గాజుబంధాల సుడిగుండాల్లో
ఎపుడైనా చిక్కుకున్నావా?
నాకు మనుషులంతా ట్రాన్స్ పరెంట్ గా
కనబడుతూ , వారిలోని ఇన్ సైడర్స్
కనబడుతారు .
అందుకే ఎవరికీ లేని
గగుర్పాటు నా జీవితంలో..
ఐనా బ్రతుకుతున్నాను.
నా చుట్టూ ఉన్న కిటికీలన్నీ మూసుకుని ..
ఆలోచనలు-వాదనలు. నమ్మకానికి-నిజానికి మద్య మంచుతెరలు.
Posted by వైతరిణి Wednesday, April 2, 2014 at 11:19 PM
Labels: నిస్సహాయత్వం ... ??
0 comments:
Post a Comment