ఐతే... !!!పుట్టుకా-బ్రతకడం-చావడమే జీవితం ఐతే...

నీ కొరకై ,
నాలో నేనూ,
నాతో ,
ఆలోచనలతో,

అస్థిత్వాన్ని అందుకోవాలనుకుంటున్నాను....!!!!

మౌనపు ముసుగేసుకుని!!


పుట్టుక దగ్గర్నించి - చచ్చే వరకు జరిగే తతంగంలో ఇరవయ్ శాతమే మనకు తెలిసి ప్రమేయంతో జరుగుతున్నాయి ఒక్క సారి ఆలోచించండి.
చిత్రమైన విషయం ఏంటంటే -
ఇక్కడ ఎవరికీ తెలియదు ఎందుకు బ్రతుకుతున్నామో? ,
కాని అందరం హాయిగా ఉండటానికి చాలా వసతులు -వెసులుబాటులూ కల్పించుకున్నాము తెలివిగా .
ఒకరిని హాయిగా చంపొచ్చు చట్టం - న్యాయం లాంటివి నీకు క్షమ, రిహాబిలిటేశన్ పేరుతో తప్పించుకునే అవకాశాన్ని దోసిట్లో పట్టి అందిస్తుంది ,
దానికై చట్టం చదివిన ఇంటలెక్చువల్ బ్రూట్స్ ఎప్పుడూ రడీగా ఉంటారు సహాయం ??? చేయడానికి.
ఇక్కడ చాలా విషయాలున్నాయి చూడటానికి కాని వాటిని మనం గుర్తించం, వాస్తవానికి మనకు అవసరం ఉండదు..ఖర్మగాలి ఏదైనా పెద్ద ప్రమాదం మనకు జరిగే వరకు..
జరిగిన చరిత్రను ఒకసారి తిరగదోడితే మనకు కనిపించేదంతా చెత్తా చెదారంలాంటి అసహ్యకరమైన వాస్తవాలే వాటికి కారణాలు వెతకడం మొదలుపెట్టావో నీ జీవితం సరిపోదు నిజాలను కనుక్కోడానికి.
డెలిబరేట్ గా బ్రతకడం మనకు చిన్నప్పట్నుండి అలవాటు, అల్లరి చేయకుండా వుంటే చాక్లేట్లు - ఏడవకుండా ఉంటే చందమామా లాంటివి మనల్ని మనం కన్వీనియెంట్ గా ఉంచుకోడానికి రెడీమెడ్ వాదనలు ఉంటూనే ఉన్నాయి. నిజాయితీ - మోరల్ వాల్యూస్ - అస్థిత్వం - ఇంకేదో అంటు కొంతమంది అరుస్తుంటారు కొందరు మద్యలో కాని ఏమి లాబం.
అసలు వాటి గురించిన ఆలోచనలు మన మెదడు పొరల్లో ఎక్కడా లేవే..నేను బాగుండాలి-నా వాల్లు సుఖంగా ఉండాలి అంటూ స్పెండ్ చేసే సమయంలో ఐదు శాతం మనం ఇలాంటి వాటికి కేటాఅయించినా మన జీవిత పరమార్థం బహుష అర్థమవుతుందేమో..కాని మనకు అంత టైమ్ ఎక్కడుంది.?..

నా గురించి ఆలోచించడానికే సగం జీవితం
మన గురించి ఆలోచించడానికే మిగతా సగం జీవితం సరిపోతే

ఇక ఇలాంటి ఆలోచనలకు సమయమెక్కడ ఉంటుంది.

టైమ్ .................................................. అసలు దేనికైనా మనకు టైమ్ ఉంటుందా? కచ్చితంగా ఉండదు... మరి ఎలా...?????????

  • అసలు మనమేంటో మనకు తెలియాలి మొదలు
  • మన తాహతు ఏమిటో తెలియాలి
  • మన వలన ఏమవుతుంది తెలియాలి
  • మన బలం - బలహీనతలు తెలియాలి
  • నిజాయితిగా ఉండటం తెలియాలి
  • ఆత్మ విమర్ష కావాలి
వీటన్నిటికి ధైర్యం కావాలి . ప్రయయత్నం కావాలి.....

మరి అందరికి ఇలాంటివి అవసరమా అనే ఆలోచన రావొచ్హు .... కాని ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి . ఇప్పటి మన సౌలబ్యాలకై-అవసరాలు తీరడానికై - ఈ స్వేచ్చ - ఈ స్వాతంత్రం ఇవన్ని ఎవరో ఒకరు ఆలోచిస్తేనే కదా వొచ్చాయి . మరి ఇన్ని అనుభవిస్తున్న మనం మన వంతుగా ఆ క్రమంలోనే ఎందుకు ఆలోచించలేకున్నాం...మౌనపు ముసుగేసుకుని!!

నా నిస్సహాయత్వం....


రాస్తున్నాను కవితలంటూ
మనసు కదిలినపుడు,

కానీ ఎందుకో
నా అక్షరాలు క్షీణిస్తున్నాయి
భావనల బలం లేక..
ఆక్రందనల ఆవేశాలు
పనిచేయట్లే...

మూర్ఖత్వపు మందు కావాలేమో
మత్తుగా సోలిపోవడానికి....???

ఉద్యోగరిత్యా ఉండేది పరాయి దేశంలో ఐనా,మనసు మాత్రం ఎప్పుడూ ఇండియాలోనే..

సాహిత్యమంటే నిజమైన అభిమానమో లేక చిన్నప్పట్నుండి అందరు నన్ను మంచొడు వీడు అనడం మూలంగానో ఏమో కాని అప్పట్నుండే కవితలూ గట్రా రాసుకుంటున్నను!!!నాకున్నా ఒక అలవాటు ఏంటంటే ఏమైనా రాసుకునేటప్పుడు నేను ఆ క్యారెక్టర్ గా ఊహించేసుకుంటు రాస్తాను. ఒక్కొసారి చాలా బయమేస్తుందీ. నేను ఊహిస్తున్న ఆ భావనల దొంతరల్లో ఇన్ని ఆటుపోట్లు ఉంటాయని తెలిసినపుడు.

నేను ఈ బ్లాగు రాయడానికి ఒకే ఒక కారణం బహుష 1999లో అనుకుంటా దాదాపూ 8నెలలు నేను పడిన నరక యాతన అంతా ఇంతా కాదు ! సమాజం నాకు అర్థమయ్యేది కాదు. అప్పుడూ ఇప్పుడూ !!!

సమాజం అనుసరిస్తున్న కొన్ని విషయాలు,నమ్మకాలు నాకు చిత్రంగా అనిపిస్తున్నాయి! తార్కికంగా ఆలోచిస్తే అని ఎంత చండాలమో అవగతమవుతున్నాయి!! .

కాని ఏమి చెయ్యలేని నిస్సహాయ స్థితి.ఆలోచనలు ఎవరితో పంచుకోవాలో తెలీని సందిగ్దం.

ఇలాగే రొజులు గడిచిపోవడం నేను ఏమి చెయలేక కొన్ని సంవత్సరాల క్రితం దుబయి రావడం వస్తూనే డబ్భు సంపాదనలో తలమునకలవ్వడం నాకు తెలియకుండానే జరిగిపోయాయి! కాని మనసుకు శాంతి లేదు. ఏదొ చెయ్యాలని ఒక పిచ్చి కోరిక(ఆదేంటో తెలియదు మళ్ళీ!!)

ఇన్ని రోజుల తర్వాత ఈ బ్లాగు ద్వార కొంతమందైన నా ఆలోచనలకు సప్పోర్టు చేస్తారేమో అన్న చిన్నా ఆశతో

ఎపుడో అకస్మత్తుగా ఒక ఉద్వేగం నాలో ఎగసి ఎగసి,
నన్ను నిర్వీర్యుడిని చేసినపుడు కలిగిన,

భావ పరంపరలో కొట్టుకుంటూ రాసుకున్న కొన్ని నా

కవితలను అందరితో పంచుకోవాలనుకుంటున్నాను!!

శ్రీనురాగి…

ఇది అవసరమా???


నాకు నీ మీద ఉన్న భావనను
నేను ఇష్టం అనుకుంటున్నాను,

కాని....
చదివిన పుస్తకాల్లో
దీనిని ప్రేమా అంటున్నారు,
మమేకమంటున్నారు,
దీని గురించే రాజ్యాలు పోయాయి అంటున్నారూ,
ప్రాణాలు పోయాయి అంటున్నారు,
చంపడాలు - చచ్చిపోవడాలు
అంటున్నారు...

అసలు నాకర్థం కానిదేంటంటే..?

ఇది అవసరమా నాకు అని....