అటకెక్కిన ఆదర్శం..

పదేళ్ళకే పద్యాలు పాడితే
అర్థం కాక నేస్తాలు
ఆశ్చర్యపోయిన అమ్మను
తిట్టిన నాన్నను చూసి
ఆ వయసులోనే నవ్వుకున్న
నన్ను చూసి మాస్టారు ముచ్చటపడి
నా బుజం తడితే పొంగిపోయి
అక్షరాలతో దోస్తీ చేసాను
నా ఆలోచనలను
నేను చూసుకోడానికి
కాగితంపైన ఒలికిస్తే అవి కవితలయ్యి
నాకు తెలియకుండానే " కవి " నయ్యాను...
తల్చుకున్న ప్రతీసారి నవ్వొస్తుంది నన్ను చూస్తే నాకు.

అర్థమయ్యీ కాని "పరిసరాలను"గమనిస్తూ
మాటలను మరిచి అక్షరాలను పేరుస్తూ
నిస్తేజపుకళ్ళ్తలో ప్రశ్నలను కూరి
నిద్రమాని ఎర్రబడ్డ కళ్ళతో సమాజంలోకెలితే
"ఇంట్రావర్ట్" వాడు ఆలోచనా పరుడు
అంటూ పొగిడేస్తుంటే నవ్వు కాదు
వాల్ల పిచ్చితనం చూస్తే చిర్రెత్తుతుంది.

వాస్తవానికి నలుగురిలో ఉంటూ "నవ్వుతూ"మాట్లాడటమంటే అసహ్యం నాకు.అలాగని నేను మానసిక రోగిని కాదు బట్ ఇక్కడ అది కాదు సమస్య,,
ఆ నవ్వు వెనకున్న ఒరిజినల్ మొహాలే నాకు కనబడతాయి..నాలో కూడా.
అందుకే ఈ మౌనం.

నా భార్య మొన్నొకసారి నన్నడిగింది.."మీరెందుకు అంత గంభీరంగా ఉంటారు " అని,
అది బయమని చెప్పలేక నా మొహం పైనున్న ముసుగు తీయలేక మూలిగే గుండెపై అక్షరాలను జల్లుతూ పూర్తయిన  నా ప్రతీ కవితలతో నన్ను నేను దహనం రోజూ చేసుకుంటున్నా అని
పాపం ఆమేకేం తెలుసు అమెకసలు పరిచయం లేని మరో నేను నా పైన చల్లుకున్న మౌనపు రంగు చిరగకుండా "గంభీరంగా" కనబడతా అని!

ఇన్ని సంవత్సరాల నాతో నేను చేసిన సహజీవనంలో మరో నేను నన్ను ఎంతలా మోసం చేస్తూ వచ్చానో కదా, రోజూ యుద్ధమే.. గెలుపు నాదా? నాలోని నాదా ?
ఇంకా తెలియదు చెప్పడానికైనా రాయడానికైన.
కాని రోజూ చెబుతున్న నా ఆదర్శాల అర్థాలు రాత్రయ్యేసరికి మత్తులో "ఆ" ఆలోచనల్లో ముక్కలయ్యి 
రకరకాలుగా అనేకమైన రంగుల్లో నాకు నేనే నాలో నేను కనబడుతూ
నాలోని బయాన్ని ఆదర్శాలపైన ఒత్తుగా కప్పి  మైకాల మజాను ఆస్వాదించే నేను
కవినా?
ఆదర్శవాదినా?
ఇంట్రావర్ట్ నా?

చి చీ అంతా మోసం ఇక్కడ "తెలివి"గా కప్పబడుతూ ఉంటూంది వెలుగులో ఎవరికి కనబడకుండా.
ఆనందమో సంతోషమో తెలియని ఒక అనుభూతికై నేనురోజూ వల్లె వేస్తున్న "నైతిక విలువలు" ఏమవుతున్నాయి?

ఇప్పటికీ ఎవరికి తెలియదు నాలోని మరో నేను.

ఇంతటి ఇంటలెక్చువాలిటీ ఎందుకొరకు, ఇలా అందరూ ఉంటారా?

(ఉంటే నన్ను నేను సమర్ధించుకోడానికి ఒక కారణం . హ హ ఎంతటీ వెసులుబాటు ఈ సమాజంలో మనుషులకు ...)

