కలలొచ్చాయని

కలలొచ్చాయని
కళ్ళు నులుపుతూ
రాని నిద్రను కొనుక్కుని
మత్తుగా పడుకుంటే

అక్కరకు రాని ఆలోచనలతో ఉన్నానేమో
నువ్వసలు గుర్తే రాలేదు.

ఎందుకో అనుకున్నాను.

మెలకువయ్యాకా ఆలోచించాను
ఇది జరిగి పదేళ్ళయింది.

ఇంకా ఇప్పటికి
అర్థమవ్వట్లేదు, నువ్వసలు గుర్తు రావు, ....

0 comments: