద
నలుగుతున్న మట్టిని చేతుల్లోకి
తీసుకుని చూస్తుంటే
ఎందరో సమర యోదుల నెత్తుటి వాసన..

స్వేచ్ఛను , స్వాతంత్ర్యాన్ని
అపహాస్యం చేస్తున్న ఇప్పటి
రాజకీయాలను చూస్తూ ఆ
మట్టి కూడా రోధిస్తుందేమో
నా వేళ్ళ సందుల్లోంచి మట్టి నీరు
ఎర్రగా .... 

అన్నీ కంప్లైంట్సే నిన్నటివరకు.

ప్రపంచంలో అన్నింటిపైనా,అందరితోనూ, అన్నీ కంప్లైంట్సే నిన్నటివరకు.
ఇన్ని సంవత్సరాల ఆలోచనలన్నీ మెదడు పొరలను చీల్చుకుని బయటికొస్తే బయపడ్డాను, కాని ఈ ప్రపంచంలో ప్రతీదానికి ఉండే మరో కోణంనుండి చూస్తే చాలా నిరర్థకంగా కనబడి, నా సంతోషాలన్నీ అనుకోకుండా వచ్చినవే అని, వాటి కొరకు నేను చేసిన ప్రయత్నాలు గాని పడ్డ ఆరాటం గాని కారణాలుగా కనబడలేదు.

అలాంటపుడు నా సమయాన్నెందుకు వ్యర్థం చేసుకోవడం? .... నాలోని నన్ను సమీకరించుకున్నాను.
నేనేంటో నాకు తెలుస్తుందిపుడు, అప్పుడర్థమైంది ఈ ప్రపంచమంటే నేనే అని - నామీద నాకే ఇన్నిరోజులుగా కంప్లైంట్స్ అని.
అన్నింటీనీ ఒక్కొక్కటిగా చీల్చి చూస్తుంటే రకరకాల పరిష్కారాలు కనబడుతూ నాలోని అలజడులు ఒకటొకటిగా తొలగిపోతూ దక్షిణాయనం పోయింది.

చల్లని గాలి శబ్దమొస్తే నా కిటికీ తెరిచాను, తూర్పు  సూర్యుని లేత కిరణాలు నా మొహాన్ని వెచ్చగా తాకాయి.