అమావాస్య చీకటిలో వెలుగుకై వెతుకుతాను
రాలే పూవును చూస్తే కన్నీళ్ళాగవు
ఎవరికైన బాధలుంటే తీర్చాలనిపిస్తుంది
సామ్యవాదాలు-ఉద్యమాల మాటలతో కాలక్షేపం? చేస్తాను
కళ్ళు దించుకుని ఎదుటి వారిని చూస్తాను
రోజూ తప్పులను చేస్తూ
సిగ్గులేకుండా
ప్రాయశ్చిత్తాల కొరకు నలుగురికి నీతులు చెబుతూ
క్షుద్రానాందాన్ని పొందుతాను.
అయ్యో .... చెప్తూ పోతే అంతే లేదు వీటీకి

కాని...కాని... కాని... కాని... కాని... కాని... కాని... కాని... కాని...

మొన్నరాత్రి

మూసుకున్న కన్నుల వెనక చీకట్లో నాకు నిజం తెలిసింది,
సిగ్గు స్వరూపం తెలిసింది.


దేవుడికి పూజ మానేసాను నాకు అర్హత లేదని అర్థమయ్యి.

నాలోని నాకు దూరం పెరిగి అహం కరిగి
అగాధంలో
చిక్కు ప్రశ్నల సంకేళ్ళేసుకుని
చీకట్లో బంధీనయ్యి చివరికి
ఋష్యత్వంలోని దైవత్వం
ఆవహిస్తూ, దహిస్తూ
ఒక్కసారిగా కళ్ళు పేలేలా
దిక్కులు పగిలేలా
శాంతి కెరటాలు
"నా"లోని "నన్ను" తాకి
ఒకరికొకరం దూరమయ్యి
"శాశ్వత దహనమయ్యాను"
సంతోశంగా ఏడుస్తూ...


ఈ రోజు ఉదయం
అద్దంలో చూసినపుడు
నా మొహంలోని
చిరునవ్వు చాలా "అందంగా" కనబడింది!

ఒక పూవు ఉత్తరం ...పరమార్థం తెలియదు కాని
పరులకుపయోగమీ జీవితమని తెలిసింది.


కొందరేమో దేవుడిని కొలవడానికి
ఇంకొందరేమో కైపెక్కడానికి
అలంకరణకు నేనే చీత్కారాలకు మేమే,

పుట్టీ పుట్టగానే నా తల్లి మొక్క నుండి నన్ను
నిర్దాక్షిణ్యంగా లాగేస్తే రెక్కలుతెగి ఏడుస్తున్నా

కుప్పలుగా నా కుటుంబాన్ని తెంపి తెంపి
మా మృదువైన శవాలతో
ఒక రోజు పుణ్యానికై దేవుడికి
ఒకసారి సుఖానికై దేహానికి అలంకరిస్తారు
వాడిపోయి ఏడుస్తుంటే ఏరి పారేస్తారు
మురికి కాలువల్లో పాడేస్తారు.

ఒక్కసారి బాధపడండి మా బ్రతుకులను చూసి.


కన్నీళ్ళతో

మీ పూవు...

సిద్ధార్థ్ ఋషి - with his fans - 2010 November

బయట బోరున వర్షం పడుతున్నా

బయట బోరున వర్షం పడుతున్నా
గొంతులో తీరని దాహం,

బయటెంత వెలుతురున్నా
గుండెలో చిక్కని చీకటి,

చుట్టూ నవ్వుల పువ్వులున్నా
ఏరుకోలేణి అవిటీతనం,

ఇదేనా జీవితం అనుకుంటే
కాదంటూ నువ్వొచ్చావు

ఒక్కసారిగా ప్రపంచమే మారింది కదా

నిన్నటి వరకున్న కోపం
సమాజమంటే అసహ్యం
ఇప్పుడు నాలో లేవు

ఉన్నదల్లా నీ నవ్వులు వాటి మాటున
నాకు చేరుతున్న సంతోశం

అంతా హాప్పీ హాప్పీ

వెలుగు

సంతోశాన్ని చూద్దామని
వెలుగు కొరకు వెతుకుతుంటే
నాకు నువ్వు దొరికావు., ఆ తర్వత నేను కూడా.
ఇప్పుడు వెలుగు నా వెనకాలే,.. నాతో పాటు చివరివరకు!

బయమంటే బయపడ్తారెందుకో జనం
బయంలో బాధ ఉంటుందని
అదే నిజమని తెలియదా!!