Thursday, April 3, 2014

కలలొచ్చాయని

కలలొచ్చాయని
కళ్ళు నులుపుతూ
రాని నిద్రను కొనుక్కుని
మత్తుగా పడుకుంటే

అక్కరకు రాని ఆలోచనలతో ఉన్నానేమో
నువ్వసలు గుర్తే రాలేదు.

ఎందుకో అనుకున్నాను.

మెలకువయ్యాకా ఆలోచించాను
ఇది జరిగి పదేళ్ళయింది.

ఇంకా ఇప్పటికి
అర్థమవ్వట్లేదు, నువ్వసలు గుర్తు రావు, ....

Wednesday, April 2, 2014

గగుర్పాటు


గాజుబంధాల  సుడిగుండాల్లో
ఎపుడైనా చిక్కుకున్నావా?

నాకు మనుషులంతా ట్రాన్స్ పరెంట్ గా
కనబడుతూ , వారిలోని ఇన్ సైడర్స్
కనబడుతారు .

అందుకే ఎవరికీ లేని
గగుర్పాటు నా జీవితంలో..

ఐనా బ్రతుకుతున్నాను.
నా చుట్టూ ఉన్న కిటికీలన్నీ మూసుకుని ..