ఆ స్నేహం...

అవయవాలు కృంగి
అచేతనంగ ఉన్నాను

అవసరాలు స్వైర విహారం
చేస్తూ అసహాయత్వాన్ని చూస్తూ
వికటట్టహాసం చేస్తూ
కర్కశంగా నా నిస్సహాయ స్థితిని
ముక్కలు ముక్కలుగా చేస్తూ....
ప్రపంచం నన్ను దూరం చేస్తే
నాలోని మనిషిని చంపి, వికృతంగా
ఆ రక్తం తో పండగ చేసుకుంటుంటే

ఇంకిపోయిన కళ్ళు
ముసకబారి-దారి కనబడక
చావు వైపు అడుగులేసిన నన్ను

ఆర్తిగా ఒక హస్తం అక్కున జేర్చుకుంది

ద్వేష రహిత వాక్బాణాలు
నన్ను మామూలు మనిషిని చేశాయి!!

ఎదురుగా నవ్వుతూ చల్లని
కల్మషం లేని ఆ చూపు..

అది చాలు నా జీవితానికి..

మిత్రమా ఏమిచ్చి నీ రుణం తీర్చుకోనూ..??

0 comments: