ఓ యువతా ఇది నా వేడుకోలు ...

బంగారు బాల్యం నుండి బయటకొచ్చి
సమాజపు రెపరెపల అనుభవాల గుంపులోకి
చొరబడే ఓ యువతా.... ఈ సమాజం నీది
ఇక నువ్ మాత్రమే దీనికి మార్గదర్శకుడవు
అలాంటిది ప్రేమ పిచ్చిలో, ఆకర్షణ ముసుగులొ
కొందరి జీవితాలను యాసిడ్ మయం చేస్తూ
నువ్ సాధిస్తున్నది ఏమిటి??
స్వేచ్చను అనుభవిస్తూ విర్రవీగుతున్న నీవు
దానికొరకు ఎన్నివేల ప్రాణాలు బలి అయి ఉంటాయో
ఒక్కసారి ఆలోచించు...
ఈ సమాజం మనం నిర్మించుకున్నది
ఈ సమాజంలో ఉన్న నియమాలు మనం కల్పించుకున్నవి
ఈ సమాజం లో ఉన్న కట్టు బాట్లు - బయాలు అన్నీ కూడా మనవే సుమా..
మరి అవన్ని ఎందుకోసం...?

నువ్వు-నిన్ను కన్న తల్లి - నీ కుటుంబం అలాగే నీ లాంటి ఈ సమాజం
అందరు హాయిగా ఉండాలనే కదా..
దానికొరకు ఎందరో నిరంతరం నిన్ను నన్ను ఈ సమాజాన్ని
రక్షించడానికి పలు విధాలుగ రేయింబగళ్ళు తమ ప్రాణాలను సైతం లెక్కచేయక
ఎక్కడెక్కడో పహారా కాస్తున్నారు.
ఒక్క సారి బిచ్చగాడిని గమనించు అలాంటి జీవితం నీకు లేదు
ఒక్కసారి రోగ గ్రస్థులను గమనించు భయంకరమైన జబ్బులతో ఎలా బ్రతుకుతున్నారో
అలాంటి స్థితి నీకు లేదు..ఎందుకంటే ఈ సమాజం నీకు కల్పించిన వసతులు నిన్ను అలాంటి
స్థితిలోకి రాకుండా కాపాడుతున్నాయి.
ఇంతటి ఉన్నతమైన సమాజంలో ఉంటు దానినే కలుశితం చేస్తావా.....

ఓ యువతా ఒక్కసారి మళ్ళీ ఆలోచించు...

ఈ సమాజాన్ని పునర్నిర్మించవలసింది నువ్వే
ఈ సమాజాన్ని రక్షించాల్సింది నువ్వే
ఈ సమాజం నీదీ నాదీ మనందరిదీ

సమాజం బాగుండాలంటే
అది కేవలం నీ వలన్నే సాద్యం..

ఓ యువతా ఇది నా వేడుకోలు ...

0 comments: