అక్కరకురాని ఆదర్శాలతో


అప్పటికీ అనుకుంటూనే ఉన్నాను

కర్మసధ్దాంతం మాత్రమే మనషికి

ప్రశాంతతనిస్తుందని…

ఐన తెలియని ఆవేశంతో

అక్కరకురాని ఆదర్శాలతో

అరతం కాని ఆలోచనలతో

ఏదో సాధిద్దామనుకునే నాకు

ఒంటరినయ్యాను పిచ్చి నమ్మకాల

సమాజ వలయంలో చిక్కుకుని.

నవ్వుతున్నారు అందరూ తమషాగా

కాని ఇదెక్కడి న్యాయమో నాకర్థం కావడం లేదు.

అస్తిత్వాలు ముక్కలవుతున్నా కూడా

కర్మనుకునే సిధ్ధాంతాలు ఎవరినుద్దరించాలనీ????

పుట్టించిన దేవుడికి కూడా అర్థం కాని

శికండి సిద్దాంతాలను

నేను కూడా జేజేలనలా???

అయ్యో ఇది నిజంగా కర్మ సిద్దాంతమేనా?????

నిన్ను చూసినపుడు....



అమాయకమైన నీ కళ్ళు

నాకు పచ్చని అడవిలోని నెమలిని గుర్తు చేస్తుంటాయి.

నీ కల్మషమెరుగని మాటలు

నాకు మాటలు రాకుండా చేస్తాయి.



గుండె గొంతుతో ఎలుగెత్తాలని ఉంది నువ్ నా అని.



కాని ఏదో తెలియని మీమాంస నా గోంతును నులిమేస్తూ

నీ పట్ల నాకున్న భావాలను నొక్కిపడుతుందెందుకో.



సమాజపు పోకడల సంఘర్షణలొ ప్రతీ క్షణం ఓడుతూ

నయనాలెండి భావాల తడి కనబడక-నేను

వికృతంగా కనబడుతూ, భ్రమిస్తూ

నీ ఆలోచనల చుట్టూ పరిభ్రమిస్తూ, ఆశతో

అద్భుతాలకై మౌనంగా,ఎదిరిచూస్తున్నాను, నా గుండె-జీవితపు ఖాలీని పూరించడానికై



ఆదర్శాల అలలు నా మెదడు పొరలను చీల్చుకుని

ఆఖరి ఆలోచనకై గగ్గోలు పెడుతుంటే,

నా గుండెలో కనబడని మంట సన్నగా మొదలయింది.......

సైకత సౌధాల సంబరాలు !!

దట్టమైన మబ్బులువెక్కిరిస్తూ మాయమయ్యయి.
బృందావనాలు మురళీ గానాలుఎక్కడికెళ్ళాయో కదా!
ముసురుకున్న ఆశలుపాము విషంలా మౌనంగాపూల పరిమళాల మాటున!!
చిన్నబోయిన చేతివేల్లుపిదికిలెన్దుకయ్యిన్దోరెక్కలు తెగిన పక్షి నిర్వేదంగా.....
సైకత సౌధాల సంబరాలుసద్దుమణిగాయిఅంబరపు వాస్తవ నీటిచుక్కల తాకిడికి నిర్జీవంగా.
ఇదే " నా " జీవితం ? !!