Saturday, May 21, 2011

నా మంచు ఎడారి.



చల్లనిదనుకున్నా
కాని

ఆకాశంలోంచి నల్లని కిరణాలు
ఏటవాలుగా వస్తూ,
ఎక్కడి నుండో తెల్లని పొగ
చుట్టూ కమ్ముకొంటూ,
పగుల్లొస్తున్నాయని
కప్పుకుంటూ వెలుతుంటే
నా వెనకాలే కాలిన చప్పుడు విని
తిరిగి చూస్తే
ఒకటి కాదు రెండు కాదు
వందల వేల కలేబరాలు కాలుతూ
నా మంచు ఎడారిని
కరిగించేస్తున్నాయి.
మద్యలో నేను.

Saturday, April 16, 2011

శూన్యంలో రససిద్ధి...




అప్పుడే అడుగులేస్తు
అంతులేని నాట్యంతో
ఆహార్యాన్ని
హరిపాదాలకర్పిస్తూ
అడుగుల్లో భావాలను
అబినయించే
ఆ మయూరం
ఆకలి ధాటుకు
హావభావాలను
అనుకరించలేక
కల కనికరించక
అడుగుల్లో
వణుకు
శూన్యాన్ని
అనుకరిస్తున్నాయి.

అది నాట్యమా లేక నాటకమా?

 రససిద్ధి సాధ్యమా??

Friday, April 8, 2011

మూర్ఖత్వం...




ఇది సాధరణంగా మన సమాజంలో "తెలివి"గా చలామణి అవుతుంది.కొండొకచో డామినేటింగ్ గా ఉంటూ జనాలను నమ్మించడానికి "తెలివైన" మేధావుల వాదనలవుతాయి.

ఒక సక్సెస్ సాధించిన వ్యక్తి చెప్పే వాటిని మనం చాలా ఉత్సుకతతో వింటూ-చూస్తూ ఉంటాం
సిగ్గుపడాల్సిన విశయమేమిటంటే బలహీనమైన మనస్సు ఉన్న వాళ్ళు పనీ పాట లేకుండా ఉండే పరాన్నజీవులు వాటిని
తమ జీవితానికి ఆపాదించుకునే ప్రయత్నం చేస్తుంటారు ఇలాంటివి చేసినంత మాత్రాన మనం ఓటమి నుండి తప్పించుకోగలమా ?
సంపూర్ణ్తత్వానికి ఓటమి అవసరమైనపుడు తాన్నుండి దూరమవడం మూర్ఖత్వం కాదా..?
నిజం తెలిసే లోపు సమయం గడిచిపోయి దిక్కుతోచకుండా ఏమి సాధించకుండానే ఉంటారు బ్రతికినన్నాళ్ళు.

Monday, March 14, 2011

Freeze....Finally.

మనలో ఉండే అనుభూతులు
కాలానుగూనంగా మారుతూ
చివరికి నిస్తేజమవుతాయి
అపుడు వాటి అవసరం
లేశమాత్రంగానైనా ఉండక
వాటి పట్ల మన పూర్వ ప్రవర్తన

అసహ్యంగా కనబడుతుంది.
అందులోంచే
మన ప్రయాణం మొదలయింది
అలాగే సాగుతుంది
అలాగే ముగుస్తుంది

అలాగే ముగిసిపోవాలి 


మరి ఇది 

జీవితం కదా...


Tuesday, February 8, 2011

అందరం ఇక్కడ మంచివాళ్ళమే కదా !

కారణాలేవైతేనేమి
అందరం ఇక్కడ మంచివాళ్ళమే కదా !

అసలు మనుషులను శాసించేది ఇక్కడ ఏమిటనే ప్రశ్నకు
సరైన సమాధానం ఉండదు
ఒకరిని డబ్బు
ఒకరిని ప్రేమ
ఒకరిని కోరికా
ఇంకొకరిని సరదా
ఇలా ఒకటికొకటి పోంతనలేకుండా
అవసరాలుగా మారి
ప్రతీ ఒక్కరిని ఐడెంటికల్ గా చేస్తూ
మార్పు ఖచ్చితమనే సత్యాన్ని మనకు
అర్థమయ్యేలా చేస్తూ ఉంటుందీ కాలం.

Saturday, January 8, 2011

ఇరుకవుతున్నదీ విశాల ప్రపంచం.

నిశ్శబ్ద ప్రపంచం నుండి జీవి
మనిషిగా రూపాంతరం చెందినాక
రోజు రోజుకు ఆలోచనలు "తెలివి"గా
రూపాంతరం చెందుతూ,"మోసాలు"గా మారుతూ
ముళ్ళ చాటున వింతగా
ఆనందాలు - సంతోశాలు అస్తిత్వాన్ని కోల్పోయి
దేహం,భావాలు- ప్రకృతిలోని ప్రతీది
సహజత్వాన్ని కోల్పోతూ
చప్పుడుకాకుండా కల్తీ వేడి గాలులు
మనుషుల్లోకి,మనస్సుల్లోకి దూరుతూ
మరమ్మత్తులు చేయలేని యంత్రాలుగా తయారవుతూ
ఈ విశాల ప్రపంచం ఇరుకయ్యింది.

అందుకేనేమో ఊపిరిలో గాలి కూడా తక్కువవుతూ ఉంది!

Saturday, January 1, 2011

రా దొరా !

తివాచి పరిచే ఉంది నీకై  దొరా!
స్మశానాన నీకేమ్ పని
అక్కడేం ఉంది బూడిద తప్ప
ఇక్కడకొచ్చేయ్ నీకు గుడి కట్టించాను నా ఇంట్లో, ఒంట్లో.

కంఠాన గరళాన్ని తట్టుకోలేకున్నావని
చల్లని గంగను తెచ్చా !

రా ఆ గిరులు దిగి నా దగ్గరకు
తాండవమాడ
హరి ఓం_నమ:శ్శివాయా,
అలిసిపోయావ్ నువ్ యుగాలుగా,
కాస్త సేద తీర ఇక్కడికి రా  దొరా !