నిన్నటి నువ్వు, నీ నవ్వూ గతమైంది.

నువ్ నాలో తరిగిపోతున్నవ్ కదూ...
అశ్చర్యంగా ఉంది నాకు.

నీ బాసలు నీటి అలల్లా చప్పునా కరిగిపోతున్నాయ్
దూరం నిజంగా పెరిగిపోయింది
అంతా శూన్యమనే నా సిద్ధాంతం మరోసారి
నిజమయినందుందుకు సంబరపడలా,బాధపడాలో తెలియట్లేదు.

నిన్నటి నువ్వు, నీ నవ్వూ
గతమైంది.
తెలియకుండానే !!