నిస్సహాయం


మనిషి కణాలు క్షీణిస్తున్నాయి


నీరెండలో...


చినుకు పడి


నువ్ రావని తెలిసినా..


ఆలోచనల వీధిలో ,


నా తనువులో - Breathing Memories...


గుండె గదిలో నెత్తుటి మరకలు.


మా చిన్నారి అవంతిక ...


తెలంగాణా ఆవిర్భావ శుభాకాంక్షలు...నువ్వు, నీ నవ్వు ఒక అబద్ధంనువ్ నన్ను నైతికంగా పాడు చేసినపుడే
దూరమవ్వాల్సింది
కాని
ఒప్పుంటున్నాను నీ గొప్పతనాన్ని
నన్ను నన్నుగా మిగలకుండా
నీ ఆలోచనలతో
నన్ను నింపినందుకు.

అన్నీ నష్టాలే ......

వెనుతిరిగి చూడలంటే బాధగా ఉంది నాకు.
ఎందుకంటే
నువ్వూ, నీ నవ్వూ
అన్ని అబద్ధమే!

కలలొచ్చాయని

కలలొచ్చాయని
కళ్ళు నులుపుతూ
రాని నిద్రను కొనుక్కుని
మత్తుగా పడుకుంటే

అక్కరకు రాని ఆలోచనలతో ఉన్నానేమో
నువ్వసలు గుర్తే రాలేదు.

ఎందుకో అనుకున్నాను.

మెలకువయ్యాకా ఆలోచించాను
ఇది జరిగి పదేళ్ళయింది.

ఇంకా ఇప్పటికి
అర్థమవ్వట్లేదు, నువ్వసలు గుర్తు రావు, ....

గగుర్పాటు


గాజుబంధాల  సుడిగుండాల్లో
ఎపుడైనా చిక్కుకున్నావా?

నాకు మనుషులంతా ట్రాన్స్ పరెంట్ గా
కనబడుతూ , వారిలోని ఇన్ సైడర్స్
కనబడుతారు .

అందుకే ఎవరికీ లేని
గగుర్పాటు నా జీవితంలో..

ఐనా బ్రతుకుతున్నాను.
నా చుట్టూ ఉన్న కిటికీలన్నీ మూసుకుని .. 

ఆలోచనల మూలాలు

ఆలోచనల మూలాలు
శొధించడంలో కొరత ఏర్పడితే
జరిగే పరిణామాలు
సమాజాన్ని కుదిపేస్తాయి
మంచో చెడో తెలియకుండనే.. 

నిన్నటి నువ్వు, నీ నవ్వూ గతమైంది.

నువ్ నాలో తరిగిపోతున్నవ్ కదూ...
అశ్చర్యంగా ఉంది నాకు.

నీ బాసలు నీటి అలల్లా చప్పునా కరిగిపోతున్నాయ్
దూరం నిజంగా పెరిగిపోయింది
అంతా శూన్యమనే నా సిద్ధాంతం మరోసారి
నిజమయినందుందుకు సంబరపడలా,బాధపడాలో తెలియట్లేదు.

నిన్నటి నువ్వు, నీ నవ్వూ
గతమైంది.
తెలియకుండానే !! 

అదే నువ్వూ అదే నేను

నీ జ్ణాపకాలతొ కాలిన గొంతు
పాత రాగాలను పలకలేకుండా ఉన్నది,

ఐనా......
అదే నువ్వూ అదే నేను
నాలోని అదే ఆర్తి అదే మోహం
పూర్తిగా తెలియాని నీ లోని నీ పైన.

సమయాన్ని

సమయాన్ని నీ జ్ఞాపకాల సముద్రం లోనికి విసిరేసాను,
అలలు పైకి ఎగురుతూనే ఉన్నాయి.
ఒడ్డున నేను !!!!!