ఈ ప్రశ్న నన్నింకా వొదలడం లేదెందుకో!!

సంవత్సరాలుగా నా మెదడును తొలుస్తున్న
ఈ ప్రశ్న నన్నింకా వొదలడం లేదెందుకో!!
అన్నీ నావనుకుంటూ
నేనే అన్నీ అనుకుంటూ
అమ్ములపొదిలో దాచుకున్న
ఇడియాలతో-ఆడుకుంటూ
అక్కరకురాని చుట్టాలతో
అవసరాలకుమించి
బంధాల సుడి గుండాల్లో
చిక్కుకుని, భావస్పర్ష ఘర్షణల్లో
ముసుగులేసుకుని-ఎవరికి తెలియని
మంచితనాన్ని ఆపాదించుకుని
కుంచించుకుంటూ-కంగారు పడుతూ
హడావుడిగా బ్రతుకుతున్న
మనకు.......
అసలు నిజం తెలిసేదెపుడు...

నా నుండి నేను దూరమవుతూ ...


సత్యాలను తెలుసుకోడానికి
జీవితకాలం కావాలా?
జీవితం సత్యమా???

అశృధారల ప్రవాహంలో
అంతు చిక్కని ఆలోచనలతో

మౌనంగా చీకటిగదిలో
నా పక్కనే నేనుంటూ, ఒదార్చుకుంటూ,
నీడతోడుగా...నేను -
అర్థంకాకుండా!!


ఎందుకో నా నవ్వును
తీసుకుని పరుగెడుతూ నువ్ ,

నా నుండి దూరమవుతూ
శూన్యంలో నిన్ను వెతుకుతూ నేను


వ్యర్థంగా.......................

నీ జ్ఞాపకాల శిధిలాల్లో!!!


ఆకలితో ఉన్న నాకు దొరికిన పరమాన్నం
నీతో పరిచయం....

బ్రతుక్కి అర్థం లేకుండా-తెలియకుండా
ఉంటున్న నా జీవితం?
నీ రాకతో పరిపూర్ణమైంది.....

అనుకున్నాను...


నీ నవ్వులో పువ్వులేరుకుంటూ
సంబరపడ్డాను..సంతోశించాను,
ఆఖరికి నువ్ నన్ను వొదిలిన క్షణాన కూడా
ఎదిరించలేని భాధ పడిన నీ హృదయాన్ని
తల్చుకుని ఎడ్చానేకాని - అది స్వార్థపు
ముసుగేసుకుని నన్ను చంపడానికని అనుకోలేదు.

ఐనా నువ్వంటే నాకు ఇష్టమే ఎప్పటికి..

కాని...

నీ జ్ఞాపకాల శిధిలాల్లో
చిక్కుకుని
బిక్కు బిక్కుమంటూ
కొన ఊపిరితో నేను.......

గుండె గదికి కిటికీ లేదెందుకో......


బరువుగా నా కళ్లు మత్తుగా కూడా..
ఐనా శాంతిలేదు ఎందుకో!

నిన్నటి ఆ జ్ఞాపకాల వెగటు వాసనలు
అసహ్యంగా అటూ-ఇటూ తిరుగుతూ,
అక్కడే తచ్చాడూతున్నాయి.

ఆశల పిల్లగాలుల తెమ్మెరలు లేక,
ఎండిన మొండి గోడల బీటలు చిత్రంగా అదోలా.

రాత్రి కలత కలల్లో భవిష్యత్తు మసగ్గా !!!
ఐనా నా గుండె గదికి కిటికీ లేదెందుకో......

ఆఖరి శ్వాసలో మన బంధం !!




జీవితం అద్భుతం


అంతులేని ఆనందం
ప్రకృతి నాకందించిన
వరం.................

నీ పరిచయంతో అవి రెట్టింపయ్యి
ఆకసం-సముద్రాలు నేస్తాలయ్యాయి....

నీ కల్మషపు ఇష్టాన్ని
ప్రేమ అనుకున్నాను,.. నా గుండెను చీద్రం చేసి
మంటలను రేపుతున్నాయి ఇంకా............
ఏం చేయాలో తెలియక
నీ కళ్ళను ఆశ్రయిస్తే
అపహాస్యం చేస్తూ వెక్కిరిస్తున్నాయి...


నీ పైన నా ఇష్టం నాలోని మనిషిని
ఎదగనివ్వలేదేమో కదా...??


నాలోని నీ పైన ప్రేమ నశిస్తూ................