నేను అద్దెకు తీసుకున్న మాస్కులు.

నన్నొక ఇంట్రావర్ట్ అంటుంటారు.
నాకు ఈగో అని కూడా అంటుంటారు ఇంకొందరు,

కాని అవి నా స్వంతమైనవి కావు.

ఇవన్ని నేను అద్దెకు తీసుకున్న మాస్కులు
అవసరానికనుగూణంగా.

పనవ్వగానే వాటినుండి
బయటికొస్తాను కచ్చితంగా
నాదైన నా జీవనం లోనికి.

ఇప్పటివరకు ఎవ్వరికీ తెలియని రహస్యం ఇది. 

ప్రశ్నల పయనం......



ఈ ప్రపంచం, మనుషులు జీవితాలు అన్నీ కూడా ఆ దేవుని ఆట.
అశాశ్వతమైన జీవితం మనది. 

మన శాశ్వత మజిలి ఐతే నరకం లేదా స్వర్గం....మనం దేని అర్హులమో తెలుసుకోడానికే 
ఈ ప్రపంచాన్ని సౄష్టించి మనల్ని మనుషుల్ని చేసాడు ఆ దేవుడు.
ఈ బంధాలు, మానసిక భావాలు అన్నీ కూడా ఆయన మాయనే...
ఇవి అర్థమైన నాడూ మనసులో అలజడి తగ్గుతుంది.
అంత వరకు ఎంత వద్దనుకున్నా ........ " అశాంతే"...!!!

ప్రశ్నల సుడిగుండాల్లోంచి ఎగిసిపడే కణాల్లోనూ
మళ్ళీ ప్రశ్నలే పుట్టుకొస్తూ నా అన్వేషణ
అంతే లేకుండా సాగిపోతూనే ఉంది.
సమాధానం వెతెక్కునే ప్రయత్నం లో ఆలోచనలు పెరిగిపోతూ
గాలి బుడగల్లా పేలిపోతునే ఉన్నాయి...


అప్పుడర్థమయింది నాకు
ప్రశ్న విశ్వం లాంటిదని..ఈశ్వరుడికే తప్ప ఎవరికీ తెలియని సమాధానమనీనూ.
అప్పుడు ఈశ్వరం నన్నావహించి ఎంతో ప్రశాంతత.