ఇంకా అర్థం కావడం లేదు నాకు.

ఇంకా అర్థం కావడం లేదు నాకు.
ఈ జీవితం చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. మనిషిలో ఉండే అన్ని భావాలు నాలోనూ ఉన్నాయి,
కాని అవి అర్థమయ్యే లోపే అర్థం కాకుండా ఉన్నాయి.ఆలోచిస్తుంటే సమయం గడిచిపోతుంది.
సంతోషానికి నేను ఒక నిర్వచనం ఇవ్వాలని అనుకుంటున్నాను ఎప్పటినుండో కాని కొన్ని క్షణాల్లోనే దాని స్వరూపం మారి అంతవరకు చూసిన దానికి పోలికే లేకుండా ప్రతీసారి వెక్కిరిస్తు అపహస్యం చేస్తు నన్ను ఇంకా ఇంకా ఇంట్రావర్ట్ ను చేస్తున్నాయి.
ఆ మౌనం నన్ను నన్ను ఉండనీయక అందరి గురించి ఆలోచించమని ఫొర్స్ చేస్తే మెదడులో పేరు తెలియని తీవ్ర సంఘర్షణ. "దేనికోసమో తెలియని వెతుకులాట."

ఐతే ఇందులో కూడా మళ్ళీ తెలియని విషయాలు కలగా పులగంగా కంగారు పెడుతున్నయి.

మొన్నొక రోజు నేను ఆలోచిస్తుంటే చిన్నప్పుడు నేను తరచుగా అనుకునే,నాన్న గారు చెప్పిన ఒక మాట నాకు గుర్తుకొచ్చింది
మనం బాగుంటే అంతా బాగుంటుంది... చాలా కాలం వరకు నిజానికి నిన్నటి వరకు కూడా అర్థమయ్యేది కాదు ఆ "అంతా" అనే పదానికర్థం..
దానికి నిర్వచనం లేదు కేవలం అనుభవించలంతే! నిజాయితి ఒక స్థాయికొచ్చేసరికి మనసు పూర్తి స్థాయిలో సీరియస్ గా తీసుకుంటుంది.
అప్పుడే సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఐడియాలజీ,సిచ్యువేషన్స్ పొసగక ఇదిగో ఇలా కొట్టుమిట్టాడుతుండాలి.ఇదెంత కాలమో నాకు తెలియదు కాని నిజాయితినే గెలుస్తుందనేది నేను నమ్ముతున్నాను ఇంకా కూడా.

అప్పటి వరకు ఓటమి దరిచేయనివ్వకుండా - ధైర్యాన్నివ్వమని ఆ దేవుడిని కోరుకుంటూన్నాను.

మనసు చూరులోని మౌనన్ని చీకటి భరించలేకపోతున్నట్లుంది, ముసురుగప్పిన ఈగలు రొద పెడ్తున్నాయి!

0 comments: