ఆ రాత్రి ..సమయం ఉదయం ఏడు గంటలు
రోజూలాగానే నడుస్తున్నను ఆ రోడ్డుపై
గమ్యం తెలియకుండ!

అనుమానమొచ్చి
వెనక్కి తిరిగి చూసా
ఎవరూ లేరు..

హటాత్తుగా నువ్వు గుర్తుకొచ్చి
బాదపడ్తూ నవ్వుకోంటున్నాను
మొక్షమార్గం గురించి ఆలోచిస్తూ,
దారికై వెతుకుతున్నాను
అటూ ఇటూ…

అనుమానమొచ్చి
వెనక్కి తిరిగి చూసా
ఎవరూ లేరు..

చిన్నపుడు
నాతో పాటు ఆడుకున్న
మిత్రులు గుర్తుకొచ్చారూ
ఎక్కడున్నారో వారంతా ??

అనుమానమొచ్చి
వెనక్కి తిరిగి చూసా
ఎవరూ లేరు..

చీకట్లో వెలుగొచ్చినట్లు
ఆలోచనల్లోంచి తెరలు తెరలుగా
ఒక పూవు రెక్కలువిప్పి విచ్చుకొంటునట్లుగా
నాలోంచి నేను వీడిపోతూ …

నడుస్తున్నాను నడుస్తున్నాను నడుస్తున్నాను నడుస్తున్నాను
నడుస్తున్నాను నడుస్తున్నాను నడుస్తున్నాను నడుస్తున్నాను
నడుస్తున్నాను నడుస్తున్నాను నడుస్తున్నాను

నడుస్తునే ఉన్నాను.. కళ్ళు మూసుకుని.
నడక పరుగై

హటాత్తుగా నా పాదాలు గాలిలో
ఎక్కడికో జారిపోతున్నాను

లాలి పాటలు అమ్మ గుర్తుకొస్తు
నా కళ్ళలోంచి నీళ్ళూ.

ఉలిక్కిపడి లేచి చూస్తే
కుక్కి మంచంలో నేను
పక్కనే ఆరిపోతూ బిక్కు బిక్కుమంటున్న కొవ్వొత్తి.

ఆ రాత్రి మళ్ళీ నిద్దర్రాలేదు…

0 comments: