Tuesday, September 27, 2011

నీ కోసం నేను శ్వాసిస్తున్నాను

నీ కోసం నేను శ్వాసిస్తున్నాను, అంటే నీకు
అతిశయమైనా...కొడిగడుతున్న
మన సంబందానికి అవసరమవుతున్నా..,
భాధాకరమైన విశయమేమిటో నీకు తెల్సా?

మనిద్దరి మద్య ఉన్న ఇష్టం
అవసరంగా మారిపోయినపుడు
చాలా సంతోశించాను.,

కాని ఇపుడది
స్వారూపాన్ని మార్చుకుంటూ
కేవలం అవసరాలకొరకు మాత్రమే
అనువైనదైనందుకు గుండె
నిజాల మంటల్లో
కాలిపోతుంది ప్రతీ క్షణం.

ఐనా ఆశ చావట్లేదు నాలో
సంతోశపు ఎండమావికై ఎదిరిచూస్తూ
నా జీవితం..

Wednesday, September 14, 2011

ఏం చేయాలో అర్థం కావడం లేదు.


నా నువ్వు..
చల్లని గాలి వీస్తున్నా
చిరు చెమటలతో ఆలోచిస్తున్నాను నిన్నటి సాయంత్రం నుండి.
ఆ వాదనలు నా ఆలోచనలను ఒక్కసారిగా
మార్చేసాయి.

ఉద్వేగపు స్థాయి ఉదృతమై
కళ్ళలో నీళ్ళు....
చిరునవ్వుతో బాధగా ఈ ప్రపంచాన్ని
రెండుగా చీల్చిన ఆ ధైర్యాన్ని
నేను తట్టుకోలేకున్నాను.

మనుషుల్లో ఉండాల్సిన
మనిషి తత్వాన్ని, మనసు తత్వాన్ని
ఒక్క స్పర్షతో నాకు తెలియజెప్పిన
ఆ నవ్వు నా కళ్ళముందు
పరదాలా ఆలానే ఉంది.

జీవితం గురించి బేలగా అడిగిన ఒక్కో ప్రశ్న
నా వొంట్లోని రక్తాన్ని ఒక్కో చుక్కలా మింగేస్తుంటే
పాలిపోవడం మినహా ఏం చేయలేకపోయాను.
సిగ్గుతో నిన్న నిజంగానే నిస్తేజమయ్యాను
నా ఇన్నాళ్ళ జీవన విధానం గుర్తొస్తూ
చెప్పేదొకటి-చేసేదొకటి...
చర్యలను సమర్ధించుకోడంలో నేను
ఇంతవరకు గొప్పగానే ఉన్నా
ఇప్పుడు అసహ్యాంగా ఉంది.

ఏమ్ చేయాలో తెలియక
ఆ పక్కనే కాలిపోతుంది
నాలోని పాడు ఆలోచనలు
చితిలో పేర్చుకుంటూ.

ఆ వేడిని తట్టుకోలేకున్నాను
ప్రాక్టికాలిటీ పేరుతో
సున్నితమైన ఆ మనసునుతో
నాకు తెలియకుండానే ఆడుకున్నానేమో
అర్థమవుతూ - ఆ అమయకమైన నవ్వు
నాళ్ళముందే కాలిపోతుంది.

నా ఆ నవ్వు ఇక లేదు.
ఏం చేయాలో అర్థం కావడం లేదు.

Thursday, June 9, 2011

మూగోడినయ్యాను

ఆ రోజు నువ్వన్నావ్ నేనే నీకు సర్వం కదా అని
అమాయకంగా ఔనన్నాను.
నీ కళ్ళల్లో సంతోశం నాకర్థం కాలేదు.

నిన్నటికి ఇప్పటికి మద్య ఆరేళ్ళు గడిచాయ్ మార్పులతో,
నీ కళ్ళల్లో కూడా..

పిల్లి ఎంత కాలం కళ్ళు మూసుకోగలదు చెప్పు?
నాలోని అక్షరాలు ఉత్తుంగ తరంగాలా కెరటాల సవ్వడిలా మెల్లిగా ఆగుతు
నీ జ్నాపకాలతో ఆవిరయ్యాయి,

నువ్వు కూడా.

నువ్వు లేవు నాకేం లేదు!! అందుకే మూగోడినయ్యాను.

ఐనా సంతోశమే నాకు..

Saturday, May 21, 2011

నా మంచు ఎడారి.



చల్లనిదనుకున్నా
కాని

ఆకాశంలోంచి నల్లని కిరణాలు
ఏటవాలుగా వస్తూ,
ఎక్కడి నుండో తెల్లని పొగ
చుట్టూ కమ్ముకొంటూ,
పగుల్లొస్తున్నాయని
కప్పుకుంటూ వెలుతుంటే
నా వెనకాలే కాలిన చప్పుడు విని
తిరిగి చూస్తే
ఒకటి కాదు రెండు కాదు
వందల వేల కలేబరాలు కాలుతూ
నా మంచు ఎడారిని
కరిగించేస్తున్నాయి.
మద్యలో నేను.

Saturday, April 16, 2011

శూన్యంలో రససిద్ధి...




అప్పుడే అడుగులేస్తు
అంతులేని నాట్యంతో
ఆహార్యాన్ని
హరిపాదాలకర్పిస్తూ
అడుగుల్లో భావాలను
అబినయించే
ఆ మయూరం
ఆకలి ధాటుకు
హావభావాలను
అనుకరించలేక
కల కనికరించక
అడుగుల్లో
వణుకు
శూన్యాన్ని
అనుకరిస్తున్నాయి.

అది నాట్యమా లేక నాటకమా?

 రససిద్ధి సాధ్యమా??

Friday, April 8, 2011

మూర్ఖత్వం...




ఇది సాధరణంగా మన సమాజంలో "తెలివి"గా చలామణి అవుతుంది.కొండొకచో డామినేటింగ్ గా ఉంటూ జనాలను నమ్మించడానికి "తెలివైన" మేధావుల వాదనలవుతాయి.

ఒక సక్సెస్ సాధించిన వ్యక్తి చెప్పే వాటిని మనం చాలా ఉత్సుకతతో వింటూ-చూస్తూ ఉంటాం
సిగ్గుపడాల్సిన విశయమేమిటంటే బలహీనమైన మనస్సు ఉన్న వాళ్ళు పనీ పాట లేకుండా ఉండే పరాన్నజీవులు వాటిని
తమ జీవితానికి ఆపాదించుకునే ప్రయత్నం చేస్తుంటారు ఇలాంటివి చేసినంత మాత్రాన మనం ఓటమి నుండి తప్పించుకోగలమా ?
సంపూర్ణ్తత్వానికి ఓటమి అవసరమైనపుడు తాన్నుండి దూరమవడం మూర్ఖత్వం కాదా..?
నిజం తెలిసే లోపు సమయం గడిచిపోయి దిక్కుతోచకుండా ఏమి సాధించకుండానే ఉంటారు బ్రతికినన్నాళ్ళు.

Monday, March 14, 2011

Freeze....Finally.

మనలో ఉండే అనుభూతులు
కాలానుగూనంగా మారుతూ
చివరికి నిస్తేజమవుతాయి
అపుడు వాటి అవసరం
లేశమాత్రంగానైనా ఉండక
వాటి పట్ల మన పూర్వ ప్రవర్తన

అసహ్యంగా కనబడుతుంది.
అందులోంచే
మన ప్రయాణం మొదలయింది
అలాగే సాగుతుంది
అలాగే ముగుస్తుంది

అలాగే ముగిసిపోవాలి 


మరి ఇది 

జీవితం కదా...