నిశ్శబ్దం!!



నిశ్శబ్దంలో నిన్ను చేరి
నీతో ఊసులాడుతూ,
గతించిన కాలం మనల్నెలా విడదీసిందో
చెప్పడానికి ప్రయత్నిస్తాను!

సమాజం రివాజుల ముందు
నా ఆదర్శం (అనుకున్నాను) మరుగుజ్జయింది
మనసులోని ఇష్టాలను భవిష్యత్తు కష్టాలు బయపెట్టాయి .
కాల ప్రవాహంలో నేనూ ఒక బొట్టయ్యాను నాకు తెలియకుండనే
అర్థమయ్యి తిరిగి చూస్తే….. మసగ్గానైనా నువ్ కనబడలేదు.

నాలోని బయం స్వార్థంగా మారిందేమో అపుడు
ఇంకేమి ఆలోచించలేకపోయను (నా అసమర్ధత అని నాకు అర్థమవుతుందిపుడు)
నువ్వన్న ప్రేమ బహుష నాలో లేదేమో అప్పుడూ-ఇప్పుడు కూడా!!

మరణానికి చేరువలో ఉన్న నేను

అందరూ వద్దనుకున్న నేను
అప్పటి నా అసమర్ధతను సమర్ధించుకోడనికి
ఇప్పుడు పడుతున్న తాపత్రయాన్ని చూస్తుంటే నా మీద నాకే
అసహ్యంగా అనిపిస్తోంది.
అన్నీ తలుచుకుంటుంటే కాల్తున్న చితిపైన పడుకున్న అనుభూతి

మరి ఇవన్ని నీకు ఇపుడె ఎందుకు చెబుతున్నాను ?
పశ్చాతాపం పేరుతో ఏం చేయలనుకుంటున్నాను….??

ఏమో ????

బహుషా కనీసం నీ దౄష్టిలోనైనా నా అసమర్ధతను , చేతకానితనాన్ని
మంచితనంగా అనిపించుకోవాలనేమోఏమో
రేపో మాపో నాకూ ఈ లోకానికి సంబంధం తీరిపోతుంది!
మరి నేను నీకు చేసిన ద్రోహం మాటేమిటి??

క్షమించమని అడిగే అర్హత నాకు లేదని తెలుసు
అందుకే
మౌనంగా నిశ్శబ్దాన్ని వింటూ,

చీకటి గదిలో

ఎదిరిచూస్తున్నా ఆ క్షణానికై !!

0 comments: