నా గురించి...

ఉద్యోగరిత్యా ఉండేది పరాయి దేశంలో ఐనా,మనసు మాత్రం ఎప్పుడూ ఇండియాలోనే..
సాహిత్యమంటే నిజమైన అభిమానమో లేక చిన్నప్పట్నుండి అందరు నన్ను మంచొడు వీడు అనడం మూలంగానో ఏమో కాని అప్పట్నుండే కవితలూ గట్రా రాసుకుంటున్నను!!!నాకున్నా ఒక అలవాటు ఏంటంటే ఏమైనా రాసుకునేటప్పుడు నేను ఆ క్యారెక్టర్ గా ఊహించేసుకుంటు రాస్తాను. ఒక్కొసారి చాలా బయమేస్తుందీ. నేను ఊహిస్తున్న ఆ భావనల దొంతరల్లో ఇన్ని ఆటుపోట్లు ఉంటాయని తెలిసినపుడు.
నేను ఈ బ్లాగు రాయడానికి ఒకే ఒక కారణం బహుష 1999లో అనుకుంటా దాదాపూ 8నెలలు నేను పడిన నరక యాతన అంతా ఇంతా కాదు ! సమాజం నాకు అర్థమయ్యేది కాదు. అప్పుడూ ఇప్పుడూ !!!
సమాజం అనుసరిస్తున్న కొన్ని విషయాలు,నమ్మకాలు నాకు చిత్రంగా అనిపిస్తున్నాయి! తార్కికంగా ఆలోచిస్తే అని ఎంత చండాలమో అవగతమవుతున్నాయి!! .
కాని ఏమి చెయ్యలేని నిస్సహాయ స్థితి.ఆలోచనలు ఎవరితో పంచుకోవాలో తెలీని సందిగ్దం.
ఇలాగే రొజులు గడిచిపోవడం నేను ఏమి చెయలేక కొన్ని  సంవత్సరాల క్రితం దుబాయ్ రావడం వస్తూనే డబ్భు సంపాదనలో తలమునకలవ్వడం నాకు తెలియకుండానే జరిగిపోయాయి! కాని మనసుకు శాంతి లేదు. ఏదొ చెయ్యాలని ఒక పిచ్చి కోరిక(ఆదేంటో తెలియదు మళ్ళీ!!)

ఈ బ్లాగు ద్వార కొంతమందైన నా ఆలోచనలకు సప్పోర్టు చేస్తారేమో అన్న చిన్నా ఆశతో,

ఎపుడో అకస్మత్తుగా ఒక ఉద్వేగం నాలో ఎగసి ఎగసి,
నన్ను నిర్వీర్యుడిని చేసినపుడు కలిగిన,
భావ పరంపరలో కొట్టుకుంటూ రాసుకున్న కొన్ని నా
కవితలను అందరితో పంచుకోవాలనుకుంటున్నాను!!


శ్రీనురాగి…