మన ప్రపంచాన్ని కాపాడుకుందాం..


ఆక్రోశాలు - ఆక్రందనలేనా
నిస్సహాయత - నిట్టూర్పులేనా?

మారణహోమాల సుడిగుండాల్లో
మంచు బిందువుల సున్నితత్వం
ఆవిరైపోవాల్సిందేనా?

మనుశులమనుకుంటూ
మనసు గతులను తెలుసుకుంటూ
కళ్ళు చూపే ప్రపంచంలో
హడావిడిగా పరుగెడుతున్న మనం,

ఒక్కసారి మానవత్వాన్ని స్మరిద్దాం మనస్పూర్తిగా.
గడిచిన కాలన్నీ ఎలాగూ పొందలేము

మిత్రులారా !!
కనీస ధర్మంగా మన
ముందున్న సమాజాన్ని
కొత్తలోకంగా మారుద్దాం...


మానవ విలువలను కాపు కాస్తూ
మన ప్రపంచాన్ని కాపాడుకుందాం..

 

సాలె గూడు...

నిశ్శబ్దంగా... నన్ను నేను చీల్చుకుంటూ
స్నేహం పోగులను స్రవిస్తూ
నా చుట్టు నేను అల్లుకుంటున్నాను నమ్మకంగా.!!??

చూస్తూనే దట్టంగా పేరుకుపోయి
దారి కూడా కనబడకుండా,
శ్వాసించడానిక్కూడా అవకాశం లేకుండా అయ్యి
ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను..

అదృష్టమో - దురదృష్టమో గాని
నమ్మకం పోగులు కాలి
ఒక్కసారిగా వెలుగొచ్చి నా కళ్ళు పోయాయి...

మళ్ళీ అల్లుకుంటున్నాను
నా మనుగడ కోసం
కొత్తగా నమ్మకం పోగులను చీలుస్తూ....